అంధుడి పాత్రలో మన్మథుడు..? | king Nagarjuna to star in Oppam remake | Sakshi
Sakshi News home page

అంధుడి పాత్రలో మన్మథుడు..?

Published Fri, Sep 30 2016 12:51 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

అంధుడి పాత్రలో మన్మథుడు..? - Sakshi

అంధుడి పాత్రలో మన్మథుడు..?

సీనియర్ హీరోలు ఇమేజ్ను పక్కన పెట్టి ప్రయోగాలకు సిద్ధమవుతుండటంతో ఇతర భాషల్లో తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రాల రీమేక్లకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పటికే దృశ్యం, ఊపిరి లాంటి సినిమాలు ఇదే బాటలో తెరకెక్కి ఘనవిజయాలు సాధించాయి. తాజాగా మరో మలయాళ సినిమా ఈ లిస్ట్ చేరబోతోంది.

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ఒప్పం సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. అంధుడైన ఓ లిఫ్ట్ ఆపరేటర్, ఓ హత్యకేసు నిందితుణ్ని ఎలా పట్టుకున్నాడు అన్నదే సినిమా కథ. మాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో కింగ్ నాగార్జున హీరోగా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు.

ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓం నమోవేంకటేశాయ సినిమాలో నటిస్తున్న నాగ్ ఆ తరువాత ఒప్పం రీమేక్లో నటించే అవకాశం ఉంది. ఇటీవల ఊపిరి సినిమాలో వీల్ చైర్కే పరిచయం అయిన పాత్రలో కనిపించిన నాగ్.. అంధుడి పాత్ర చేయడానికి ఇంట్రస్ట్ చూపించే అవకాశం ఉంది. ఇదే సినిమాను బాలీవుడ్ అజయ్ దేవగన్ హీరోగా రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement