హత్య కేసులో మహిళకు ఏడేళ్ల జైలు | seven years in prison for woman | Sakshi
Sakshi News home page

హత్య కేసులో మహిళకు ఏడేళ్ల జైలు

Published Fri, Jan 20 2017 12:09 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM

seven years in prison for woman

అనంతపురం సెంట్రల్‌ : అనంతపురం రూరల్‌ మండలం సోములదొడ్డిలో జరిగిన ఓ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ అదనపు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు రూపల్‌ సీఐ కృష్ణమోహన్‌ గురువారం తెలిపారు. సోములదొడ్డిలో 2014 మే 6న వినాయకుని విగ్రహాల తయారీ విషయంలో రెండు వర్గాల వారు ఘర్షణకు దిగారు. ఘటనలో చిన్న తిమ్మరాజు అనే వ్యక్తిని శ్రీనివాసులు భార్య మీనాక్షి, ఆమె కుమారుడు(మైనర్‌) దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని సీఐ తెలిపారు.

బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పట్లో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. కేసు పూర్వపరాల పరిశీలన, సాక్షుల విచారణ అనంతరం మీనాక్షిపై నేరం రుజువు కావడంతో ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష సహా రూ.10 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారన్నారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మైనర్‌కు సంబంధించిన కేసు జువైనల్‌ జస్టిస్‌ బోర్డు(జేజేబీ)లో విచారణలో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement