in prison
-
ఇరాన్లో మహిళా జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు
దుబాయ్: ఇద్దరు మహిళా జర్నలిస్టులకు ఇరాన్ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. గతేడాది ఇరానీ మహిళ మహసా అమినీ కస్టడీ మరణం పెను సంచలనం సృష్టించడం, దాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడం తెలిసిందే. ఆ కస్టడీ మరణంపై రిపోరి్టంగ్ చేసినందుకు సదరు మహిళా జర్నలిస్టులు ఆలాహే మొహమ్మది (36), నిలోఫర్ హమెదీ (31)లను దోషులుగా న్యాయ శాఖ నిర్ధారించింది. అలాహేకు ఆరు సంవత్సరాలు, హమెదీకి ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడింది. వారిద్దరూ 2022 సెపె్టంబర్ నుంచీ టెహ్రాన్‌లోని ఎవిన్ జైలులో మగ్గిపోతున్నారు. గత మే నెలలో వారిపై విచారణ మొదలైంది. తాజా తీర్పుపై వారు అప్పీల్‌కు వెళ్లేందుకు అవకాశం కలి్పంచామని న్యాయ శాఖ పేర్కొంది. -
హత్య కేసులో మహిళకు ఏడేళ్ల జైలు
అనంతపురం సెంట్రల్ : అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డిలో జరిగిన ఓ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ అదనపు ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు రూపల్ సీఐ కృష్ణమోహన్ గురువారం తెలిపారు. సోములదొడ్డిలో 2014 మే 6న వినాయకుని విగ్రహాల తయారీ విషయంలో రెండు వర్గాల వారు ఘర్షణకు దిగారు. ఘటనలో చిన్న తిమ్మరాజు అనే వ్యక్తిని శ్రీనివాసులు భార్య మీనాక్షి, ఆమె కుమారుడు(మైనర్) దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని సీఐ తెలిపారు. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పట్లో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. కేసు పూర్వపరాల పరిశీలన, సాక్షుల విచారణ అనంతరం మీనాక్షిపై నేరం రుజువు కావడంతో ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష సహా రూ.10 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారన్నారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మైనర్‌కు సంబంధించిన కేసు జువైనల్ జస్టిస్ బోర్డు(జేజేబీ)లో విచారణలో ఉంది. -
చెల్లని చెక్కు కేసులో ఆర్నెల్ల జైలు
ఖమ్మం లీగల్ : స్థానిక ద్వారకానగర్‌కు చెందిన జి.రవికుమార్‌కు చెల్లని చెక్కు జారీ చేసిన కేసులో ఖమ్మం స్పెషల్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి సతీష్‌కుమార్ ఆరు నెలల జైలు శిక్షతోపాటు ఫిర్యాదికి రూ.1.50 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని మంగళవారం తీర్పు చెప్పారు. ఖమ్మం కవిరాజ్‌నగర్‌కు చెందిన గాజా రమేష్‌కుమార్ వద్ద రవికుమార్ తన కుటుంబ అవసరాల కోసం జనవరి 5, 2012న రూ.1.50 లక్షలు తీసుకుని ప్రాంసరీ నోటు రాసిచ్చాడు. అప్పు తీర్చమని అనేకసార్లు అడగ్గా.. జనవరి 20, 2013న రూ.1.50 లక్షలకు చెక్ ఇచ్చాడు. ఫిర్యాది ఆ చెక్కును తన ఖాతాలో జమ చేయగా.. అకౌంట్లో సరిపడినంత నగదు లేక చెక్కు నిరాదరణకు గురైంది. ఫిర్యాది చట్ట ప్రకారం లీగల్ నోటీసు పంపి.. కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. ఈ కేసులో ఇరుపక్షాల సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువైందని భావించి ముద్దాయికి 6 నెలల జైలు శిక్షతోపాటు ఫిర్యాదికి నష్టపరిహారంగా రూ.1.50 లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పారు. ఫిర్యాదిదారు తరఫు న్యాయవాదిగా మందడపు శ్రీనివాసరావు వ్యవహరించారు. -
అత్యాచారం కేసులో వ్యక్తికి పదేళ్ల జైలు
న్యూఢిల్లీ: మహిళపై దాడి చేసి అత్యాచారం చేయడంతోపాటు ఆమెను హతమార్చడానికి యత్నించిన కేసులో 45 ఏళ్ల వ్యక్తికి ఢిల్లీ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2014 జూన్ 24న తన ఇంటిలో ఒంటరిగా ఉన్న మహిళ వద్దకు వచ్చిన ఓ డ్రైవర్.. తాగడానికి నీరు కావాలని అడిగాడు. ఇంతలోనే ఆమెపై అమాంతం దాడికి పాల్పడి సెల్‌ఫోన్ చార్జర్ సాయంతో ఆమెను కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతోపాటు ఆమెను చంపేందుకు యత్నించాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన కోర్టు.. అతడి చర్యను అత్యంత పాశవిక, ఆటవికమైనదిగా అభివర్ణించింది. నేరస్తుడికి కుటుంబం ఉన్నప్పటికీ బాధిత మహిళ ఆక్రందనను దృష్టిలో ఉంచుకొని అతనికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు అడిషనల్ సెషన్స్ జడ్జి సంజీవ్ జైన్ గురువారం తీర్పు వెలువరించారు. -
భార్య మృతికి కారణమైన భర్తకు ఏడేళ్ల జైలు
రంగారెడ్డి: కట్నం వేధింపులతో భార్య బలవన్మరణానికి కారకుడైన భర్తకు న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... మీర్పేట్ త్రివేణి నగర్లో నివాసముండే దీపక్‌బాబు, సుచరిత దంపతుల వివాహం 2010 జూన్ నెలలో జరిగింది. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. దీపక్‌బాబు మరింత కట్నం తేవాలంటూ సుచరితను శారీరకంగా, మానసికంగా వేధించాడు. ఈ క్రమంలో 2013 ఏప్రిల్ 24న దంపతుల మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపం చెందిన సుచరిత అదే రోజు రాత్రి ఇంట్లోనే ఊరేసుకుని మరణించింది. ఆమె తండ్రి ప్రకాష్ ఫిర్యాదు మేరకు మీర్‌పేట పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగపత్రం నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి గురువారం తీర్పునిచ్చారు. దీపక్బాబుకు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.