న్యూఢిల్లీ: మహిళపై దాడి చేసి అత్యాచారం చేయడంతోపాటు ఆమెను హతమార్చడానికి యత్నించిన కేసులో 45 ఏళ్ల వ్యక్తికి ఢిల్లీ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2014 జూన్ 24న తన ఇంటిలో ఒంటరిగా ఉన్న మహిళ వద్దకు వచ్చిన ఓ డ్రైవర్.. తాగడానికి నీరు కావాలని అడిగాడు. ఇంతలోనే ఆమెపై అమాంతం దాడికి పాల్పడి సెల్‌ఫోన్ చార్జర్ సాయంతో ఆమెను కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతోపాటు ఆమెను చంపేందుకు యత్నించాడు.
ఈ ఘటనపై విచారణ జరిపిన కోర్టు.. అతడి చర్యను అత్యంత పాశవిక, ఆటవికమైనదిగా అభివర్ణించింది. నేరస్తుడికి కుటుంబం ఉన్నప్పటికీ బాధిత మహిళ ఆక్రందనను దృష్టిలో ఉంచుకొని అతనికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు అడిషనల్ సెషన్స్ జడ్జి సంజీవ్ జైన్ గురువారం తీర్పు వెలువరించారు.
అత్యాచారం కేసులో వ్యక్తికి పదేళ్ల జైలు
Published Thu, May 5 2016 8:45 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM
Advertisement