దుబాయ్: ఇద్దరు మహిళా జర్నలిస్టులకు ఇరాన్ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. గతేడాది ఇరానీ మహిళ మహసా అమినీ కస్టడీ మరణం పెను సంచలనం సృష్టించడం, దాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడం తెలిసిందే.
ఆ కస్టడీ మరణంపై రిపోరి్టంగ్ చేసినందుకు సదరు మహిళా జర్నలిస్టులు ఆలాహే మొహమ్మది (36), నిలోఫర్ హమెదీ (31)లను దోషులుగా న్యాయ శాఖ నిర్ధారించింది. అలాహేకు ఆరు సంవత్సరాలు, హమెదీకి ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడింది. వారిద్దరూ 2022 సెపె్టంబర్ నుంచీ టెహ్రాన్‌లోని ఎవిన్ జైలులో మగ్గిపోతున్నారు. గత మే నెలలో వారిపై విచారణ మొదలైంది. తాజా తీర్పుపై వారు అప్పీల్‌కు వెళ్లేందుకు అవకాశం కలి్పంచామని న్యాయ శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment