కరీనా కపూర్ హీరోయిన్‌గా 2012లో హీరోయిన్ మూవీ రిలీజైంది. ఇప్పుడు ప్రస్తావన సినిమా గురించి కాదు! ఇందులో యాక్ట్ చేసిన నటి మీనాక్షి థాపర్ గురించి! ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమెకు ఇదే చివరి సినిమా! చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన మీనాక్షి గురించే నేటి ప్రత్యేక కథనం..
సినిమా ఛాన్స్‌కు ముందు
1984 అక్టోబర్ 4న మీనాక్షి థాపర్ జన్మించింది. డెహ్రాడూన్‌లో తన విద్యాభ్యాసం జరిగింది. సినిమాల మీద ఆసక్తితో ముంబైలో అడుగుపెట్టింది. సినిమా ఛాన్సులు రావడానికి ముందు డ్యాన్స్ క్లాసులు నేర్పించింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత 2011లో 404 అనే హారర్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ అవలేదు.
సెట్స్‌లో అదృశ్యం
తర్వాత మధుర్ భండార్కర్ సినిమా 'హీరోయిన్'లో ఛాన్స్ వచ్చింది. కరీనా కపూర్‌తో యాక్ట్ చేసే అవకాశం వచ్చిందని సంబరపడిపోయింది. త్వరలోనే నటిగా గొప్ప స్థాయికి చేరుకోవచ్చని భావించింది. అంతలోనే ఆమె సంతోషాన్ని తుంచేశారు. హీరోయిన్ సినిమా కోసం సెట్స్‌కి రాగా అక్కడే ఆమె అదృశ్యమైంది. ఆమె ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ అర్థం కాలేదు. 2012 మార్చి 13న నటి తల్లికి ఫోన్ కాల్ వచ్చింది.
రూ.15 లక్షలు డిమాండ్
అందులో మీనాక్షి మాట్లాడుతూ.. తన ఫ్రెండ్స్ అమిత్ కుమార్ జైస్వాల్, ప్రీతి సురిన్‌తో కలిసి అలహాబాద్‌కు వెళ్తున్నట్లు వెల్లడించింది. మూడు రోజుల తర్వాత ముగ్గురి ఫోన్లు స్విచ్చాఫ్ అయ్యాయి. మార్చి 17న మీనాక్షి తల్లికి ఒక మెసేజ్ వచ్చింది. మీ కూతురు క్షేమంగా ఉండాలంటే రూ.15 లక్షలు పంపండి.. మూడు రోజులు మాత్రమే గడువు అని వార్నింగ్ ఇచ్చారు. పోలీసులకు చెప్తే తను దుస్తులు లేకుండా ఉన్న వీడియోలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తామని బెదిరించారు.
రోజులు గడుస్తున్నా
ఈ బెదిరింపులకు నటి తల్లి లొంగలేదు. ఆర్మీలో పని చేస్తున్న తన కుమారుడితో కలిసి పోలీసులను ఆశ్రయించింది. జరిగిందంతా పూస గుచ్చినట్లు చెప్పింది. రోజులు గడుస్తున్నా మీనాక్షి ఆచూకీ దొరకలేదు. ఒకరోజు అమిత్, ప్రీతి(వీరిద్దరూ ప్రేమించుకున్నారు) బాంద్రాలోని యాక్సిక్ బ్యాంక్ ఏటీఎమ్‌కు చేరుకున్నారు. పోలీసులు వారిని పట్టుకుని విచారించగా అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. మీనాక్షిని హత్య చేసినట్లు అంగీకరించాడు.
శరీరాన్ని ముక్కలుగా
ఏప్రిల్ 16న పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. మీనాక్షిని కిడ్నాప్ చేసిన తర్వా ఆమె తల, మొండెం వేరు చేశారు. అలహాబాద్‌లో ప్రీతి ఇంటికి దగ్గర్లో ఓ సెప్టిక్ ట్యాంక్‌లో తన శరీరాన్ని ముక్కలుగా కోసి పడేశారు. తలను అలహాబాద్ నుంచి లక్నోకు వెళ్తుండగా మార్గ మధ్యలో బస్సులో నుంచి అడవిలో విసిరేశారు. 2018లో న్యాయస్థానంలో నిందితులిద్దరికీ జీవిత ఖైదు విధించింది.
స్నేహితుల అత్యాశ వల్ల 27 ఏళ్ల వయసుకే నటి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఒక తల్లికి తీరని కడుపుకోత మిగిలింది.
చదవండి: సింగర్‌పై బాటిల్ విసిరిన ఆకతాయి.. అయినా సహనం కోల్పోకుండా..
Comments
Please login to add a commentAdd a comment