ఇచ్చట టీజర్‌ వచ్చింది | Prabhas to launch Ichata Vahanumulu Niluparadu teaser | Sakshi
Sakshi News home page

ఇచ్చట టీజర్‌ వచ్చింది

Published Sat, Jan 30 2021 1:28 AM | Last Updated on Sat, Jan 30 2021 1:28 AM

Prabhas to launch Ichata Vahanumulu Niluparadu teaser - Sakshi

సుశాంత్, మీనాక్షి జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్‌’ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. ఎస్‌. దర్శన్‌ దర్శకత్వంలో ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్‌ పతాకాలపై రవిశంకర్‌ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్‌ కోయలగుండ్ల నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను ప్రభాస్‌ విడుదల చేశారు. ఈ టీజర్‌లో నో పార్కింగ్‌ అని బోర్డ్‌ ఉన్నచోట తన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను సుశాంత్‌ పార్క్‌ చేస్తే, కాలనీవాసులు దాన్ని ధ్వంసం చేస్తారు. ఆ తర్వాత కథ ఏంటనేది సినిమాలో చూడాల్సిందే. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement