Loans waiver
-
రేపు మూడో విడత రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ మూడో విడత కింద గురువారం ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో రూ.1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ మేరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. ఈ నెల 2వ తేదీన అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం బుధవారం హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. గతనెల 18న రుణమాఫీ ప్రారంభం కాగా ఇప్పటివరకు రెండు విడతల్లో రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ కింద 17.55 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.12,224 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.రూ.2 లక్షల వరకు రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచి్చన సంగతి తెలిసిందే. కాగా అధికారంలోకి వచి్చన తర్వాత 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ మేరకు రుణమాఫీని ప్రభుత్వం ప్రారంభించింది.ఈ క్రమంలోనే తాజాగా మూడో విడత రుణమాఫీ చేయనుంది. అయితే రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతులు.. ఆ అదనపు మొత్తాన్ని ముందుగా బ్యాంకులకు చెల్లిస్తేనే వారికి రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపజేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న రైతులు ఎంతమంది ఆ అదనపు మొత్తాలను చెల్లించారు? ఇంకా ఎంతమంది చెల్లించాల్సి ఉంది? చెల్లించని వారికి ఇప్పుడు రుణమాఫీ కాకపోతే తర్వాత చేస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
ఉన్నవాళ్లకే మరిన్ని రాయితీలా?
పేదలకు అత్యవసరమైన ఉచితాలను ‘పప్పు బెల్లాలు’ అంటూ చాలామంది గగ్గోలు పెడుతుంటారు. కానీ కార్పొరేట్ కంపెనీలకు అందుతున్న రాయితీల గురించి ఎవరూ మాట్లాడరు. వ్యవసాయ రుణాలను మాఫీ చేసినప్పుడు రుణ సంస్కృతిని అవి విచ్ఛిన్నపరుస్తున్నాయని చాలామంది ఆక్షేపించారు. కానీ భారీ ఎత్తున కార్పొరేట్ పన్నులు తగ్గించడం అనేది ఆర్థిక పురోగతికి దారి తీస్తుందని వీరే తప్పుడు సూత్రాలు వల్లిస్తున్నారు. గత అయిదేళ్లలో రూ.10 లక్షల కోట్ల కార్పొరేట్ నిరర్థక రుణాలను మాఫీ చేసినట్లు కేంద్రప్రభుత్వం ఇటీవలే పార్లమెంటుకు తెలిపింది. అత్యంత సంపన్నుల జేబుల్లో డబ్బును తేరగా పోయడం ద్వారా ఇప్పటికే ఉన్న సంపద అసమానత్వం మరింతగా పెరిగింది. సంపన్నులకు యాభై సంవత్సరాలుగా లభిస్తున్న పన్ను రాయితీలు ఏమాత్రం తగ్గడం లేదని ఒక అధ్యయనాన్ని ఉల్లేఖిస్తూ ‘బ్లూమ్‌బెర్గ్’లో ఒక కథనం ప్రచురితమైంది. లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన ఇద్దరు పరిశోధకులు అధునాతనమైన గణాంక విధానాన్ని ఉపయోగించడమే కాకుండా, 18 పురోగామి ఆర్థిక వ్యవస్థలు అనుసరించిన విధానాలను పరిశీలించారు. సాక్ష్యాధారాలు లేకుండా అనుభవపూర్వకంగా చాలామంది ఇంతకాలంగా చెబుతున్నదాన్ని వీళ్లు ససాక్ష్యంగా నిరూపించారు. అనేకమంది భారతీయ ఆర్థికవేత్తలు కార్పొరేట్ పన్నులను తగ్గించాల్సిన అవసరాన్ని సమర్థించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఈ ఇద్దరు పరిశోధకుల అధ్యయనం (కొద్దిమంది ఇతరులు కూడా) స్పష్టంగా ఒక విషయాన్ని బయటపెట్టింది. పన్ను రాయితీ అనేది ఆర్థిక పురోగతికి సహాయం చేయలేదు. అది మరిన్ని ఉద్యోగావశాలను కూడా కల్పించలేదు. డబ్బును తేరగా అత్యంత సంపన్నుల జేబుల్లో పోయడం ద్వారా ఇప్పటికే ఉన్న సంపద అసమానత్వాన్ని మరింతగా పెంచడంలో పన్ను రాయితీ సాయపడింది. భారతదేశంలో రైతులతో సహా పేదలకు అందిస్తున్న ఉచితాలను ‘పప్పు బెల్లాల’ సంస్కృతి అంటూ ఎన్నో వార్తాపత్రికల కథనాలు ధ్వజమెత్తుతున్నాయి. అదే సమయంలో కార్పొరేట్ సంస్థలకు అంది స్తున్న భారీ స్థాయి ఉచితాల గురించి ఇవి ఏమాత్రం ప్రస్తావించడం లేదు. కొద్దిమంది వ్యాఖ్యాతలను మినహాయిస్తే– మాఫీలు, ట్యాక్స్ హాలిడేలు, ఉద్దీపన ప్యాకేజీలు, పన్ను తగ్గింపులు వంటి కార్పొరేట్ సబ్సిడీల విస్తృతి, స్వభావాన్ని చాలామంది దాచిపెడుతున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు ‘ఫలితం ఇవ్వని ఉచితాలు’ అంటూనే, ఆ మాటకు అర్థమేమిటో స్పష్టంగా నిర్వచించలేక పోయినప్పటికీ, భారత్‌లో కార్పొరేట్ పన్నుల తగ్గింపు కూడా ఈ విభాగంలోనే చేరతుందని అంతర్జాతీయ అధ్యయనాలు తెలుపు తున్నాయి. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త జెఫ్రీ సాచెస్ను గతంలో ఒక ప్రశ్న అడిగారు. పారిశ్రామిక ఉత్పత్తిని ఏమాత్రం పెంచనప్పుడు లేదా అదనపు ఉద్యోగాలను సృష్టించలేకపోయినప్పుడు కార్పొరేట్లకు భారీస్థాయి పన్ను తగ్గింపు ద్వారా ఏం ఫలితం దక్కింది అని ప్రశ్నించారు. పన్ను రాయితీల ద్వారా ఆదా అయిన డబ్బు కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌ల జేబుల్లో పడిందని ఆయన క్లుప్త సమాధానం ఇచ్చారు. కొన్ని ప్రముఖ ఆర్థిక వ్యవస్థల్లో కేంద్ర బ్యాంకులు వాస్తవంగా అత్యంత ధనవంతుల జేబుల్లోకి చేరేలా అదనపు డబ్బును ముద్రించాయి. 2008–09 కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిన రోజుల్లో పరిమాణాత్మక సడలింపు అనే పదబంధాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. ఈ పేరుతో ధనిక దేశాలు 25 లక్షల కోట్ల డాలర్ల అదనపు డబ్బును ముద్రించాయి. తక్కువ వడ్డీరేటుతో, అంటే సుమారు రెండు శాతంతో ఫెడరల్ బాండ్ల రూపంలో ఆ సొమ్మును సంపన్నులకు జారీ చేశాయి. ఈ మొత్తం డబ్బును వాళ్లు అభివృద్ధి చెందుతున్న దేశాల స్టాక్ మార్కెట్లలో మదుపు చేశారు. అందుకే ఆ కాలంలో బుల్ మార్కెట్లు ఎలా పరుగులు తీశాయో చూశాం. మోర్గాన్ స్టాన్లీకి చెందిన రుచిర్ శర్మ ఒక వ్యాసంలో కరోనా మహమ్మారి కాలంలో జరిగిన తతంగంపై రాశారు. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో 9 లక్షల కోట్ల డాలర్ల నగదును అదనంగా ముద్రించారనీ, కునారిల్లిపోయిన ఆర్థిక వ్యవస్థలకు ఉద్దీపన ప్యాకేజీలను అందించడమే దీని లక్ష్యమనీ చెప్పారు. కానీ ఉద్దీపన ప్యాకేజీల కోసమని కేటాయించిన ఈ మొత్తం నగదు స్టాక్ మార్కెట్ ద్వారా అత్యంత సంపన్నుల జేబుల్లోకి వెళ్లిపోయిందని వెల్లడించారు. ఈ భారీమొత్తం ఏ రకంగా చూసినా ఉచితాల కిందకే వస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కల్లోల పరిస్థితుల్లో ఉన్న 2008–09 కాలంలో భారతదేశంలో 1.8 లక్షల కోట్ల రూపాయలను ఆర్థిక ఉద్దీపన పేరుతో పరిశ్రమ వర్గాలకు అందుబాటులో ఉంచారు. ఈ భారీ ప్యాకేజీని ఒక సంవత్సరం తర్వాత ఉపసంహరించుకోవాలి. కానీ ఒక వార్తా నివేదిక ప్రకారం, ప్రభుత్వంలో ఎవరో ‘నల్లాను ఆపేయడం’ మర్చిపోయారు. దీని ఫలితంగా ఉద్దీపన కొనసాగుతూ వచ్చింది. మరో మాటల్లో చెప్పాలంటే, ఆ తర్వాత పదేళ్ల కాలంలో భారత పరిశ్రమ దాదాపుగా రూ. 18 లక్షల కోట్ల డబ్బును ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా అందుకుంది. దీనికి బదులుగా ఈ మొత్తాన్ని వ్యవసాయ రంగానికి అందుబాటులోకి తెచ్చి ఉంటే, ప్రధానమంత్రి కిసాన్ పథకంలో భాగంగా మన రైతులకు యేటా ఒక్కొక్కరికి 18 వేల రూపాయల మేరకు అదనంగా ప్రత్యక్ష నగదు మద్దతు కింద అంది ఉండేది. సెప్టెంబర్ 2019లో భారత పరిశ్రమకు మరోసారి రూ. 1.45 లక్షల కోట్ల పన్నులను ప్రభుత్వం తగ్గించింది. చాలామంది ఆర్థిక వేత్తలు గ్రామీణ డిమాండును ప్రోత్సహించడం కోసం ఆర్థిక ఉద్దీపనను అందించాలని కోరుతున్న సమయంలో మళ్లీ కార్పొరేట్ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కరుణించింది. దాదాపు రూ.2.53 లక్షల కోట్ల మేరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేసినప్పుడు రుణ సంస్కృతిని అవి విచ్ఛిన్నపరుస్తున్నాయని ఆర్థికవేత్తలు ఆరోపించారు. కానీ భారీ ఎత్తున కార్పొరేట్ రుణాలను మాఫీ చేయడం వల్ల ఆర్థిక పురోగతికి దారి తీస్తుందని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. గత అయిదేళ్లలో రూ. 10 లక్షల కోట్ల కార్పొరేట్ నిరర్థక రుణాలను కొట్టేసినట్లు ప్రభుత్వం ఇటీవలే పార్లమెంటుకు తెలిపింది. కార్పొరేట్ పన్నులు తగ్గించడం ద్వారా వచ్చే ప్రయోజనాలు సగటు మనిషిని చేరుకోలేదు. సంపన్నులు మాత్రమే వాటినుంచి లబ్ధిపొందారు. ఇది సంపన్నులకు, పేదలకు మధ్య అంతరాన్ని మరింతగా పెంచింది. వ్యవసాయ రుణాలను మాఫీచేసినప్పుడు బ్యాంకులు తమకు రావలసిన అసలు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డిమాండ్ చేసి మరీ తీసుకుంటాయి. కానీ కార్పొరేట్ రుణాలను మాఫీ చేసినప్పుడు బ్యాంకులు పైసా డబ్బును కూడా వసూలు చేయలేక దెబ్బతింటాయి. దేశంలో రుణాలు చెల్లించే సామర్థ్యం ఉండి కూడా ఎగవేస్తున్న సంస్థలు 10 వేల వరకు ఉంటాయి. రెండు వేలమంది రైతులు తీసుకున్న రుణాలను చెల్లించలేదని జారీ చేసిన అరెస్టు వారెంట్లను కొన్ని నెలలక్రితం పంజాబ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కానీ ఉద్దేశ పూర్వకంగా రుణాలు ఎగ్గొడుతున్న వారిని మాత్రం స్వేచ్ఛగా వదిలేస్తున్నారు. మునుపటి ప్రణాళికా సంఘం సబ్సిడీపై కార్యాచరణ పత్రాన్ని రూపొందించింది. న్యూఢిల్లీలో ఎకరాకు రూపాయి చొప్పున 15 ఎకరాల భూమిని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి సబ్సిడీల పేరిట అప్పనంగా ధారపోశారని ఇది బయటపెట్టింది. ఐటీ రంగంతో సహా ప్రైవేట్ ఆసుపత్రులు, పరిశ్రమలకు తరచుగానే చదరపు మీటరుకు ఒక రూపాయి చొప్పున భూమిని ధారపోస్తున్నారు. అదే సమయంలోనే మౌలిక వసతుల కల్పనకు, వడ్డీ, మూలధనం, ఎగుమతులతో పాటు విద్యుత్, నీరు, ముఖ్యమైన సహజ వనరులకు కూడా సబ్సిడీలు అందిస్తున్నారు. ఇవి చాలవన్నట్లుగా పలు రాష్ట్రాలు నూరు శాతం పన్ను మినహాయింపు, ‘ఎస్జీఎస్టీ’ మినహాయింపు వంటి ప్రోత్సాహకాలను అందజేస్తున్నాయి. ఈరకంగా కార్పొరేట్ ఇండియా కూడా భారీ సబ్సిడీలు, ఉచితాల మీదే ఎలా బతుకీడుస్తోంది అనేది అధ్యయనం చేయడం ఆసక్తికరంగా ఉంటుంది. దీంతో అమూల్యమైన వనరులు హరించుకుపోతున్నాయి. పేదలకు కొద్ది మొత్తం ఉచితాలు మిగులుతున్నాయి. - దేవీందర్ శర్మ ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
బ్యాంకులకు అప్పులు ఎగవేసిన కంపెనీలు.. మాఫీ అయిన లక్షల కోట్ల జాబితా ఇదే!
గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు మాఫీ చేసిన రుణాల మొత్తం ఎంతో తెలుసా?.. దేశంలోని సగానికిపైగా రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే కూడా ఎక్కువ. అక్షరాలా తొమ్మిది లక్షల తొంభై ఒక్క వేల ఆరు వందల నలభై కోట్లు.. ఇందులో ఒక్క స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన రికార్డులలో నుంచి తొలగించిన (రైటాఫ్ చేసిన) అప్పు రూ.2,04,486 లక్షల కోట్లు..చిన్న వ్యాపారాలు చేస్తూ అనారోగ్యంతోనో, మరో కారణంతోనో నష్టాల బారినపడి రుణాలు చెల్లించలేకపోయిన 1.86 కోట్ల మంది తీసుకున్న రుణాల మొత్తం రూ.1.41 లక్షల కోట్లు అయితే.. రూ.100 కోట్లు, ఆపై రుణాలు తీసుకుని ఎగవేసిన 5,400 మందిలో టాప్ 810 మంది రుణాల మొత్తం ఏకంగా రూ.2.41 లక్షల కోట్లు కావడం గమనార్హం. ఈ లెక్క ఇక్కడితో ఆగిపోలేదు. ఏటేటా పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు రూ.9.91 లక్షల కోట్లను బ్యాంకులు నిరర్థక ఆస్తుల కింద గుర్తించి రికార్డుల నుంచి తొలగించాయి. ఇలా రైటాఫ్ చేసినా కూడా ఎగవేతదారుల నుంచి రుణ వసూలు ప్రక్రియ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. ఇదంతా పేరుకేనని, బ్యాంకులు వారి నుంచి రుణాల వసూలుపై సీరియస్‌గా వ్యవహరించడం లేదని బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు గగ్గోలు పెడుతున్నాయి. రుణాలు ఇచ్చేటప్పుడు మాత్రమే కాదు రుణమాఫీ కోసం కూడా కొందరు బ్యాంకుల ఉన్నతాధికారులు ఎగవేతదారులకు సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. మామూలు ఉద్యోగికి అన్ని అర్హతలు ఉండి వ్యక్తిగత రుణం కోసమో, గృహ రుణం కోసమో దరఖాస్తు చేస్తే.. సవాలక్ష కొర్రీలు పెడుతున్న బ్యాంకులు ఎగవేతదారులకు మాత్రం సులభంగా రుణాలు మంజూరు చేస్తున్నాయని పుణేకు చెందిన వివేక్ వేలంకర్ ఇటీవల విజిలెన్స్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అందుకు ఆధారాలుగా వందల కొద్దీ డాక్యుమెంట్లను అందజేశారు. అయినా ప్రయోజనం లేదని, ఈ దేశంలో ధనవంతులకు ఉన్న వెసులుబాటు పేదలకు లేదని వేలంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో ఉద్దేశపూర్వక ఎగవేతదారులు! తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా రుణ ఎగవేతదారులు వేల సంఖ్యలో ఉండగా.. అందులో ఉద్దేశపూర్వకంగా ఎగవేతకు పాల్పడినవారు వందల మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్లు పైబడిన బకాయిదారుల్లో ఉద్దేశపూర్వకంగా ఎగవేసినవారు 90 శాతానికిపైగా ఉన్నారని రిజర్వు బ్యాంకు అధ్యయనంలో తేలింది. ఆర్టీఐ కింద పొందిన సమాచారం ప్రకారం.. 31 డిసెంబర్ 2021 నాటికి దేశవ్యాప్తంగా 2,237 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులు ఉన్నారు. వారు రుణం ఎగవేతపై ముందే నిర్ణయించుకుని రూ.1,84,863.32 లక్షల కోట్లను బ్యాంకుల నుంచి తీసుకున్నారు. ఈ 2,278 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాను రిజర్వు బ్యాంకు ఇటీవల సమాచార హక్కు చట్టం కింద విడుదల చేసింది. ‘‘ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఎగవేయాలనుకున్న వారి పేర్లను అడిగాను. అతి కష్టం మీద ఆర్బీఐ ఆ జాబితా అందజేసింది. ఆ సమాచారం ప్రకారం 312 మంది పెద్ద ఉద్దేశపూర్వక ఎగవేతదారులు రూ.100 కోట్లు అంతకంటే ఎక్కువ రుణాలను ఎగ్గొట్టారు. వారందరి బకాయిలు కలిపి రూ.1.41 లక్షల కోట్లు ఉన్నాయి. ఈ ఎగవేతదారులందరిపై కేసులు నమోదు చేశామని ఆర్బీఐ చెప్తున్నా.. ఏ ఒక్కరి మీద కూడా కనీస చర్యలు లేవు‘ అని పుణేకు చెందిన వివేక్ వేలంకర్ చెప్పారు. రుణ ఎగవేతదారుల వివరాల కోసం ఆయన ఏడాదిగా ఉద్యమం చేస్తున్నారు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత దేశవ్యాప్తంగా 25 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులను ఆయన గుర్తించి.. సీబీఐ, ఈడీ వంటి సంస్థలకు ఫిర్యాదు చేశారు. కస్టమర్ల డేటా గోప్యత పేరుతో.. ప్రభుత్వ రంగ బ్యాంకులు ‘కస్టమర్ డేటా గోప్యత’ పేరిట పెద్ద ఎగవేతదారుల పేర్లను బహిర్గతం చేయడానికి నిరాకరిస్తున్నాయి. నిజానికి అక్రమంగా రుణాలు ఇవ్వడమే కాదు, వాటిని ఎగవేయడానికి కూడా కొన్ని బ్యాంకుల అధికారులు, సిబ్బంది సహకరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ‘‘ఎగవేతదారుల ఆస్తులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకునే బదులు.. ఎగవేతదారుల తరఫున దివాలా ప్రక్రియ ప్రారంభించడానికి బ్యాంకు ఉన్నతాధికారులే వత్తాసు పలుకుతున్నారు. ఒకసారి దివాలా ప్రక్రియ ప్రారంభమైందంటే ఎగవేతదారులకు ఎలాంటి ఢోకా ఉండదు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు మాజీ ఎంపీలు, ఒక ప్రస్తుత ఎంపీ ఈ రకంగా బ్యాంకులను దివాలా తీయించారు’’ అని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రుణ ఎగవేతదారుల్లో చాలా మంది కంపెనీల పేరిట తీసుకున్న రుణాల సొమ్మును కుటుంబ సభ్యుల పేరిట ఆస్తుల కొనుగోలుకు బదలాయించారు. కొందరు విదేశాలకు తరలించారు. హైదరాబాద్‌కు చెందిన రెండు విద్యుత్ కంపెనీలు బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తాన్ని ఇలా దుర్వినియోగం చేశాయి’’ అని ఆర్బీఐ అధికారి ఒకరు వివరించారు. చదవండి: Anand Mahindra: ‘ఇదే నా టాలెంట్, ప్లీజ్ సార్ జాబ్ ఇవ్వండి’.. ఆనంద్ మహీంద్రా రిప్లై ఇదే! -
తాటి, ఈత చెట్లపై పన్ను రద్దు
-
గీత కార్మికులపై వరాల జల్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని గీత కార్మికులపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. తాటి, ఈత చెట్లపై పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్టు, దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్న బకాయిలనూ మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. సొసైటీల్లో లేని గీత కార్మికులకు పెన్షన్, లైసెన్సు రెన్యువల్ గడువు పెంపు తదితర హామీలు ఇచ్చారు. ఈ మేరకు గురువారం శాసనసభలో కేసీఆర్ పలు కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు ప్రభుత్వం బహుముఖంగా కృషి చేస్తోందన్నారు. ప్రధానంగా వ్యవసాయ, నీటి వనరుల అభివృద్ధి, కులవృత్తులకు ప్రోత్సాహం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వారిలో గౌడ సామాజిక వర్గం ప్రధానమైనదని.. కానీ వారు సమైక్య రాష్ట్రంలో తీవ్ర నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురయ్యారని ఆరోపించారు. మాట నిలబెట్టుకుంటున్నాం.. సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వం నుండి గీత కార్మికులకు ఎలాంటి సహాయం లభించలేదని.. పైగా లిక్కర్ లాబీల ప్రలోభాలకు తలొగ్గి హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను మూసేశారని కేసీఆర్ పేర్కొన్నారు. మరోవైపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గుడుంబా మహమ్మారి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే కళ్లప్పగించి వేడుక చూశారని మండిపడ్డారు. దీనివల్ల అటు ప్రజల ఆరోగ్యం పాడైపోవడంతోపాటు ఇటు గీత వృత్తి దెబ్బతిన్నదని చెప్పారు. తాము తెలంగాణ ఉద్యమ సమయంలో గౌడ కులస్తులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీశామని.. తాము ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రం ఏర్పాటయ్యాక కల్లు దుకాణాలను తిరిగి తెరిపించామని తెలిపారు. పరిహారం, పెన్షన్ పెంచాం.. కల్లు గీసే సమయంలో చెట్టుపై నుంచి పడి మరణించిన, శాశ్వత అంగవైకల్యానికి గురైన గీత కార్మికులకు పరిహారం చెల్లించడంలో గత ప్రభుత్వాలు తీవ్ర జాప్యం చేశాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అలా రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న మూడేళ్ల బకాయిలు రూ.6.38 కోట్లను తాము అధికారంలోకి రాగానే ఏకకాలంలో చెల్లించామన్నారు. గతంలో చెట్టుపై నుంచి పడి మరణించిన వారికి రూ.2 లక్షలు, అంగవైకల్యం పాలైన వారికి రూ.50 వేలు మాత్రమే ఇచ్చేవారని.. తాము ఈ పరిహారాలను రూ.5 లక్షలకు పెంచామని తెలిపారు. గీత కార్మికులకిచ్చే పెన్షన్‌ను రూ.200 నుంచి రూ.1,000కి పెంచామని చెప్పారు. టీఎఫ్టీ గీత కార్మికులకూ పెన్షన్ ఇప్పటివరకు కల్లు గీత సహకార సొసైటీ (టీసీఎస్)ల సభ్యులకు మాత్రమే పెన్షన్ లభిస్తోందని.. ఇక నుంచి టీఎఫ్టీ (ట్రీ ఫర్ ట్యాపర్– వ్యక్తిగత కల్లుగీత లైసెన్సు) కార్మికులకు కూడా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేసీఆర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 30 వేల కుటుంబాలకు ఆసరా లభిస్తుందన్నారు. టీఎఫ్టీ నుంచి టీసీఎస్లోకి మారేందుకు దరఖాస్తు చేసుకున్న వారిని పది రోజుల్లో బదలాయించాలని అధికారులను ఆదేశించారు. కల్లుగీత లైసెన్సుల రెన్యూవల్ గడువును ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇక హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈత, ఖర్జూర మొక్కలను పెద్దఎత్తున నాటుతున్నామని, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కోటి 70 లక్షల మొక్కలు నాటామని తెలిపారు. ఎక్సైజ్, అటవీ శాఖల సమన్వయంతో చెరువు కట్టల మీద, చెరువు శిఖం వెంబడి, వాగులు, ఒర్రెల వెంట, నదుల ప్రవాహానికి ఇరువైపులా ఈత, ఖర్జూర మొక్కలను నాటే కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. తాటి, ఈతచెట్లపై పన్ను రద్దు రాష్ట్రంలో ఈత, తాటి చెట్లపై పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నామని కేసీఆర్ ప్రకటించారు. దాంతోపాటు ఇప్పటివరకు ఉన్న చెట్ల పన్ను బకాయిలను మాఫీ చేస్తున్నట్టు తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.16 కోట్లు రాబడి తగ్గిపోతున్నా.. గీత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పన్ను రద్దు చేస్తున్నామన్నారు. గౌడ కులస్తుల అస్తిత్వాన్ని సమున్నతంగా చాటేలా హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి గౌడ భవనం నిర్మాణానికి ఐదెకరాల భూమిని, రూ. 5 కోట్లు నిధులను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. -
బంగారు నగలను వేలం వేస్తారని..
ఆందోళనతో వెళ్తూ ప్రమాదానికి గురైన రైతు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిపాలు బనగానపల్లె రూరల్: వ్యవసాయ పెట్టుబడుల కోసం తాకట్టు పెట్టిన బంగారు నగలను బ్యాంకువారు వేలం వేస్తామని చెప్పడంతో ఆందోళనకు గురైన ఓ రైతు బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. బాధితుడి వివరాల మేరకు.. చెర్లోకొత్తూరుకు చెందిన కంబయ్య బనగానపల్లె ఆంధ్రా బ్యాంకులో 4 తులాల బంగారు నగలను తాకట్టుపెట్టి రూ. 65వేల పంట రుణం తీసుకున్నాడు. పంటలు సరిగా పండకపోవడం, ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తామని చెప్పినా ఫలితం లేకపోవడంతో నగలు వేలానికి వచ్చాయి. అప్పు కట్టి విడిపించుకోవాలని బ్యాంకు వాళ్లు చెప్పగా మాట్లాడేందుకు బైక్‌పై వెళ్లాడు. అయితే అప్పు చెల్లించపోతే వేలం వేస్తామని బ్యాంకు తేల్చి చెప్పడంతో బాధపడుతూ ఇంటికి బయలుదేరాడు. అప్పటికే తీవ్ర ఆందోళనతో ఉన్న రైతు యాగంటిపల్లె సమీపంలోని సాయిబాబా గుడి వద్ద అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు కర్నూలుకు తీసుకెళ్లారు. -
మాట మార్చారు.. మోసం చేశారు
విజయవాడలో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఏకంగా హామీలనే మార్చేసిన సీఎం చంద్రబాబు వ్యవసాయ రుణాలు అనలేదని, పంట రుణాలు రద్దు చేస్తామనే హామీనిచ్చానని బుకాయింపు వ్యవసాయ, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో హామీ టీవీల్లో విస్తృతంగా ప్రకటనలు, భారీ హోర్డింగ్‌లు, కరపత్రాలతో ప్రచారం ఆరునెలలైనా ఒక్క రైతుకూ ఒక్క రూపాయి రుణమూ మాఫీ కాని వైనం సాక్షి, హైదరాబాద్: ఆరునెలలు సావాసం చేస్తే వాళ్లు వీళ్లవుతారన్నది పాతసామెత... ఆరునెలల కాలం గడిస్తే హామీలు, వాటి అర్థాలు కూడా మారతాయన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా సామెత. అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా ఇచ్చిన హామీలిచ్చిన చంద్రబాబు ఆరునెలల్లోనే ప్లేటు ఫిరాయించారు. ఏ పార్టీ వేదికగా హామీ ఇచ్చారో అదే పార్టీ వేదికగా మాట మార్చారు. స్వయంగా మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను కూడా మార్చి చెప్పడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. శాసనసభ ఎన్నికలకు ముందు మార్చి 31 వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విడివిడిగా పార్టీ మేనిఫెస్టోలను విడుదల చేశారు. వ్యవసాయ రుణాలు, డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తామని వాటిలో స్పష్టమైన హామీ ఇచ్చారు. రైతులు ఎదుర్కొంటున్న సాధక బాధకాలను మేనిఫెస్టోలో సుదీర్ఘ ప్రస్తావన చేస్తూనే వ్యవసాయ రుణాల మాఫీ హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత వ్యవసాయ రుణాలను మాఫీ చేసే ఫైలుపైనే తొలి సంతకం చేస్తామని స్పష్టంగా చెప్పారు. ఈ మేరకు ఎన్నికలకు ముందు ప్రతీ సభలోనూ ఊదరగొట్టారు. ఇదే విషయాన్ని భారీ హోర్డింగ్‌లు, టీవీల్లో విస్తృతంగా ప్రకటనలు ఇచ్చి ప్రచారం చేశారు. బ్యాంకుల్లో కుదవపెట్టిన బంగారాన్ని విడిపిస్తామని, త్వరలోనే బంగారం మీ ఇంటికొస్తుందని మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇదే అంశంపై టీడీపీ నేతలు ఇంటింటికీ తిరిగి విస్తృతంగా ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున కరపత్రాలు పంచారు. వాటిని నమ్మిన ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చారు. ప్రమాణ స్వీకారం రోజున తొలి సంతకంతోనే చంద్రబాబు ‘తొండి’ మొదలైంది. అధికారం చేపట్టిన తర్వాత రుణమాఫీపైనే తొలిసంతకం చేస్తానని ఊర్లన్నీ ఊదరగొట్టిన చంద్రబాబు ఆ రోజు వచ్చేసరికి రుణమాఫీ అమలు విధివిధానాలు నిర్ణయించేందుకు కోటయ్య కమిటీని ఏర్పాటుచేస్తూ సంతకం చేసి సరిపుచ్చారు. ఆ తర్వాత రుణమాఫీ జరిగిపోయిందంటూ సన్మానాలు చేయించుకున్నారు. రైతుల ఖాతాలను తగ్గించడానికి రకరకాల సాకులతో ఆరునెలలుగా రుణమాఫీ కసరత్తును సాగదీస్తూనే ఉన్నారు. ఆరు నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో ఒక్క రైతుకూ ఒక్క రూపాయి రుణమూ మాఫీ కాలేదు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత బుధవారం విజయవాడలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ప్రసంగించిన చంద్రబాబు ఏకంగా హామీలనే మార్చేశారు. వ్యవసాయ రుణాలు అని మేనిఫెస్టోలో, ఊరూరా సభల్లో హామీలిచ్చిన చంద్రబాబు... పంటపైన తీసుకున్న రుణాలు రద్దు చేస్తామనే తాను హామీనిచ్చానని పార్టీ సమావేశంలో మాట మార్చారు. అప్పట్లో రుణాలన్నీ మాఫీ చేస్తాన్న చంద్రబాబు... ఇప్పుడేమో ఒక కుటుంబం ఎన్ని బ్యాంకుల్లో రుణం తీసుకున్నా లక్షన్నర మాత్రమే రద్దు చేస్తామని చాలా స్పష్టంగా చెప్పానని అంటున్నారు. ఎన్నికలకు ముందు ఈ హామీలపై ఎలాంటి షరతులు, ఆంక్షలు మాటమాత్రంగానైనా చెప్పకుండా ఇప్పుడు వ్యవసాయ రుణాలకు బదులు పంట రుణాలను రద్దు చేస్తామంటూ అసలు హామీనే పక్కదారి పట్టించడం పట్ల పార్టీ నేతల్లోనే విస్మయం వ్యక్తమైంది. డ్వాక్రా సంఘాల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. డ్వాక్రా రుణాలను మాఫీ చేసేది లేదని, మూల ధనంగా ప్రతి సంఘానికి లక్ష రూపాయలిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మాట మార్చటం తెలిసిందే. మహిళలు ఎక్కడంటే అక్కడ డబ్బులు అప్పులు తీసుకోవడంవల్లే తిరిగి చెల్లించే శక్తిలేక అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారంటూ సీఎం తరచూ వ్యాఖ్యానించడంపట్ల మహిళల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిందేమంటే హావ్యవసాయ రుణాల మాఫీ. తొమ్మిది గంటల ఉచిత విద్యుత్. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం. వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి. సౌర విద్యుత్ కోసం 75 శాతం సబ్సిడీ. రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి. ప్రకృతి వైపరీత్యాలు, పంట నష్ట నివారణకు రైతువారిగా ఇన్సూరెన్స్. రైతు బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. దెబ్బతిన్న రైతుల్లో ఆత్మవిశ్వాసం కలిగించి భవిష్యత్తుపట్ల భరోసా నింపేందుకే తెలుగుదేశం పార్టీ రుణ మాఫీ ప్రకటించింది. హాతెలుగుదేశం పార్టీ వ్యవసాయ రుణాలను మాఫీ చేసేందుకు నిర్ణయించింది. పార్టీ అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీ ఫైలుపై మొదటి సంతకం చేస్తాం. రుణ మాఫీ వ్యవసాయ రంగానికి కొంత ఉపశమనం మాత్రమే. -
రుణమాఫీ చేయలేక వైఎస్ జగన్‌పై దాడా?
హైదరాబాద్: రైతుల రుణాలు మాఫీ చేయలేక వైఎస్ జగన్మోహన రెడ్డి నివేదికలు పంపుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్ సిపి నేత పార్థసారధి మండిపడ్డారు. మంత్రి దేవినేని ఉమపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటను అమలు చేయలేక ప్రతిపక్షంపై ఎదురుదాడి చేయడం తగదని హితవు పలికారు. దమ్ముంటే 10 రోజుల్లో ఏ ఏజెన్సీతోనైనా విచారణ చేయించుకోండన్నారు. వాస్తవాలు బయటపెట్టండని కూడా సవాల్ విసిరారు. వైఎస్ఆర్ సీపీపై చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే మీరు పదవి వదులు కోవడానికి సిద్ధమా? అని ఆయన ఉమను ప్రశ్నించారు. రీ షెడ్యూల్‌కు, రుణమాఫీకి సంబంధం ఏంటని ఆయన అడిగారు. బీజేపీపై రుణమాఫీ కోసం ఎందుకు ఒత్తిడి చేయరు? అని ప్రశ్నించారు. ఆర్బిఐపై నెపం వేసి రుణమాఫీని వాయిదా వేయడం తగదన్నారు. తక్షణమే రైతులకు కొత్త రుణాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అప్పులు కట్టొద్దు అన్నారు, మీ వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్మోహన రెడ్డి దిష్టిబొమ్మల దహనానికి చంద్రదండు ఏర్పాటు చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. రుణమాఫీ చేయమని వైఎస్ జగన్ అడగటమే తప్పా అని ప్రశ్నించారు. అబద్ధాలను కట్టిపెట్టి తక్షణమే రుణమాఫీ అమలు చేయాలని పార్థసారధి డిమాండ్ చేశారు. -
రాజధాని నడిమధ్యన ఉండాలి: వైఎస్ జగన్
► కనీసం 30,000 ఎకరాల ఖాళీ స్థలం అందుబాటులో ఉండే చోటే నిర్మించాలని ఏపీ ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన ► సమృద్ధిగా మంచి నీటి లభ్యత అవసరం ► విశాలమైన నగరం అయితేనే అందరికీ గృహ వసతి కల్పించగలం ► రాష్ట్ర ప్రభుత్వం ఎవరినీ సంప్రదించకుండా ఇష్టానుసారంగా చేస్తోంది ► కృష్ణా-గుంటూరు మధ్యన నెలకొల్పినా వివాదాస్పదమే అవుతుంది ► రోడ్ల విస్తరణ కోసం ప్రజల విలువైన స్థలాన్ని తక్కువ పరిహారంతో సేకరిస్తోంది సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని రాష్ట్రం నడి మధ్యన ఉండాలని, కనీసం 30 వేల ఎకరాల ఖాళీ స్థలం అందుబాటులో ఉండే చోటే నిర్మించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జగన్ బుధవారం పలు జాతీయ టీవీ చానళ్ల ప్రతినిధులతో మాట్లాడారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న ప్రశ్నపై ఆయన స్పందిస్తూ.. రాజధాని నిర్మాణానికి ప్రధానంగా మూడు అంశాలు ప్రాతిపదికగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ‘రాష్ట్రం నడిమధ్యన రాజధాని ఉండాలి. 30 వేల ఎకరాల ఖాళీ స్థలం ఉండే చోట నిర్మించాలి. సమృద్ధిగా మంచి నీటి లభ్యత ఉండాలి. ఏ ముఖ్యమంత్రి అయినా ఈ అంశాలనే ప్రధానంగా చూసుకోవాలి’ అని చెప్పారు. సీఎం చంద్రబాబు మాత్రం ఒక నిర్దేశిత ప్రాంతంలోనే రాజధాని రావాలనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారో ఆయనే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘రాజధాని ఎక్కడైనా పెట్టండి. మాకు అభ్యంతరం లేదు, అయితే కచ్చితంగా రాష్ట్రం నడిమధ్యన ఉండేలా చూడండి. కనీసం 6 కిలోమీటర్ల వ్యాసార్థం గల ప్రదేశంలో ఎటు చూసినా ఆరు కిలోమీటర్ల పొడవున రాజధాని విస్తరించి ఉండాలి. ఎందుకంటే సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు లాంటి ముఖ్యమైనవి ఏర్పాటు చేసుకోవాలి. 12 కిలోమీటర్ల పొడవు అంటే 144 చదరపు కిలోమీటర్ల మేర రాజధాని నగరం నిర్మించే విధంగా ఉండాలి. దీన్ని ఎకరాల్లోకి మారిస్తే కనీసం 30 వేల ఎకరాలవుతాయి. విశాలమైన నగరం ఉంటే గానీ ప్రభుత్వ ఉద్యోగులతోపాటు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ(పేదలు) నివాస వసతి కల్పించలేం. స్థలం లేకుంటే ఇరుకైన రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ లేక ఇబ్బందులు పడతాం. అందుకే తగినంత భూమి లేని చోట రాజధాని నిర్మించడం ఏమాత్రం సమంజసం కాదు’ అని జగన్ పేర్కొన్నారు. వారికి లభించే పరిహారం పిసరంతే!: ‘చంద్రబాబు స్వయంగా సింగపూర్‌లాంటి రాజధాని నిర్మిస్తానని అంటున్నారు. సింగపూర్ 750 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. హైదరాబాద్ నగరం 960 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉంది. నూతన రాజధాని నిర్మించుకోవడానికి కనీసం 144 చదరపు కిలోమీటర్లయినా కావాలి కదా?’ అని జగన్ ప్రశ్నించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరినీ ఏమీ అడగలేదని.. అంతా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతున్నారని జగన్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యలో రాజధాని ప్రతిపాదనలపై ప్రశ్నించగా.. ‘అక్కడ పెట్టినా వివాదాస్పదమే అవుతుంది. రాజధాని నిర్మాణంలో భాగంగా అక్కడి వారు తమ ఇళ్లను కోల్పోవాల్సి ఉంటుంది. రోడ్లను వెడ ల్పు చేసే కార్యక్రమంలో భాగంగా వారి అనుమతి లేకుండానే ప్రజల ఖరీదైన స్థలాలను ప్రభుత్వం తీసుకోవచ్చు. దానికి బదులుగా వారికి లభించే పరిహారం పిసరంతే ఉంటుంది. ఇప్పటికే అక్కడ ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇళ్లు కోల్పోయిన వారు ఇంకొక చోట కొనాలన్నా సాధ్యమయ్యే పనికాదు. కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్యన రాజధాని ఏర్పాటు చేయాలన్నా కనీసం 30 వేల ఎకరాల ఖాళీ స్థలంతో ముందుకు వస్తే మంచిది. రాష్ట్రం నడిమధ్యన లేకుంటే మాత్రం అది రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలిగిస్తుంది. ఈ విషయంలో ఇప్పుడేదో తొందరలో చేసేసి.. ఆ తరువాత చింతించినా ప్రయోజనం ఉండదు’ అని జగన్ చెప్పారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో నూతన రాజధానికి అవసరమైతే నిర్దేశించిన స్థలాలను డీనోటిఫై చేయడానికి కూడా అవకాశం కల్పించారు కనుక దీన్ని సైతం ఉపయోగించుకోవాలని సూచించారు. జగన్ గుంటూరు పర్యటన రద్దు వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు పర్యటన రద్దయింది. ఆయన ఈ నెల 24, 25, 26 తేదీల్లో గుంటూరులో పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అయితే రుణమాఫీపై సీఎం చంద్రబాబు మోసాన్ని నిరసిస్తూ 24 నుంచి మూడు రోజులపాటు గ్రామాల్లో బాబు దిష్టిబొమ్మలను దహనం చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారు. -
రుణాల రీ షెడ్యూల్ 8 వేల కోట్ల లోపే
మిగిలిన 10 వేల కోట్ల రుణాలు ఏమి చేద్దాం ? సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేవలం రూ.8,000 కోట్ల మేర రుణాలు మాత్రమే రీ షెడ్యూల్ అయ్యే అవకాశం ఉంది. మిగిలిన పదివేల కోట్ల రూపాయలను రైతులే బ్యాంకులకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనితో లక్షలాది మంది రైతులకు నిరాశ తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి. కరువు, వరదల వల్ల నష్టపోయిన పంటలకు సంబంధించి 90 రోజుల్లోగా కరువు మండలాలుగా ప్రకటించాల్సి ఉన్నా, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా గుర్తించినందున, రీ షెడ్యూల్ నిబంధనలు సడలించాలని తెలంగాణ సర్కార్ రిజర్వ్ బ్యాంకును కోరుతోంది. రిజర్వ్‌బ్యాంకు ఈ విజ్ఞప్తిని మన్నించి రుణాలు రీ షెడ్యూల్ చేసి.. ఒక సంవత్సరం మారటోరియం విధిస్తుందని, ఆ తరువాత ఎప్పట్లోగా రుణాలు చెల్లించాలో మార్గదర్శకాలు జారీ చేస్తుందని ఓ అధికారి వివరించారు. రుణ మాఫీ కింద దాదాపు 17 వేల కోట్లరూపాయల పై చిలుకు భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. రిజర్వ్ బ్యాంకు పంట రుణాల రీ షెడ్యూల్‌కే అంగీకారం తెలిపింది. బంగారు రుణాల రీ షెడ్యూల్‌కు అంగీకరించలేదు. దీనితో రీ షెడ్యూల్ కాని రైతులు బకాయిలు చెల్లిస్తే తప్ప వారికి కొత్తగా రుణాలు మంజూరయ్యే అవకాశం లేదు. అలా అని రాష్ట్ర ప్రభుత్వం పదివేల కోట్లను ఒకేసారి చెల్లించడం సాధ్యమయ్యే పనికాదని చెబుతున్నారు. ఈ రుణాలపై ఏమి చేయాలన్న అంశాన్ని బుధవారం కేబినెట్లో చర్చించనున్నారు.