
న్యూఢిల్లీ: చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు తెచ్చిన పీఎం కిసాన్ పథకం నగదు సాయాన్ని ఈ నెల నుంచే ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన్ మం త్రి కిసాన్ సమ్మాన్ యోజన (పీఎం కిసాన్) కింద ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6 వేలు ఇస్తామని ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద 12 కోట్ల మంది లబ్ధి పొందే రైతులు న్నారని.. రూ.20 వేల కోట్ల బడ్జెట్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించినట్లు కేంద్రం పేర్కొంది. ‘ఈ పథకం గతేడాది డిసెంబర్ నుంచి వర్తించనుంది. బడ్జెట్ కేటాయింపుల కింద ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.20 వేల కోట్లు కేటాయించారు. భూముల రికార్డుల డేటా కూడా సిద్ధంగా ఉంది. అలాగే చిన్న, సన్నకారు రైతుల వివరాలు మా దగ్గర ఉన్నా యి..’ అని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ఆదివారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment