
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: రైతు ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమపై వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. రూ.25,001 నుంచి రూ.25,100 వరకున్న రుణమాఫీపై ట్రయల్ నిర్వహించారు. సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రూ.25 వేల నుంచి 50 వేల వరకున్న రుణాలను ఈ నెల 30 వరకు మాఫీ చేస్తారు. 6,06,811 మంది రైతులకు రూ.2005.85 కోట్లు మాఫీ చేయనున్నారు. ఇప్పటికే తొలి విడతలో భాగంగా రూ.25 వేలలోపు రుణాలను 2.96 లక్షల మంది రైతులకు రూ.408.38 కోట్లు మాఫీ చేసిన సంగతి తెలిసిందే.
రైతులకు శుభాకాంక్షలు: నిరంజన్‌రెడ్డి
రుణమాఫీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు రైతాంగం తరఫున ధన్యవాదాలు. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన సాగురంగానికి కేసీఆర్ ఆసరాగా నిలిచారు. ఆకలితో తండ్లాడిన తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చారు. పంట మారి్పడి వైపు రైతులను ప్రోత్సహించి దేశానికి ఆదర్శంగా నిలిచేందుకు కృషి చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment