
హైదరాబాద్, సాక్షి: రైతుల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదని, అందుకు మంత్రుల మాటలే సాక్ష్యం అని చెబుతూ.. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతులకు టోపీ పెట్టారు. రుణమాఫీ పచ్చి బూటకమనేది అర్థమవుతోంది. రవ్వంత చేసి కొండంత డబ్బా కొట్టుకుంటున్నారు. రుణమాఫీ విషయంలో వాళ్లలో వాళ్లకే సమన్వయం లేనట్లుంది. అందుకే ముఖ్యమంత్రి, మంత్రులు తలోమాట చెబుతున్నారు. రుణమాఫీ విషయంలో కాంగగ్రెస్ ఘోరంగా విఫలమైంది. అందుకే..
అబద్ధాల ముఖ్యమంత్రి నిజస్వరూపం బయటపడింది. తెలంగాణ రైతాంగం రగిలిపోతోంది. రైతులకు ఈ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి. రేపు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో ధర్నా చేపడతాం అని కేటీఆర్ అన్నారు.
