
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం.. రైతు మహేందర్‌రెడ్డి పాలిట శాపమైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సంపూర్ణంగా రైతు రుణమాఫీ చేస్తామని దేవుడిపై ఒట్లు వేసినా..రైతులకు తప్పని పాట్లు!! అంటూ ట్వీట్ చేశారు.
‘‘కాంగ్రెస్ వచ్చి.. మార్పు తెచ్చిందంటే ఏమో అనుకున్నాం..రైతుల చేతుల్లోకి పురుగుల మందు డబ్బా తెచ్చి పెట్టింది! రైతు బంధు రాలేదు.. రుణమాఫీ కాలేదు.. తెలంగాణలో బక్కచిక్కిన రైతు పరిస్థితి ఏమాత్రం బాగోలేదు.. దీనికంతటికీ కారణం అబద్దాలతో అధికారం చేపట్టిన రేవంత్ సర్కార్ కాదా?’’ అంటూ నిలదీశారు.
‘‘ఎంతమంది రైతుల ఉసురు తీసుకుంటారు? ఇంకెంతమంది రైతుల చేతుల్లో పురుగుల మంది డబ్బా పెడతారు?. రైతులకు అభయం ఇచ్చేందుకు వెళ్తే అరెస్టులు చేసేందుకు మంత్రుల ఆదేశాలు.. ఇదేనా ప్రజా ప్రభుత్వం!! ఏమైంది మీ రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు!!. ఆరు గ్యారంటీలకు మాది పూచి అన్న గాంధీ ఫ్యామిలీ ..ఈ రైతుల చావులకు బాధ్యత వహించాలి!!. ఇది ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ సర్కార్ చేసిన హత్య!!’’ అంటూ దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: 7 పేజీలు.. 54 ప్రశ్నలు
Comments
Please login to add a commentAdd a comment