Sammakka Saralamma Jathara
-
మేడారం సమ్మక్క సారక్క జాతరకు పోటెత్తిన భక్తజనం
-
మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలి
హన్మకొండ/ ఎస్ఎస్ తాడ్వాయి: దక్షిణ భారత కుంభమేళా అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని భా రత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మేడారం వనదేవతల దర్శనానికి వెళ్తూ హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభు త్వం గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసి సమ్మ క్క– సారక్క పేరు పెట్టడం గర్వకారణమన్నారు. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీ లిచ్చిందని, రాష్ట్రంలో 45 లక్షల మందికి పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచుతామని చెప్పిన మేరకు జనవరి 1 నుంచి రూ.4 వేల చొప్పున చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. డిసెంబర్లో పెన్షన్, రైతుబంధు సకాలంలో అందించడంలో ప్రభు త్వం విఫలమైందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం నివేదిక రాకముందే ఆగమాగం చేస్తున్నారని, దీనిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికే మాట్లాడారని గుర్తు చేశా రు. సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాక ర్రావు, మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, శంకర్ నాయక్ పాల్గొన్నారు. కాగా, ములుగు జిల్లా మేడారం సమ్మక్క– సారలమ్మలను ఎమ్మెల్సీ కవిత, ఎంపీ కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు దర్శించుకున్నారు. -
ఫిబ్రవరి 1 నుంచి మినీ మేడారం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క–సారలమ్మ మండమెలిగె పండుగ (మినీ మేడారం జాతర) తేదీలను ఖరారు చేశారు. 2023, ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 4 వరకు పూజా కార్యక్రమాలు జరుగుతాయని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు వెల్లడించారు. ఈమేరకు మంగళవారం మేడారంలో సమావేశమైన సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజుల పూజారులు జాతర తేదీలను ప్రకటించారు. కాగా, ఖరారు తేదీల పత్రాలను కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ అధికారులకు అందజేశారు. మహా జాతర సమయంలో మొక్కులు తీర్చుకున్నవారితోపాటు ఇతర ప్రాంతాలనుంచి కూడా మినీ మేడారంజాతరకు భారీగా భక్తులు రానున్నారు. -
మేడారం: అవ్వాబిడ్డలోయ్.. అడవిలోకి మళ్లెనోయ్
సాక్షి, ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ముగిసింది. నాలుగు రోజుల పాటు ఘనంగా జరిగిన మేడారం జాతర.. అమ్మవార్ల వన ప్రవేశంతో ముగిసింది. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు వనప్రవేశం చేశారు. చిలుకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ.. పూనుగొండ్లకు సమ్మక్క భర్త పడిగిద్దరాజు, కొండాయికి గోవిందరాజులను తరలించారు. కరోనా వైరస్ విజృంభన తర్వాత జరిగిన ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. మరోవైపు లక్షల మంది భక్తులు వన దేవతాలను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. -
మేడారం జాతరలో ఆసక్తికర సన్నివేశం.. ‘పంచాయితీ’ పెట్టే మంత్రిని కాను..
సాక్షి, వరంగల్: మేడారం మహా జాతరలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నీ తానై వ్యవహరించారు. అధికారులను ఎక్కడికక్కడ సమన్వయపరుస్తూ.. సలహాలు ఇస్తూ జాతర సజావుగా సాగేందుకు తనదైన తీరును ప్రదర్శించారు. జాతరకు వచ్చే భక్తులు, వీఐపీలు, వీవీఐపీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఎదురెళ్లి అమ్మవారి దర్శనం చేయించారు. కమాండ్ కంట్రోల్ రూం నుంచి, మంచెపై నుంచి జాతర తీరును పరిశీలిస్తూ.. మైకులో అధికారులకు తగిన ఆదేశాలిచ్చారు. భక్తులు క్యూ పద్ధతి పాటించాలని, బంగారం, కొబ్బరి కాయలు విసిరేయకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. కాగా.. సీఎం కేసీఆర్ రాక కోసం ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్‌తో కలిసి మంత్రి రెండు రోజులపాటు హెలిపాడ్, ఇతర ఏర్పాట్లను పరిశీలించగా.. చివరి నిమిషంలో సీఎం పర్యటన రద్దయింది. చదవండి: వనదేవతలకు జన హారతి ‘పంచాయితీ’ పెట్టే మంత్రిని కాను.. జాతరకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర గిరిజనాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రేణుక సింగ్ మీడియా పాయింట్ నుంచి ఎదురుపడిన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి ఎరబ్రెల్లి ఎదురుపడగానే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. రేణుక సింగ్‌కు ఎరబ్రెల్లిని పరిచయం చేస్తూ.. తెలంగాణలో గట్టి మంత్రి అంటూ.. చేతులతో గట్టి అనే అర్థం స్ఫురించేలా ఊపారు. అలాగే పంచాయతీ మంత్రి అంటూ కిషన్‌రెడ్డి చెప్పగానే.. మంత్రి ఎరబ్రెల్లి స్పందిస్తూ.. పంచాయితీలు పెట్టే మంత్రిని కాను, పరిష్కరించే మంత్రిని అని రేణుక సింగ్‌తో అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి. చదవండి: మేడారానికి జాతీయ హోదా.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి తలసాని కౌంటర్ -
వనదేవతలకు జన హారతి.. ఉప్పొంగిన భక్తి పారవశ్యం
మేడారం నుంచి సాక్షి ప్రతినిధి, వరంగల్: ఉప్పొంగిన భక్తి పారవశ్యంతో మేడారం జనసంద్రమైంది. సమ్మక్క–సారలమ్మ నామస్మరణతో మార్మోగింది. ‘మా సమ్మక్క తల్లి కో.. సారక్క తల్లి కో’అంటూ శివసత్తుల పూనకాలతో గద్దెల ప్రాంగణం మార్మోగింది. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు నలుగురు వన దేవతలూ గద్దెలపై కొలువై ఉండటంతో భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. చీరలు, రవిక ముక్కలు, ఎత్తు బంగారం (బెల్లం), ఎదురుకోళ్లు, ఒడి బియ్యం, కొబ్బరికాయలు.. తీరొక్క రూపాల్లో భక్తులు మొక్కులు సమర్పించుకున్నారు. అమ్మవారి ప్రసాదం, పసుపు, కుంకుమల కోసం పోటీపడ్డారు. పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులతో జంపన్నవాగు నిండి పోయింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజనులు వారి సంప్రదాయ పద్ధతుల్లో డప్పుల మోతలు, బాకాలు, బూరల నాదాలతో వన దేవతలను పూజించుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే 30లక్షల మందికిపైగా మొక్కులు చెల్లించుకున్నట్టు అధికారులు ప్రకటించారు. మొత్తంగా దేవతలను దర్శించుకున్న వారి సంఖ్య కోటీ 10లక్షలు దాటిందని.. ఇంకా భక్తుల తాకిడి ఉందని తెలిపారు. రోజురోజుకూ పెరిగిన రద్దీ ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ ఉత్సవంగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర ఈ నెల 16న మొదలుకాగా.. అంతకు నెల రోజుల ముందు నుంచే భక్తులు వచ్చి మేడారం గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకోవడం మొదలైంది. రోజురోజుకూ సంఖ్య పెరుగుతూ వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులతో మేడారం ‘క్యూ’లైన్లు కిక్కిరిసిపోయాయి. సాధారణ భక్తుల క్యూలైన్లతోపాటు వీవీఐపీ, వీఐపీల క్యూలైన్లు కూడా కిలోమీటర్ల పొడవునా సాగాయి. సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ఉన్నరోజే దర్శించుకోవాలన్న తలంపుతో శుక్రవారం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, మ«ధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి వచ్చారు. శనివారం దేవతల వన ప్రవేశం సందర్భంగా కూడా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశముంది. పెరిగిన వీఐపీల తాకిడి మేడారం జాతరకు శుక్రవారం కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వీఐపీల తాకిడి పెరిగింది. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రేణుకాసింగ్ తమ కుటుంబాలతో హెలికాప్టర్ ద్వారా మేడారం వచ్చారు. రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు వారికి స్వాగతం పలికి.. వన దేవతల దర్శనం చేయించారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, గంగుల కమలాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, విప్ రేగా కాంతారావు, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బండా ప్రకాశ్‌తోపాటు మరికొందరు ప్రజాప్రతినిధులు దేవతలను దర్శించుకున్నారు. వీఐపీల రాకతో సాధారణ భక్తులు ఇబ్బందిపడ్డారు. (చదవండి: బ్రహ్మ భైరవులు.. శివుడి ద్వారపాలకులు) నేడు దేవతలు వనంలోకి.. మేడారం జాతర శనివారం సాయంత్రం ముగియనుంది. వన దేవతలు సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెల నుంచి వన ప్రవేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జాతర చివరిరోజు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలు చేసుకోనున్నారు. శుక్రవారం రాత్రికే లక్షల మంది మేడారానికి చేరుకున్నారు. మొత్తంగా గత జాతర కంటే ఈసారి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండనుందని అధికారులు తెలిపారు. జాతరకు ముందుగా వచ్చిన దూరప్రాంతాల వారు తిరిగి బయలుదేరుతుండటంతో మేడారం పరిసర ప్రాంతాలు మెల్లగా ఖాళీ అవుతున్నాయి. సీఎం పర్యటన రద్దు.. శుక్రవారం సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు వన దేవతలను దర్శించుకోవడానికి వస్తున్నట్టు సీఎం కార్యాలయం ప్రకటించింది. మొదట ఉదయం 11.30 గంటలకు వస్తారని ప్రకటించినా.. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వస్తారని చెప్పారు. సీఎం సెక్యూరిటీ విభాగం, వ్యక్తిగత కార్యదర్శులు ఉదయమే మేడారం చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. కానీ చివరి నిమిషంలో సీఎం కేసీఆర్ పర్యటన రద్దయినట్లు అధికారులు ప్రకటించారు. మేడారానికి జాతీయ హోదా ఉండదు: కిషన్‌రెడ్డి పండుగలకు ఎక్కడా జాతీయ హోదా ఉండదని, ఆ ప్రకారం మేడారం జాతరకు కూడా ఉండదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం వనదేవతలను దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రెండేళ్లకోసారి వైభవంగా జరిగే ప్రకృతి పండుగ ఇది. పండుగలకు జాతీయ హోదా ఎక్కడా లేదు. ఇదే క్రమంలో మేడారం జాతరకు కూడా జాతీయ హోదా ఉండదు. అయితే దేశవ్యాప్తంగా మేడారం జాతరకు విస్తృత ప్రచారం కల్పిస్తాం. గిరిజన విశ్వవిద్యాలయం కోసం రూ.45 కోట్లు నిధులు కేటాయించాం. త్వరలోనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతోంది. నేను పర్యాటక మంత్రి అయిన తర్వాత రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. ప్రజలు కరోనా మహమ్మారి మీద విజయం సాధించి సుఖసంతోషాలతో ఉండాలని అమ్మలను కోరుకున్నా..’’అని తెలిపారు. (చదవండి: కరగని ‘గుండె’) -
Medaram Jatara: వన దేవతలకు ‘కోటి’ మొక్కులు
సాక్షి, వరంగల్: వరాలు ఇచ్చే తల్లులు.. వనదేవతలు.. మేడారం సమ్మక్క సారలమ్మ జనజాతర వైభవోపేతంగా జరుగుతోంది. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారులను కోటి మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లకోసారి ఇద్దరు అమ్మవారులు గద్దెలపై రెండురోజుల పాటు కొలువై ఉండడంతో దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో మేడారం జనసంద్రంగా మారి మహానగరాన్ని తలపిస్తుంది. వనదేవతల జనజాతరకు వీఐపీల తాకిడి పెరిగింది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించినప్పటి నుంచి నిరంతరాయంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. బారులు తీరి అమ్మవారులకు ఎత్తు బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లిస్తున్నారు. గద్దెలపై ప్రాంగణంలో జలప్రవాహంలా భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల రద్దీతో సీఎం కేసీఆర్ మేడారం టూర్ రద్దయింది. సీఎం రాకపోయినప్పటికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు పలువురు సమ్మక్క సారలమ్మ దర్శించుకుని మొక్కులు చెల్లించారు. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు అమ్మవారులకు ఎత్తు బంగారం( బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించారు. సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని వనదేవత లను వేడుకున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. వీఐపీల తాకిడి, భక్తుల రద్దీతో పోలీసులు హడాహుడి చేశారు. భక్తులను ఇబ్బందులకు గురిచేశారు. కేంద్ర మంత్రులు వచ్చిన సమయంలో పోలీసులు మీడియా వారిని నెట్టివేయడంతో జర్నలిస్టులు ఆందోళనకు దిగి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
మేడారం మహాజాతరలో అద్భుతం ఆవిష్కృతం
Medaram Aerial View 2022: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర వైభవోపేతంగా జరుగుతుంది. మేడారంలో కీలక ఘట్టంమైన సమ్మక్క ఆగమన ప్రక్రియ కొనసాగుతోంది. సమ్మక్క తల్లి రాకకు వేళ అవ్వడంతో మేడారం జనసంద్రంగా మారింది. చిలకల గుట్ట నుంచి కుంకుమ భరిణె రూపములో ఉన్న అమ్మవారిని గిరిజన సంప్రదాయ పూజల అనంతరం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో తీసుకురానున్నారు. మాఘశుద్ద పౌర్ణమి వెన్నెల్లో సమ్మక్కను ఆదివాసీ గిరిజన ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి మేళ తాళాలతో గద్దెలపైకి తరలిస్తారు. చదవండి: దుమ్ములేస్తోంది.. సమ్మక్క వస్తోంది.. ఈ క్రమంలో జాతర పరిసర ప్రాంతాలను రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. జంపన్నవాగు, కన్నెపల్లి, చిలుకలగుట్ట ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమ్మక్క తల్లి ఆగమనంతో వనదేవతల దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటి వరకు జాతరకు 70 లక్షల మంది భక్తులు వచ్చారని, మూడు రోజుల్లో మరో 50 నుంచీ 60 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. సీఎం కేసిఆర్ బర్త్ డే సందర్భంగా మేడారం సమ్మక్క సారలమ్మకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 60 కేజీల తెల్లబంగారం సమర్పించారు . కేసిఆర్ ఆయురారోగ్యాలతో జాతీయ రాజకీయాల్లో రాణించాలని అమ్మవారులను వేడుకున్నానని తెలిపారు. జాతీయ స్థాయిలో కేసిఆర్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అమ్మవారి దీవేనలతో రాష్ట్ర సాధన తోపాటు రెండు సార్లు కేసిఆర్ సీఎం అయ్యారని తెలిపారు. సీఎం కేసిఆర్ రేపు మేడారం వస్తారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు ఏర్పాట్లను పరిశీలించారు. జాతరపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు, శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. మేడారం జాతరకు జాతీయ హోదా లభించాలని అమ్మవారులను వేడుకున్నానని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న మంత్రి అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంపై కేంద్రం కనిపించదు, వినిపించదు అన్నట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో మేడారంలో శాశ్వత ఏర్పాట్లు చేస్తామన్నారు. జాతర పై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశామన్నారు. రాబోయే రెండు రోజులు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. -
జాతర సందడిలో పురాత్మల ఆవహయామీ.. తంత్రగాళ్ల ప్రత్యేక పూజలు
జాతర సమయంలో మేడారానికి లక్షల మంది భక్తులు వస్తారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. నూటికి 99 శాతం మంది తమ కోరికలు తీర్చాలని, తమ మొక్కులు చెల్లించుకునేందుకు వస్తారు. కానీ కొద్ది మంది తంత్ర సాధన కోసం మేడారం చేరుకుంటారు. మేడారంలో ప్రతీ మలుపులో కనిపించే వన మూలికలు అమ్ముకునే వారు కనిపిస్తారు. శరీరం నిండా చిత్రమైన అలంకరణ చేసుకుంటారు. వీరిని తంత్ర గాళ్లు అనుకుని చాలా మంది పొరపాటు పడతారు. వనమూలికలు, అటవీ జంతువుల శరీర అవయవాలను అమ్మేవాళ్లు విచిత్ర వేషధారణతో జాతర ప్రాంగణంలో కలియతిరుగుతూ ఉంటారు. వన మూలికలు అమ్మడమే వీరి ప్రధాన జీవనోపాధి, అయితే ప్రజలను ఆకట్టుకునేందుకు వీరు కొంచెం అతిగా అలంకరించుకుంటారు. నిజానికి వీరికి ఇటు మేడారం జాతరతోకానీ అటు తంత్ర గాళ్లతో గానీ ఎటువంటి సంబంధం ఉండదు. తంత్ర సాధన కోసం మేడారం వచ్చే వాళ్లు జాతర జరిగే సమయంలో మేడారం అడవుల్లో ప్రత్యేక సాధన చేస్తారు. భక్తుల కోలాహాలం లేని అడవుల్లోని నిర్మాణుష్యమైన ప్రాంతాల్లో వీరి సాధన జరుగుతుంది. జాతర ఘడియల కోసం ఎంతో మంది రోజుల తరబడి ఎదురు చూస్తుంటారు. తంత్ర సాధనకు అవసరమయ్యే వివిధ రకాల చెట్లు, జంతువులు.. ఇతరాలు బయట లభించడం చాలా కష్టం. ఒక్కో వస్తువు ఒక్కో చోట లభిస్తుంది. కానీ జాతర సందర్భంగా వేర్వేరు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఇక్కడ కలుసుకుంటారు. తంత్ర సాధనలో ఉపయోగించే వస్తువులు సులువుగా లభ్యమవుతాయి. మరోవైపు జాతర సందర్భంగా మహిమాన్వితులు, వీరుల ఆత్మలు మేడారం చేరుకుంటాయని ఈ తంత్రగాళ్ల నమ్మకం. అందుకే ఆ మహిమాన్విత ఆత్మలను ఆవహయామి చేసుకునేందుకు వారు సాధన చేస్తారు. వీరిని సాధారణ భక్తులు గుర్తించడం కష్టం. అయితే ఈ తంత్ర సాధనలో వారు ఏం ప్రయోజనం పొందుతారనేది ఇప్పటికీ రహస్యమే. జాతర సందర్భంగా మేడారం అడవుల్లో తంత్ర సాధన చేసే వాళ్లలో ఎక్కువ మంది చత్తీస్గడ్, ఓడిషా, ఝార్ఖండ్, మహారాష్ట్రలకు చెందిన వారు ఉంటారు. -
పులిపై సమ్మక్క, జింకపై సారలమ్మ... ఈ రూపాలు ఎలా వచ్చాయో తెలుసా ?
-
ఆంక్షల నడుమ మేడారం జాతర? మొదటివారంలో కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా వ్యవహరిస్తోంది. కోటికిపైగా భక్తులు హాజరుకానున్న ఈ జాతర వచ్చేనెల 16వ తేదీ నుంచి 19వ తేదీవరకు నాలుగు రోజులపాటు జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అత్యంత వేగంగా సాగుతోంది. నిత్యం వేల సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడుతున్నారు. రోజురోజుకూ వైరస్ వ్యాప్తి వేగం పెరుగుతున్న పరిస్థితుల్లో మేడారం జాతర వైరస్ వ్యాప్తికి కారణం కాకూడదని గిరిజన సంక్షేమ శాఖ అభిప్రాయపడుతోంది.ఇందులో భాగంగా వ్యూహాత్మక కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మొదటివారంలో ప్రత్యేక సమావేశం... వచ్చేనెలలో కోవిడ్ వ్యాప్తి తారాస్థాయికి చేరుతుందని వైద్య,ఆరోగ్య శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి మాసమంతా అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేనెల మొదటివారంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వర్చువల్ పద్ధతిలో సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరలో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా ఉండేందుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేసేందుకు ఈ సమీక్ష కీలకం కానుంది. జాతరకు భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతివ్వాలా.. భౌతిక దూరాన్ని పాటిస్తూ అనుమతి ఇస్తే ఎలాంటి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.. శానిటైజేషన్ ఏర్పాట్లు, మాస్కుల నిర్వహణ, తక్ష ణ వైద్య సేవల కల్పన తదితర అంశాలపై లోతు గా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వడివడిగా నిర్మాణ పనులు ప్రస్తుతం జాతర పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 21 ప్రభుత్వ విభాగాలకు రూ.75 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం వివిధ పనులు నిర్దేశించింది. కోటికి పైగా భక్తులు/పర్యాటకులు హాజరు కానుండటంతో ప్రభుత్వం అక్కడ రవాణా, వసతికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వనుంది. దీంతోపాటు తాగునీటి సరఫరా, భద్రత చర్యలు కీలకం కానున్నాయి. జాతరకు మంజూరు చేసిన మొత్తంలో దాదాపు 50శాతం నిధులు ఈ మూడు శాఖలకే ఖర్చు చేయనుంది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తూ అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. -
అమ్మలు అడవిలోకి
-
ముగిసిన మేడారం మహాజాతర
-
మేడారం జాతరలో కీలక ఘట్టం
సాక్షి, ములుగు : మేడారం జాతరలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ప్రభుత్వ లాంఛనాల మధ్య చిలకలగుట్ట నుంచి సమ్మక్క మేడారంకు బయల్దేరింది. దీంతో ములుగు జిల్లా మేడారం వనాలు సమ్మక్క నామస్మరణతో మార్మోగాయి. అడవి అంతా జనాలతో నిండిపోయింది. ఆదివాసీ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతమైంది. సమ్మక్క రాకకు సూచనగా దేవతను ఆహ్వానిస్తూ ప్రభుత్వం తరపున అధికారిక లాంఛనాల ప్రకారం ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ ఏకే 47 తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ శబ్దం విన్నవెంటనే ఒక్కసారిగా చిలకలగుట్ట ప్రాంతం భక్తిభావంతో ఉప్పొంగిపోయింది. సమ్మక్క నామస్మరణతో చిలుకల గుట్ట ప్రాంతం మార్మోగింది. ఆదివాసీ యువకుల రక్షణ వలయం, పోలీసు బలగాల రోప్‌పార్టీ నడుమ పూజారులు, వడ్డెలు సమ్మక్క కుంకుమ భరిణె రూపంతో మేడారంవైపు బయలుదేరారు. లక్షల మంది భక్తుల పారవశ్యం, గిరిజన యువతుల నృత్యాలు, కోయదొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల మొక్కులు, అధికారుల లాంచనాలు, పోలీసు ఉన్నతాధికారుల తుపాకీ కాల్పుల స్వాగతం, భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఆదివాసీలు, సమ్మక్క పూజారులు, వడ్డెలు వన దేవత సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చారు. ఆదివాసీ జాతరలో పతాక ఘట్టాన్ని చూసేందుకు లక్షల మంది భక్తులు తరలివచ్చారు. సమ్మక్క ఉండే చిలకలగుట్ట జనంతో కిటకిటలాడింది. అక్కడి నుంచి మేడారం వరకు కిలోమీటరున్నర దారి ఇరువైపులా జనంతో నిండిపోయింది. సమ్మక్క స్వాగత కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ కర్ణన్, ఎమ్మెల్యేలు సీతక్క, వీరయ్య పాల్గొన్నారు. దారి పొడవునా సమ్మక్కకు లక్షలాది భక్తులు సమ్మక్కకు ఎదురేగి..కోళ్లు, మేకలు బలి ఇస్తూ స్వాగతం పలికారు. (మేడారం.. అన్నీ ‘ప్రత్యేకం’) కాగా బుధవారం రాత్రి కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడడారం గద్దెపై కొలువుదీరారు. అలాగే కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు సైతం సారలమ్మతోటే మేడరం గద్దెల పైకి చేరారు. ముగ్గురి రాకతో మేడారం వన జాతర అంబరాన్నంటింది. ఈ అద్భుత సన్నివేశాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి -
నేడు చిలకలగుట్ట నుంచి సమ్మక్క రాక
-
కొలువుదీరిన కన్నెపల్లి వెన్నెలమ్మ
సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర మొద లైంది. కోరుకున్న మొక్కులు తీర్చే సారలమ్మ మేడారం గద్దెపై బుధ వారం రాత్రి కొలువుదీరారు. అలాగే, కొత్తగూడ మండలం పూను గొండ్ల నుంచి పగిడిద్దరాజు, ఏటూ రునాగారం మండలం కొండాయి నుంచి గోవింద రాజులు సైతం సారలమ్మతోపాటే మేడారం గద్దెల పైకి చేరారు. ముగ్గురి రాకతో మేడారం వన జాతర అంబరాన్నం టింది. కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం బుధవారం సాయంత్రం సారలమ్మ పూజారులు, వడ్డెలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6.50 గంటలకు గుడి నుంచి వెదురు బుట్ట (పట్టె మూకుడు)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలు తీసుకుని మేడారానికి బయల్దేరారు. జంపన్నవాగులో కాళ్లు శుద్ధి చేసుకొని మేడారం గుడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజుతో కలసి వడ్డెలు ముగ్గురి రూపాలను అర్ధరాత్రి 12.24 గంటలకు మేడారం గద్దెలపై చేర్చారు. కన్నెపల్లి నుంచి 3.6 కిలోమీటర్ల దూరంలోని మేడారం గద్దెల వద్దకు సారలమ్మను చేర్చే అద్భుత సన్నివేశాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు వచ్చారు. దారి పొడవునా ఇరువైపులా ఎదురేగి దండాలు పెట్టారు. సారలమ్మను తీసుకొస్తున్న పూజారి దాటుకుంటూ వెళ్తే.. సంతాన భాగ్యం కలుగుతుందని, కోర్కెలు నెరవేర తాయని భక్తుల నమ్మకం. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య అమ్మవారి ప్రతిమను వెదురు బుట్ట (పట్టెమూకుడు) లో తీసుకొస్తుండగా ఆలయం మెట్ల నుంచి వంద మీటర్ల పొడవునా భక్తులు కింద పడుకుని వరం పట్టారు. సారల మ్మను తీసుకువస్తున్న పూజారులు వీరిపై నుంచి దాటి వెళ్లారు. సారలమ్మ గద్దెలకు రాక ను సూచిస్తూ ఆదివాసీ పూజారులు కొమ్ము బూరలు ఊదారు. ప్రత్యేక డోలు వాద్యాలు, శివసత్తుల పూనకాలు, హిజ్రాల శివాలుతో కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం భక్తితో పరవశించింది. తీసుకొచ్చారిలా.. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, పూజారులు లక్ష్మీబాయమ్మ, కాక కిరణ్, కాక వెంకటేశ్వర్లు, కాక కనుకమ్మ, కాక భుజంగరావులు సారలమ్మను కన్నెపల్లి నుంచి గద్దెలపైకి తీసుకొచ్చారు. సోలం వెంకటేశ్వర్లు పట్టిన హనుమాన్ జెండా నీడలో కన్నెపల్లి వెన్నెలమ్మగా పేరున్న సారలమ్మ గద్దెలపైకి చేరారు. ప్రత్యేక పోలీసుల బృందం రోప్‌పార్టీ (తాడు వలయం)గా ఏర్పడి వీరికి భద్రత కల్పించారు. ప్రభుత్వం తరఫున డీఆర్వో రమాదేవి, ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు, ఇటీవలే బదిలీపై వచ్చిన పీవో హన్మంతు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అడిషనల్ ఎస్పీలు దక్షిణమూర్తి, మురళీధర్, డీఎస్పీ విష్ణుమూర్తి మూడంచెలుగా 80 మందితో రోప్ పార్టీ, భారీ బందోబస్తును పర్యవేక్షించారు. భక్త జన సందోహం సారలమ్మ, తండ్రి పగిడిద్దరాజుతో పాటు గోవిందరాజు ప్రతిమలు గద్దెలపైకి చేరుకో వడంతో మేడారం ప్రాంతంలోని కన్నెపల్లి, రెడ్డిగూడెం, ఊరట్టం, జంపన్నవాగు, కొత్తూరు, నార్లాపూర్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిట లాడాయి. ఆర్టీసీ పాయింట్ మీదుగా, రెడ్డిగూడెం, ఊరట్టం, కాల్వపల్లి, నార్లాపూర్ మీదుగా లక్షలాదిగా వస్తున్న భక్తులతో అడవి దారులన్నీ పోటెతు ్తన్నాయి. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్నవాగు మొత్తం జనంతో నిండిపోయింది. మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తుల తాకిడితో దారులన్నీ కిటకిటలాడాయి. సారలమ్మ గద్దెలపైకి రాగానే భక్తులు పరవశంతో దర్శనం కోసం ఒక్కసారిగా గద్దెల వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. 6 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన క్యూలైన్లు సరిపోక రోడ్డుపై సైతం వరుసల్లో బారులు తీరారు. నేడు కొలువుదీరనున్న సమ్మక్క మేడారం జాతరలో కీలక ఘట్టంగా భావించే సమ్మక్కను గద్దెలపైకి గురువారం చేరుస్తా రు. మేడారం సమీపంలోని చిలకల గుట్టపై నుంచి సాయంత్రం 5 గంటల సమ యంలో ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను వెదురు బొంగులో భద్రపర్చుకుని చిలకల గుట్టపై నుంచి తీసుకొస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న ములుగు జిల్లా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ సమ్మ క్కను తీసుకొచ్చే కార్యక్రమాన్ని నిర్వహి స్తారు. ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటి ల్ ఏకే 47 తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కకు స్వాగతం పలు కుతారు. లక్షలాది భక్తులు సమ్మక్కకు ఎదు రేగి.. కోళ్లు, మేక లను బలి ఇస్తారు. సమ్మక్కను ప్రతిష్ఠించాక భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఆదివాసీ పద్ధతిలో సమ్మక్క పెళ్లి ఎస్ఎస్ తాడ్వాయి: వనదేవత సమ్మక్క–పగిడిద్దరాజు కల్యాణం బుధవారం ఆదివాసీ సంప్రదాయం ప్రకారం జరిగింది. రెండేళ్లకోసారి ఈ తంతును సాగిస్తున్నారు. పగిడిద్దరాజు పూజారులు పసుపు–కుంకుమ, చీర సారెను, సమ్మక్క పూజారులు దోవతి, కండువాలను అందించారు. ఈ తతంగానికి మేడారం గ్రామం వేదికగా నిలిచింది. ఆదివాసీల విశ్వాసం ప్రకారం.. సమ్మక్క భర్త పగిడిద్దరాజు కాగా.. వారి సంతానం సారలమ్మ, జంపన్న. పగిడిద్దరాజు సోదరుడు గోవిందరాజు. ఆదివాసీల ఇలవేల్పులైన వీరు నాలుగు విభిన్న ప్రాంతాల్లో కొలువై ఉన్నారు. ప్రతీ రెండేళ్లకు మాఘశుద్ధ పౌర్ణమి రోజు అయిన బుధవారం సమ్మక్క – పగిడిద్దరాజుకు వివాహం జరిపిస్తారు. సమ్మక్క ఆలయమే వేదిక మాఘశుద్ధ పౌర్ణమికి ముందు లేదా తర్వాత వచ్చే బుధవారం రోజున వివాహం జరిపించడం ఆనవాయితీ. పెళ్లి తంతులో భాగంగా ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో ఉన్న పగిడిద్దరాజు ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో çపడిగెను పగిడిద్దరాజుగా భావిస్తూ పెళ్లికొడుకుగా ముస్తాబు చేశారు. నలుగు పెట్టి, పసుపు కుంకుమలతో అలంకరించారు. అక్కడి నుంచి మ«ంగళవారం మధ్యాహ్నం 4.30 గంటలకు మేడారానికి బయలుదేరగా మేడారానికి బుధవారం రాత్రి చేరుకున్నారు. ప్రధాన పూజారులుగా పెనక వంశీయులు పెనక బుచ్చిరాములు, పెనక మురళీధర్ ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సమ్మక్క పూజారులు గుడికి చేరుకొని పగడిద్దరాజుతో వివాహ పూజలు చేశారు. అనంతరం సమ్మక్క గుడిలో ఆదివాసీ సంప్రదాయం ప్రకారం వడేరాల కుండల రూపంలో సమ్మక్క – పగిడిద్దరాజుకు కల్యాణం జరిపించారు. అనంతరం గోవిందరాజు, సారలమ్మతో కలసి పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరారు. నేడు సమ్మక్క గద్దెపైకి కంకవనం ఎస్‌ఎస్‌తాడ్వాయి: సమ్మక్క–సారలమ్మ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టాల్లో కంకవనం(వెదురు) తీసుకురావడం కీలకమైనది. సమ్మక్క – సారలమ్మ గద్దెలపైకి చేరుకోకముందే అక్కడికి కంకవనం చేరుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు గురువారం సమ్మక్కతల్లిని గద్దెపై ప్రతిష్టించడానికి ముందు కంకవనాలను అక్కడ ప్రతిష్టిస్తారు. కంకవనాలను తీసుకురావడంలో పూజారులు ప్రత్యేక విధానాన్ని పాటిస్తారు. కంకవనాలను తెచ్చేందుకు సమ్మక్క పూజారులు కుటుంబీకులు రోజంతా ఉపవాసం ఉంటారు. సమ్మక్క పూజారులు, ఆదివాసీ యువకులు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మేడారానికి దక్షిణం వైపు ఉన్న అడవిలోకి వెళ్లారు. అక్కడ గద్దెలపైకి తీసుకురావాల్సిన కంకవనాన్ని ఎంపిక చేస్తారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల వరకు కంకవనానికి పూజలు నిర్వహించారు. ఈ పూజ వివరాలను బయటి వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకపోవడమే కాకుండా ఎవరినీ దగ్గరకు రానివ్వరు. వనంలో పూజ ముగిసిన తర్వాత బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయానికి అడవి నుంచి అందరూ మేడారం చేరుకుంటారు. గురువారం తలస్నానం చేసి మళ్లీ అడవిలోకి వెళ్తారు. అప్పటికే ఎంపిక చేసిన ఉన్న కంకను తీసుకుని మార్గమధ్యలో ఇంగ్లి ష్ మీడియం పాఠశాల దగ్గర ఉన్న గుడిలో పూజలు చేస్తారు. మేడారం ఆడపడుచులు ఎదురేగి కంకలకు ప్రత్యేక స్వాగతం పలుకుతారు. తొలి సూర్యకిరణాలు గద్దెలపై పడే సమయంలో కంకలను అడవి నుంచి మేడారంలో గద్దెల వద్దకు చేరుస్తారు. ఇక్కడ పూజలు నిర్వహించి కంకను ప్రతిష్టిస్తారు. సాయంత్రానికి సమ్మక్క గద్దెపైకి చేరుకుంటుంది. పూజారుల ఆగ్రహం ములుగు: భద్రత విషయంలో పోలీసులు అతి చేస్తున్నారని సమ్మక్క–సారలమ్మ పూజారులు ఆరోపిస్తున్నారు. ఇటీవల సమ్మక్క పూజారి రమేశ్‌ను గద్దెల ప్రధాన ప్రవేశ మార్గం నుంచి అనుమతించక పోవడంతో ఆయన ఏకంగా తాళాలను పగులగొట్టి మరీ గద్దెల వద్దకు వెళ్లారు. దీంతో పాటు బుధవారం ఉదయం కన్నెపల్లి ఆడపడుచులు మేడారంలోని గద్దెను అలక (అలంకరణ)డానికి వచ్చారు. ఈ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు. కాగా, బుధవారం సాయంత్రం 6.50కి సారలమ్మను ఆల యం నుంచి బయటికి తీసుకొచ్చారు. సమ్మక్క గుడి వరకు సాఫీగా సాగిన ప్రయాణం గుడి ప్రాంగ ణం వచ్చే సరికి గందరగోళంగా మారింది. ఒక వర్గం పూజారులు ఆలయం పక్కన ఉన్న విడిది స్థానంలో, మరో వర్గం పూజారులు ఐటీడీఏ క్యాంపు కార్యాలయం వద్ద ఉండిపోయారు. దీంతో అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద దిద్దుబాటు చర్యలకు దిగింది. మొత్తానికి పూజారుల పట్ల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమ్మక్క – సారలమ్మ గద్దెల తాళాలను తమ వద్దే ఉంచుకోవడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. -
మేడారం: గద్దెలపైకి చేరిన సారలమ్మ, పగిడిద్దరాజు
సాక్షి, ములుగు : ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన వనదేవతలు సమ్మక్క – సారలమ్మ జాతర అసలు ఘట్టం మొదలైంది. సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు బుధవారం రాత్రి గద్దెలపై ఆశీనులయ్యారు. గిరిజన పూజారులు, జిల్లా అధికారుల ఆధ్వర్యంలో కన్నెపల్లి నుంచి సారక్క, కొండాయి నుంచి గోవిందరాజులు, గంగారం మండలం పోనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును పెనుక వంశస్తులు తీసుకొచ్చారు. వీరి రాకతో జాతర లాంఛనంగా ప్రారంభమైంది. గురువారం (ఫిబ్రవరి 6) సాయంత్రం వేళ సమ్మక్క గద్దెపైకి వస్తుంది. రేపు ఉదయం పూజారులు చిలకలగుట్టకు వెళ్లి వనం (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై పూజలు చేస్తారు. బుధవారం నుంచి శనివారం వరకు (నాలుగు రోజులు) తేదీ వరకు సమ్మక్క– సారలమ్మ మహా జాతర కొనసాగుతుంది. ఇక మేడారం మహా జాతర నేపథ్యంలో జనం పోటెత్తారు. ఎటు చూసినా ‘సమ్మక్క సారలమ్మ’సందడి నెలకొంది. రెండేళ్లకోసారి వచ్చే ఈ జాతర కోసం తెలంగాణ వ్యాప్తంగా ఈ సారి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కంటే ఈ సారి సమాచార, రోడ్డు, రవాణా సౌకర్యాలు మెరుగవడంతో ఎక్కువ మంది వన దేవతల దర్శనం కోసం మేడారానికి పోటెత్తుతున్నారు. మేడారంలో ప్రముఖుల పూజలు సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రముఖుల తాకిడి పెరిగింది. బుధవారం మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, వైరా ఎమ్మెల్యే రాములు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అలాగే, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో పాటు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దివంగత కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ కుమార్తెలు సుస్మిత, సుమిత్ర వరాల తల్లులను దర్శించుకున్నారు. నిల్చునే తలనీలాల సమర్పణ మేడారం జాతరలో ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. ఇక తలనీలాలు సమర్పించే కల్యాణకట్ట సైతం కిక్కిరిసిపోయింది. దీంతో జంపన్న వాగు వెంట ఎక్కడపడితే అక్కడే తలనీలాలు సమర్పిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కూర్చునే స్థలం కూడా లేకపోవడంతో భక్తులను నిల్చోబెట్టే నాయీ బ్రాహ్మణులు తలనీలాలు తీయడం కనిపించింది. ట్రిప్‌కు రూ.3వేలు ఏటూరునాగారం: మేడారం జాతరకు వచ్చే భక్తులు ఈసారి విహంగ వీక్షణం చేసేందుకు వీలు కల్పించారు. హెలికాప్టర్లో మేడారం జాతర పరిసరాల్లో ఒక ట్రిప్ వేయాలనుకునే వారు రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న పలువురు భక్తులు మంగళవారం హెలికాప్టర్లో జాతరను విహంగ వీక్షణం చేసి సంబురపడ్డారు. ఇక దూర భారం, ఇతర కారణాలతో మేడారం వెళ్లలేని భక్తులు స్థానికంగా మినీ మేడారం జాతర్లలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. విద్యా, ఉద్యోగం, వృత్తి రీత్యా వలస వెళ్లిన అనేక మంది తమ సొంత ఊళ్లకు జాతర కోసం రాకపోకలు అధికమయ్యాయి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆర్టీసీ డిపో నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి. -
తెలంగాణ మహాకుంభమేళాకు సర్వం సిద్ధం
-
జన జాతరలు
ఎస్ఎస్ తాడ్వాయి: ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క – సారలమ్మ జాతరకు ములుగు జిల్లా ఎస్ఎస్.తాడ్వాయి మండలంలోని మేడారం ముస్తాబైంది. జాతర జరిగే నాలుగు రోజుల్లో కోట్లాది మంది భక్తులు వన దేవతలను దర్శించుకోనున్నారు. సమ్మక్క – సారలమ్మ జాతర తరహాలోనే బీరప్ప, కోట మైసమ్మ, రేణుకా ఎల్లమ్మ వంటి స్థానిక జాతరలు ఉన్నాయి. మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా అనేక జాతరలు ప్రతీ ఏటా జరుగుతుంటాయి. వీటిలో ప్రధానమైన కొన్ని జాతరల విశేషాలు. జంగూబాయి: గోండు తెగకు చెందిన ఆదివాసీలు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం సమీపానికి సరిహద్దు ప్రాంతంగా కలసి ఉన్న మహారాష్ట్రలో ఈ జాతర జరుపుకుంటారు. ఆదివాసీల ఆరాధ్య దైవమైన జంగూబాయి దేవతకు ప్రతిరూపమైన పెద్దపులిని పూజిస్తారు. గోండులంతా మాఘ శుద్ద పౌర్ణమి మాసం రాగానే నెల రోజుల పాటు జంగూబాయి మాలలు వేస్తారు. జంగూమాతను టెంకాయలు మొక్కులుగా సమర్పిస్తారు. అక్కడి గుట్ట లోని గుహలో ఉండే పెద్దపులికి జంగో లింగో అంటూ జేకొడుతూ దర్శనం చేసుకుంటారు. బీరమయ్య ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజీపూర్ జిల్లాలోని బస్తర్, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని వాజేడు మండల సరిహద్దు ప్రాంతంలో ఉన్న లొటపిట గం డి కొండల్లో ఆదివాసీలు బీరమయ్య జాతర నిర్వహిస్తారు. పూర్వ కాలంలో ప్రజలను దోపిడీ దొంగలు దోచుకుపోతుంటే వారి నుంచి రక్షించేందు కు ముగ్గురు అన్నదమ్ములు పగిడిద్దరాజు, పాంబోయి, బీరమయ్య సిద్ధమవుతారు. ఈ దోపిడీ దొం గలను తరుముకుంటూ పగిడిద్దరాజు మేడారానికి, భూపాలపట్నం వైపు, బీరమయ్య లొటపిట గండికి వెళ్లి స్ధిరపడతారు. అప్పటి నుంచి బీరమయ్యకు లొటపిటగండిలో, పాం బోయికి భూపాలపట్నం లో, పగిడిద్దరాజుకు మేడా రంలో జాతరలు నిర్వహిస్తారని అక్కడి పెద్దలు చెబుతారు. ఈశాన్య రాష్ట్రాల్లో హర్నిబిల్ భారత దేశంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాలు అనేక ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. పూర్తిగా కొండలు, అడవులతో నిండిన ఈ ప్రాంతంలో గిరిజన జనాభా ఎక్కువ. వందల సంఖ్యలో గిరిజన తెగలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఇక్కడున్న ఏడు రాష్ట్రాల్లో ప్రతి తెగకు సంబంధించి వేర్వేరుగా జాతరలు ఉన్నాయి. వీటిలో నాగాలాండ్‌లో జరిగే హర్నిబిల్ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. ఏటా డిసెంబర్ మొదటి వారంలో ఈ జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతర ప్రధాన ఉద్దేశం గిరిజన తెగలకు సంబంధించిన ప్రత్యేక సంస్కృతి , సంప్రదాయాలను కాపాడుకోవడం. ఈ పండుగ సందర్భంగా ఇక్కడి గిరిజనులు ఆటపాటలతో ఆడిపాడుతారు. సంస్కృతికి సంబంధించిన వేడుక కావడంతో ఇది కనులపండువగా సాగుతుంది. హర్నిబిల్ జాతర తర్వాత జనవరిలో మణిపూర్‌లో థీసమ్ ఫణిత్ జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సహ్రుల్ ఆదివాసీల జనాభా ఎక్కువగా ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో సహ్రుల్ జాతర జరుగుతుంది. ఈ జాతరలో భాగంగా ప్రకృతిని పూజిస్తారు. ఇక్కడ ఉండే సాల్ అనే చెట్టుకు ప్రత్యేక పూజలు జరుపుతారు. ధర్తీ మాతగా సీతాదేవి ఇక్కడ కొలుస్తారు. ప్రకృతి విపత్తులు ఇతర కష్టాల నుంచి తమను కాపాడుతారని ఇక్కడి గిరిజనుల విశ్వాసం. మఘేపరాబ్ ఒడిశా రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాల్లో గిరిజనులకు ప్రత్యేక స్థానం ఉంది. ఏడాది పొడవునా అనేక జాతరలు జరుగుతాయి. ఇందులో ఏడు ప్రధానమైన జాతరలు ఉన్నాయి. వీటిలో మఘేపరాబ్ జాతర ఒకటి. ఈ జాతర సందర్భంగా తమ తెగ దేవతకు నల్లని పక్షులు బలిస్తారు. మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. నాగోబా ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో నాగోబా జాతర జరుగుతుంది. ఆదివాసీలకు ఇది ప్రధాన జాతర. మూడు రోజుల పాటు (ఇటీవలే జరిగింది) నిర్వ హిస్తారు. నాగోబా జాతరను మెస్రం వంశస్తులు, గోండు ఆదివాసీలు జరుపుతారు. పుష్యమాసంలో నెలవంక చంద్రుడు కనిపించగానే.. మెస్రం వంశస్తులు హస్తిన మడుగు నుంచి కలశంతో నీరు తీసుకొచ్చి నాగులమ్మ దేవతను పూజిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నాగోబా జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. దంతేశ్వరీ ఉత్సవాలు ఆదివాసీ తెగ ప్రజలు అత్యధికంగా జీవించే ఛత్తీస్‌గఢ్‌లో దసరా పండుగ సమయంలో ఇక్కడ అన్నమదేవ్ రాజవంశీయులు దంతేశ్వరీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జగదల్పూర్ కేంద్రంగా జరిగే ఈ జాతరకు అత్యధికంగా గిరిజనులు హాజరవుతారు. రాజవంశీయులు కీలక భూమిక పోషించినా ప్రధాన పాత్ర గిరిజనులదే. అదేవిధంగా రాయ్‌పూర్ సమీపంలో ఉన్న భోరమ్‌దేవ్ జాతర ప్రత్యేకతను సంతరించుకుంది. గరియ మాత త్రిపుర రాష్ట్రంలో రీంగ్ తెగకు చెందిన ఆదివాసీలు గరియ పూజ జాతరను జరుపుకుంటారు. చైత్ర సంక్రాంతి రోజున ఒక వెదురు దండాన్ని ప్రత్యేకంగా కాటన్దారం, కాటన్‌తో తయారు చేసిన పూలతో అలంకరిస్తారు. దైవత్వానికి అంకితమైన కొందరు వ్యక్తులు ఈ దండాన్ని పట్టుకుని గ్రామంలో ఇంటింటికీ తిరుగుతారు.ఆ సమయంలో దేవతను స్తుతిస్తూ పాటలు పాడుకుంటూ నృత్యాలను చేస్తూ పంటలు బాగా పండాలని బాధలు నుంచి విముక్తి కలిగించాలని కోరుతారు. నాగోబా జాతరలో భక్తులు (ఫైల్) -
అడవి బిడ్డలు ధీర వనితలు
సమ్మక్క, సారలమ్మ.. తల్లీకూతుళ్లు. గిరిజనుల అవస్థలు చూసి చలించిపోయారు. వారి కోసం పోరాడి రణభూమిలోనే ప్రాణాలొదిలారు. సమ్మక్క, సారలమ్మ తమకోసం చేసిన ఆ త్యాగానికి గిరిజనులు గండెల్లోనే గుడి కట్టారు. వారినే ఆరాధ్య దైవాలుగా భావిస్తూ రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్క పున్నమి) రోజుల్లో మేడారంలో అంగరంగ వైభవంగా జాతర చేస్తున్నారు. కోటి మందికిపైగా భక్తులు వచ్చే.. ఆసియాలోనే అతి పెద్దదైన ఈ గిరిజన వనజాతర ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ ఇద్దరు ధీర వనితల జీవిత విశేషాలు.. సంక్షిప్తంగా.. మీ కోసం. జన్మ వృత్తాంతం సమ్మక్క పుట్టుక వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని ‘పొలవాస’ను పాలించే గిరిజన దొర మేడరాజు వేటకు వెళ్లినçప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ పాప కనిపించిందట. అలా దొరికిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు. మేడరాజు ఆలన, పాలనలో పెరిగిన సమ్మక్క యుక్తవయస్సుకు వచ్చాక ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు, కాకతీయుల సామంతరాజు పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న సంతానం. సారలమ్మకు గోవిందరాజులుతో పెళ్లి జరిగింది. మేడారంలో సారలమ్మ తల్లి గద్దె జాతర స్థల పురాణం మేడారాన్ని ఆక్రమించేందుకు దండెత్తిన కాతీయుల సైన్యాన్ని తిప్పికొట్టేందుకు గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి పోరాడిన సమ్మక్క.. కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని సైతం ముప్పుతిప్పలు పెడుతుంది. భర్త, కుమారుడు, అల్లుడు, కుమార్తెల మరణవార్త విని కూడా ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగుతుంది. శత్రువు వర్గంలో ఒకరు వెనుక నుంచి వచ్చి ఆమెను బల్లెంతో పొడుస్తారు. తన రక్తంతో తడిస్తే ఆ ప్రాంతమంతా కరువు కాటకాలతో నిండిపోతుందనే ఉద్దేశంతో తన గాయానికి కట్టు కట్టుకుని... శత్రువులను హతమార్చుతూ మేడారం సమీపంలో ఉన్న చిలుకలగుట్ట వైపు సాగుతూ మార్గమధ్యంలోనే సమ్మక్క అదృశ్యమౌతుంది. గిరిజనులు సమ్మక్క కోసం అరణ్యమంతా గాలించినా ప్రయోజనం ఉండదు. ఓ పాము పుట్ట దగ్గర పసుపు కుంకుమలున్న ఒక భరిణె కనిపిస్తుంది. గిరిజనులు ఈ భరిణనే సమ్మక్కగా భావించి తమ కోసం ప్రాణాలు అర్పించిన సమ్మక్కను, ఆమె కూతురు సారలమ్మను స్మరించుకుంటూ జాతర చేసుకుంటారు. అలా ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. జాతరకు వచ్చే భక్తులు అక్కడి జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేస్తారు. మేడారంలో సమ్మక్క తల్లి గద్దె విగ్రహాలు ఉండవు! మేడారం గ్రామంలో సమ్మక్క సారలమ్మలకు ఎలాంటి విగ్రహాలూ ఉండవు. గద్దెలు నిర్మించి, వాటికి ఒక కర్ర నాటి ఉంటుంది. వీటిని ‘సమ్మక్క, సారలమ్మల గద్దెలు’ అంటారు. రెండు గద్దెలలో ఒకదాన్ని సమ్మక్క గద్దెగా, ఇంకో దాన్ని సారలమ్మ గద్దెగా పిలుస్తారు. వీటి మధ్య ఉండే చెట్టు కాండాలనే దేవతామూర్తులుగా కొలుస్తారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకునే భక్తులు వనదేవతలకు ఎత్తు్త బంగారం (బెల్లం) సమర్పించుకుంటారు. – గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి, వరంగల్ ఫొటోలు : గుర్రం సంపత్‌గౌడ్ -
మేడారం జాతర అరుదైన ఫోటోలు మీ కోసం....
-
మేడారం జాతర : మండమెలిగె.. మది వెలిగె
సాక్షి, ఎస్ఎస్ తాడ్వాయి(వరంగల్) : మండమెలిగె పండుగకు వచ్చాం.. సల్లంగజూడు సమ్మక్కా అంటూ భక్తుల మొక్కులతో మేడారం మహాజాతర కిక్కిరిసిపోయింది. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం శ్రీసమ్మక్క–సారలమ్మ మహాజాతరలో భాగంగా బుధవారం అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు మండమెలిగె పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పొలిమేరల్లో దిష్టితోరణాలు కట్టారు. రాత్రి సమక్క, సారలమ్మ పూజారులు గద్దెల వద్ద జాగారం చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ మేరకు గద్దెల వద్ద పూజారులు రహస్య పూజలు చేస్తుండడంతో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 5 గంటల వరకు భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు. తరలివచ్చి.. తరించి.. ఈ సందర్భంగా వనదేవతలను దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జంపన్నవాగు వద్ద స్నానఘట్టాల షవర్ల వద్ద స్నానాలు చేసి తల్లుల గద్దెలకు చేరుకొని దర్శించుకొని బెల్లం, కోళ్లు, చీరెసారెలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో అమ్మవార్ల గద్దెలు కిటకిటలాడాయి. క్యూలైన్లు భక్తులతో నిండిపోయింది. మధ్యాహ్నం వాహనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ నియంత్రణ కోసం కొత్తూరు నుంచి కన్నెపల్లి బీటీ రోడ్డు నుంచి పార్కింగ్ స్థలానికి వాహనాలు మళ్లించారు. పగిడిద్దరాజు దేవాలయంలో మండమెలిగె గంగారం : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలోని పగిడిద్దరాజు దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం కావాలంటే సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజు పూనుగొండ్ల నుంచి బయలుదేరి రావాల్సి ఉంటుంది. ఈ మేరకు పగిడిద్దరాజు దేవాలయంలో బుధవారం మండమెలిగె పూజలు చేశారు. పెనక వంశీయులతోపాటు గిరిజనులు పగిడిద్దరాజు ఆలయం శుద్ధి1 చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఆ తర్వాత పసుపు, గాజులను, నూతన వస్త్రాలను పట్టుకుని ప్రధాన పూజారులైన పెనక మురళీధర్, సురేందర్, బుచ్చిరాములు, సమ్మయ్య తదితరులు మేడారానికి బయలుదేరారు. కొండాయిలో.. ఏటూరునాగారం: ఏటూరునాగారం మండలంలోని కొండాయిలో కొలువై ఉన్న గోవిందరాజుల గుడిని పూజారులు దబ్బగట్ల గోవర్ధన్, వడ్డె బాబులు శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న గోవిందరాజులకు దూపదీప నైవేద్యాలను సమర్పించారు. బెల్లం శాక, కొబ్బరికాయలు, కుంకుమ, పసుపులతో పూజలు చేశారు. అనంతరం బెల్లంశాక, పూజ సామగ్రిని తీసుకొని మేడారానికి పూజారులు చేరుకున్నారు. -
సమ్మక్క–సారక్క జాతరకు తొలిరోజే పోటెత్తిన భక్తులు
-
నేటి నుంచే మహా జాతర
-
మేడారం జాతరకు రాహుల్ గాంధీ?
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో రాహుల్ గాంధీ తొలుత తెలంగాణలోనే పర్యటించనున్నట్లు సమాచారం. జనవరి నుంచి రాహుల్ బహిరంగ సభలు ఉంటాయని, ఫిబ్రవరిలో జరుగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా ఆయనను ఆహ్వానిస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే పార్టీలో మార్పులు : సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువున్న నేపథ్యంలో పార్టీలో పలు మార్పులు చోటుచేసుకుంటాయని ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, మున్ముందు మరింతగా బలపడుతుందన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు కొందరు కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్లు తెలిపారు. -
జాతీయ పండుగగా గుర్తిస్తాం
ఎస్ఎస్ తాడ్వాయి: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను ఘనంగా జరుపుకుంటున్నామని, వచ్చే జాతర నాటికి జాతీయ పండుగగా గుర్తించేందుకు కృషి చేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం ఆయన కుటుంబసభ్యులతో కలిసి మేడారంలో సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకుని మొక్కు లు చెల్లించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో మొదటిసారి జరిగే జాతరకు రూ. కోట్లు వెచ్చించి భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. గోదావరి పుష్కరాల అనుభవంతో ఈ జాతరను విజయవంతం చేసేందుకు కలెక్టర్, ఎస్పీలు కృషి చేస్తున్నారన్నారు. ప్రశాంత వాతవారణంలో భక్తులు దేవతలను దర్శించుకునేలా దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారని చెప్పారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీ సీతారాంనాయక్ తదితరులు ఉన్నారు. -
వన జాతర
మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : తూర్పు ప్రాంతంలో బుధవారం వన దేవతల జాతర కన్నుల పండువగా ప్రారంభమైంది. మంచిర్యాల, చెన్నూర్, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, గోలేటి, రెబ్బెన, బెజ్జూర్‌లో సమ్మక్క-సారలమ్మ జాతర బుధవారం నేత్రపర్వంగా జరిగింది. సారలమ్మ దర్శనంతో భక్తులు పులకించారు. అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. రెండేళ్లకు ఒకసారి వచ్చే జాతర కావడంతో భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. పులకించిన గోదారి సరిహద్దు.. మంచిర్యాలలోని గోదావరి తీరంలో సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తజనం పోటెత్తింది. గోదావరి తీరాన కరీంనగర్ జిల్లా గోలివాడ, మంచిర్యాల రెండు వైపుల జాతర జరుగుతుండడంతో భక్తులతో గోదావరి కిటకిటలాడింది. జిల్లా తూర్పు ప్రాంతంలోని ఆసిఫాబాద్, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, వాంకిడి, కౌటాల, బెజ్జూర్ మండలాల నుంచే కాకుండా సరిహద్దున ఉన్న మహా రాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు గోదావరి దారులు కిక్కిరిశాయి. పిల్లాపాపలు,సామగ్రితో భక్తులు జాతరకు చేరుకున్నా రు. ఎడ్లబండ్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలు, కారు, కాలినడకన వచ్చారు. మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న గోదావరి తీరం వరకు భక్తులు బారులు తీరారు. కొలువుదీరిన సారలమ్మ తొలి రోజు కూతురు సారలమ్మ గద్దెపై కొలువుదీరింది. మేడారం నుంచి వచ్చిన పూజారులు లక్ష్మయ్య, అనసూర్య, రాధ, సమ్మయ్య సారలమ్మకు పూజలు చేసి భక్తుల జయజయ ధ్వానాలు, బాజా భజంత్రీల మధ్య గద్దెల వరకు తీసుకొచ్చారు. సాయంత్రం ఐదు గంటలకు సారలమ్మ గద్దెపై కొలువుదీరగానే భక్తులు భక్తి పారవశ్యంతో ఊగిపోయారు. అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో శివసత్తులు పూనకంతో పరవశించి పోయారు. మహిళలను అమ్మవారు ఆవహించగా.. గద్దెపై కొలువుదీరిన అనంతరం శివసత్తులు మామూలు స్థితికి వచ్చారు. నేడు సమ్మక్క రాక తొలిరోజు కూతురు సారలమ్మ గద్దెపైకి చేరుకోగా గురువారం సమ్మక్క గద్దెపై కొలువుదీరనుంది. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోవడానికి గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తె అవకాశాలు ఉన్నాయి. తొలిరోజు సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. గోదావరిలో పుణ్యస్నానాలు పవిత్రమైన గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. వన దేవతలను దర్శనం చేసుకునే ముందు గోదావరి నదిలో స్నానాలు చేస్తే పునీతలవుతారని భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు నేరుగా గోదావదికి వెళ్లి పిల్లాపాపలతో స్నానాలు చేశారు. అనంతరం సారలమ్మను దర్శనం చేసుకోవడానికి బారులుతీరారు. నిలువెత్తు బంగారం(బెల్లం), తలనీలాలు సమర్పించారు. కోళ్లు, మేకలు బలి ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ప్రముఖుల పూజలు సారలమ్మ గద్దెపై కొలువుదీరగానే అధికారులు, రాజకీయ నాయకులు తొలి దర్శనం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్‌రావు, మాజీ ైచె ర్మన్ పెంట రాజయ్య, తహశీల్దార్ రవీందర్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, డీఈ వెంకటేశ్వర్లు, ఏఈలు సంతోశ్, మసూద్‌అలీ, ఇన్చార్జి సీఐ కరుణాకర్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, రమేశ్, ఆలయ ఈవో వామన్‌రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దయానంద్, మాజీ కౌన్సిలర్ కిషన్ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. భక్తులకు ఏర్పాట్లు భక్తుల తాకిడిని ముందుగానే అంచనా వేసిన అధికారులు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేసి నల్లాల ద్వారా భక్తులకు తాగునీరు, స్నానాలకు నల్లాలు, మహిళలు దుస్తులు మార్పుకోవడానికి ప్రత్యేక గదులు, తక్షణ వైద్య సహాయం కోసం ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పురపాలక సంఘం సిబ్బంది బ్లీచింగ్ పౌడర్ చల్లారు. విద్యుత్ దీపాలను అమర్చారు. పోలీసులు శాంతి భద్రతలు పర్యవేక్షించారు. మార్కెట్ కమిటీ కార్యాలయం సమీపంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. రాంనగర్ నుంచి వన్‌వే ఏర్పాటు చేసి వాహనాలను మళ్లించారు. దుకాణాలు వెలి శాయి. ఈసారి మద్యం అమ్మకాలకు అనుమతి లభిం చకపోవడంతో మందుబాబులు ఇబ్బందులు పడ్డారు. వ్యాపారులు ధరలను అమాంతం పెంచారు. -
మేడారంలో పొటెత్తిన భక్తులు
మేడారం జాతరకు భక్తులు పొటెత్తారు. దాంతో మేడారం వెళ్లే మార్గంలో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ములుగు - మేడారం రహదారిలో వాహనాలు బారులు తీరాయి. పస్రా - మళ్లంపల్లి వరకు దాదాపు 40 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరణకు చర్యలు చేపట్టలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు ఆర్టీసీ అధికారులు కల్వర్టుల వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. అయితే ములుగు రహదారిపై ఆటోలను అధికారులు నిషేధించారు. 9 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 16 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. నేడు కన్నెపల్లి నుంచి గద్దెమీదకు సారలమ్మ రానుంది. సారలమ్మ రాకతో మేడారం జాతర ప్రారంభమవుతుంది.