సమ్మక్క గద్దె వద్ద పూజలు చేస్తున్న ఎమ్మెల్సీ కవిత. చిత్రంలో ఎంపీ మాలోతు కవిత
హన్మకొండ/ ఎస్‌ఎస్ తాడ్వాయి: దక్షిణ భారత కుంభమేళా అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని భా రత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మేడారం వనదేవతల దర్శనానికి వెళ్తూ హనుమకొండలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
కేంద్ర ప్రభు త్వం గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసి సమ్మ క్క– సారక్క పేరు పెట్టడం గర్వకారణమన్నారు. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీ లిచ్చిందని, రాష్ట్రంలో 45 లక్షల మందికి పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచుతామని చెప్పిన మేరకు జనవరి 1 నుంచి రూ.4 వేల చొప్పున చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. డిసెంబర్‌లో పెన్షన్, రైతుబంధు సకాలంలో అందించడంలో ప్రభు త్వం విఫలమైందని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం నివేదిక రాకముందే ఆగమాగం చేస్తున్నారని, దీనిపై బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికే మాట్లాడారని గుర్తు చేశా రు. సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాక ర్‌రావు, మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, శంకర్ నాయక్ పాల్గొన్నారు. కాగా, ములుగు జిల్లా మేడారం సమ్మక్క– సారలమ్మలను ఎమ్మెల్సీ కవిత, ఎంపీ కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment