National festival
-
మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలి
హన్మకొండ/ ఎస్ఎస్ తాడ్వాయి: దక్షిణ భారత కుంభమేళా అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని భా రత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మేడారం వనదేవతల దర్శనానికి వెళ్తూ హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభు త్వం గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసి సమ్మ క్క– సారక్క పేరు పెట్టడం గర్వకారణమన్నారు. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీ లిచ్చిందని, రాష్ట్రంలో 45 లక్షల మందికి పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచుతామని చెప్పిన మేరకు జనవరి 1 నుంచి రూ.4 వేల చొప్పున చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. డిసెంబర్లో పెన్షన్, రైతుబంధు సకాలంలో అందించడంలో ప్రభు త్వం విఫలమైందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం నివేదిక రాకముందే ఆగమాగం చేస్తున్నారని, దీనిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికే మాట్లాడారని గుర్తు చేశా రు. సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాక ర్రావు, మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, శంకర్ నాయక్ పాల్గొన్నారు. కాగా, ములుగు జిల్లా మేడారం సమ్మక్క– సారలమ్మలను ఎమ్మెల్సీ కవిత, ఎంపీ కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు దర్శించుకున్నారు. -
మేడారం జాతరకు జాతీయ హోదా కోసం కృషి
సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క–సారక్క జాతరకు జాతీయ పండుగ హోదా దక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి మరోసారి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆమె ఆదేశించారు. జాతీయ పండుగ హోదాతో రాష్ట్ర ప్రభుత్వమిచ్చే నిధులకు కేంద్ర నిధులు తోడైతే జాతరను మరింత ఘనంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుందన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమ్మక్క–సారక్క జాతర ఏర్పాట్లపై సోమవారం డీఎస్ఎస్ భవన్లో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. కోయ గిరిజన ఇలవేల్పుల సమ్మేళనం ఈసారి జాతర సమయంలో జరిగేటట్లు చూడాలని, తద్వారా భక్తులకు గిరిజన సాంస్కృతిక వైభవం గురించి బాగా తెలుస్తుందని మంత్రి సూచించారు. జాతర ఏర్పాట్లపై వచ్చే వారం ఏటూరునాగారంలోని ఐటీడీఏలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పల్లె ప్రజలకు మరింత చేరువ కావాలి పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జరిగే కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు నిత్యం ఎంతో ఉపయోగ పడేవనీ, వాటిని మరింత సమర్ధవంతంగా ప్రజలకు చేరువయ్యేలాగా అధికారులు పనిచేయాలని ఆశాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సూచించారు. సోమవారం రాజేంద్రనగర్ టి.ఎస్.ఐ.ఆర్.డి.లో శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి శాఖ పని తీరును సమీక్షించారు. పీఆర్ ఆర్డీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ శెట్టి, ఇంజనీర్ ఇన్ చీఫ్ సంజీవ రావు, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి ఆయా విభాగాల వారీగా చేపడతున్న కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
జపాన్‌లో పుష్పవిలాసం.. హనామీ ఫెస్టివల్.. జపాన్ జాతీయ పండుగ
రుతువులు మారే వేళ.. ప్రకృతి వింత అందాలను సంతరించుకున్న వేళ.. నింగిలోని కోటి తారలే నేలపై పూలై విరబూసే సమయాన.. ఒక పండుగ శోభ మది మదిని ఆహ్లాదపరుస్తుంది. రాలేటి పూలు రాగాలు పలికిస్తుంటే, పూసేటి పూలు సుగంధాలు వెదజల్లుతూ ఉంటే తెలుగువారు ఆమని పాడవే హాయిగా అని పాటలు పాడుకుంటారు. అదే జపాన్‌లో అయితే చెర్రీ బ్లాసమ్ (సకుర) చెట్ల కింద కూర్చొని వేడుకలు చేసుకుంటారు. వాతావరణ మార్పుల కారణంగా ఈ ఏడాది చెర్రీ బ్లాసమ్ సీజన్ జపాన్ను ముందుగానే పలకరించింది. జపాన్ దేశవ్యాప్తంగా చెర్రీ బ్లాసమ్ చెట్లు ఎక్కడంటే అక్కడే కనిపిస్తాయి. సాధారణంగా మార్చి చివరి వారంలో ఈ చెట్లు విరగబూస్తాయి. కానీ ఈ ఏడాది పది రోజుల ముందే చెర్రీ బ్లాసమ్స్ పూసాయి. రోడ్డుకిరువైపులా ఉన్న చెట్లు నిండా తెలుపు, గులాబీ రంగుల్లో పువ్వులు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. కొన్ని చెట్లకు పసుపు, ఆకుపచ్చ రంగుల్లో కూడా పూలు పూస్తాయి. ఈ పూలు కేవలం 15 నుంచి నెల రోజుల వరకు మాత్రమే ఉండి ఆ తర్వాత నేల రాలిపోతాయి. అందుకే ఈ సీజన్లో జపాన్‌లో ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. చెర్రీ బ్లాసమ్‌ని మహోత్సవంలా నిర్వహిస్తారు. దీనినే హనామీ ఫెస్టివల్ అంటారు. ఇది జపాన్ జాతీయ పండుగ. వెయ్యేళ్ల క్రితం నుంచే హనామీ ఉత్సవాలు జపాన్ నేలపై జరుగుతున్నాయి. ఈ సీజన్ ఎందరో కవుల హృదయాలను తట్టి లేపి దేశానికి అమృతంలాంటి కవిత్వాన్ని పంచి ఇచ్చింది. ఈ సీజన్లో ప్రజలు తమ బాధలన్నీ మర్చిపోయి రోజంతా చెట్ల కింద ఆడుకుంటారు. పాడుకుంటారు. ముచ్చట్లు చెప్పుకుంటారు. తింటారు. తాగుతారు. అక్కడే సేద తీరుతారు. పార్కులు, రోడ్డుకిరువైపులా చెర్రీలు కనువిందు చేస్తుంటే ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి చీర్స్ చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తారు. చైనా, కొరియా, తైవాన్, యూరప్, అమెరికా దేశాల్లో కూడా చెర్రీ బ్లాసమ్ చెట్లు ఉన్నప్పటికీ జపాన్‌లో చేసినట్టుగా ఒక పండుగలా వైవిధ్యభరితంగా మరెవరూ చేయరు. ఆహ్లాదంతో ఆదాయం ఈ పండుగ జపాన్ వాసులకు ఆహ్లాదాన్ని పంచడమే కాదు ఆదాయాన్ని కూడా భారీగా సమకూరుస్తుంది. ఈ సీజన్లో జపాన్‌కి పర్యాటకులు పోటెత్తుతారు. గత రెండు మూడేళ్లుగా కరోనా మహమ్మారితో ఈ పండుగ కాస్త కళ తప్పింది. ఈ ఏడాది అన్ని భయాలు తొలగిపోవడంతో జపాన్ వాసులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. మార్చి నుంచి ఏప్రిల్ వరకు కొన్ని ప్రాంతాల్లో ఈ చెట్లు పూస్తే, దేశానికి ఉత్తరాదివైపు ఉండే హిరోసాకి వంటి నగరాల్లో మేలో పూలు పూస్తాయి. ఈ సీజన్లో చెర్రీ చెట్లు దేశ ఖజానాకు 61,580 కోట్ల యెన్ల ఆదాయం తెచ్చిపెడతాయి. ఈ సమయంలో జపాన్‌కు ఏటా 23 లక్షల విదేశీ పర్యాటకులు వస్తుంటారు. ఈ సారి జపాన్‌కు బుకింగ్స్ గతం కంటే 70 శాతం ఎక్కువయ్యాయని ట్రావెలింగ్ సంస్థల గణాంకాలు వెల్లడించాయి. హనామీ పండుగలో పాల్గొనడానికి ముందస్తు బుకింగ్‌లకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. టోక్యోలో ప్రధాన కంపెనీలు దేశ విదేశాల్లోని తమ ప్రతినిధుల్ని చెర్రీ పిలిచి చెట్ల కిందే పార్టీలు చేసుకుంటాయి. అయితే ఈ చెట్లను ముందుగానే ప్రభుత్వం దగ్గర బుక్ చేసుకోవాల్సి ఉంటుంది! అలాగాక అప్పటికప్పుడు చెట్ల కింద పార్టీ చేసుకుందామంటే దొరకడం కష్టమే!! ఈ సీజన్లో జపాన్‌లో ఫుడ్ అండ్ బెవరేజెస్ కంపెనీల ఆదాయం ఓ రేంజ్లో ఉంటుంది. అవును మరి.. చెర్రీ అంటే ఏమనుకున్నారు. ఫ్లవర్ కాదు పవర్....!! – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాజమండ్రిలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభం
రాజమండ్రి(తూ.గో): రాజమండ్రి ఆర్ట్ కళాశాల మైదానంలో రెండురోజుల పాటు జరుగనున్న జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలు హాజరయ్యారు. గవర్నర్, కేంద్ర మంత్రి తో పాటు జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు రాష్ట్ర మంత్రులు వేణుగోపాల కృష్ణ, అవంతి శ్రీనివాస్‌లు హాజరయ్యారు. జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను గవర్నర్ బిశ్వభూషణ్ ప్రారంభించారు. దీనిలో భాగంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలు మన సంస్కృతి, సంప్రదాయాలను మరింత ఇనుమడింప జేస్తాయని ఆయన పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా కేంద్ర సాంస్కృతిక శాఖ అనేక రకాల ఉత్సవాలను నిర్వహిస్తోందని, దేశ ప్రజల్లో జాతీయతను పెంపొందించడానికి ఈ ఉత్సవాలు తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజల్లో జాతీయతా భావాన్ని పెంపొందించిన నేతల్లో సుభాష్ చంద్రబోస్ ఒకరని కొనియాడారు. కాగా, దేశ మహోన్నత సంస్కృతి, సాంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించేలా జరగనున్న ఈ వేడుకల్లో తేట తెలుగు సంస్కృతి, కళల కనువిందు, పలు రకాల ప్రసిద్ధ వంటకాల ప్రదర్శన జరగనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల సంస్కృతి వైభవం, విశిష్టతను చాటిచెప్పే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. -
వియ్ లవ్ ఇండియా
నిండు మనసుతో జాతి కోసం కదలడమే నిజమైన జాతీయ పండుగ. నిర్భయంగా ప్రశ్నించడమే స్వాతంత్య్ర సమర యోధులకు మనమిచ్చే నివాళి. స్వదేశీ వస్తు వినియోగాన్ని కోరిన గాంధీ దేశంలో విదేశీ వ్యాపార ధోరణిని నియంత్రించాల్సిందే. ఇందుకు సోషల్ మీడియానే ఉద్యమ వేదికగా చేసుకోవాలి.. ఇదీ ‘గీతం’ యూనివర్సిటీ విద్యార్థుల మనోగతం. పంద్రాగస్టు సంబరాల జోరులో వాడిగా, వేడిగా జరిగిన చర్చలోని ముఖ్యాంశాలు వారి మాటల్లోనే... వందన: ఏయ్ అపర్ణా! ఎక్సలెంట్... వాట్ ఏ స్పీచ్... అదరగొట్టావ్. కాకపోతే చిన్న డౌట్? అపర్ణ: ఏంటో? నీ కొచ్చిందా.. ఇంకెవరికైనా.. వందన: తల్లీ నాకే వచ్చింది. సరేనా... నీ స్పీచ్‌లో యూత్‌ను టార్గెట్ చేశావే. ఎందుకు? అపర్ణ: అయితే ఉండు.. మన బ్యాచ్ మొత్తం వస్తున్నారు. వాళ్లకేం డౌట్స్ ఉన్నాయో చెప్పనీ... యక్ష ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతా. కృష్ణకాంత్: అవునమ్మా. స్పీచ్ ఇచ్చావ్. క్వశ్చన్స్ మిగిల్చావ్. స్వదేశీ వస్తువులే వాడాలన్నావ్. అవినీతిని తరిమేయాలన్నావ్. అదే స్వాతంత్య్ర స్ఫూర్తి అని లెక్చరిచ్చావ్. ఆ మార్పు రావడం చెప్పినంత తేలికేంటి? సమైక్య: ఏం గాంధీగారు తేలేదా? అహింసతోనే బ్రిటిష్ వాళ్లను తరిమేయలేదా? కృష్ణకాంత్: హిస్టరీలొద్దమ్మా. గాంధీగారి స్పిరిట్ మన లీడర్స్‌లో ఉందా? వాళ్లకు లేకుండా మనమేం చేయగలం? అపర్ణ: అబ్బా... ఏం ఫిలాసఫీ చెప్పావ్. యూత్‌ను అంత తక్కువగా అంచనా వేయకు. ఫేస్బుక్లో ఒక్క పోస్ట్‌తో ప్రపంచం మొత్తం కదులుతుంది. ట్విట్టర్లో ఒక్క మెసేజ్ ఇచ్చి చూడు... దేశం కోసం యూత్ ఎలా ముందుకొస్తారో. సాయి నిఖిత: తల్లీ! సోషల్ మీడియా లాజిక్కా... మరి ఓటింగ్ దాకా వచ్చేసరికి యూత్ ఎందుకు దూరంగా ఉంటోంది. అప్పుడు నీ సోషల్ మీడియా ఏమైందో? గాంధీగారు మన వస్తువులే వాడాలన్నారు. మనమే వస్తువులను ఉత్పత్తి చేయాలన్నారు. కానీ మనోళ్లు మాత్రం గ్లోబల్ వీల్లో తిరుగుతున్నారు. వందన: అపర్ణా... అడ్డంగా ఇరుక్కుపోయావా? పాపం జాలేస్తోంది. సమైక్య: వందనా... కాస్త తగ్గుతావా? అపర్ణ చెప్పింది హండ్రెడ్ పర్సంట్ రైట్. కాకపోతే యూత్‌కు ఇంకా స్పిరిట్ కావాలి. మరింత ఐక్యం కావాలి. అది ఈ జనరేషన్ నుంచే మొదలవ్వాలి. గీతిక: ముందు ఈ దేశంలో మహిళలకు రక్షణ ముఖ్యం తల్లీ. స్వాతంత్య్రం వచ్చినా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి. ఇంటికి అరగంట లేటుగా వెళ్తే చాలు... పేరెంట్స్ కంగారు పడిపోతారు. హరిప్రియ: ఔను మరి రోజులలా ఉన్నాయి. పూటకో వార్త వింటున్నాం. అర్ధరాత్రి కాదు, పట్టపగలే ఒంటరిగా వెళ్లలేని పరిస్థితి. చట్టాలు కచ్చితంగా అమలు చేస్తే ఈ పరిస్థితి ఉంటుందా? కేసు పెడతారు... ఏళ్ల తరబడి సాగదీస్తారు. ఉర్ధువేసిఫ్: అందుకే కదా నిర్భయ చట్టం వచ్చింది. హరిప్రియ: వచ్చింది.. వచ్చింది... అయినా ఘాతుకాలు ఆగుతున్నాయా? అపర్ణ: మనవాళ్లంతా కరప్షన్‌కు అలవాటు పడ్డారమ్మా. అరే... డ్రైవింగ్ లెసైన్స్... పాస్‌పోర్టు... దేనికైనా బ్రోకర్‌ను ఆశ్రయించాల్సిందే కదా. అఫ్కోర్స్ ఈ తప్పులో మన భాగస్వామ్యం ఉందనుకోండి. పని జరగాలంటే తప్పడం లేదు. మనస్విని: అపర్ణా... ఈ బాధ నీకు నాకే కాదు. చాలామందిలో ఉంది. ఎంతోమంది ప్రాణాలర్పించి సాధించిన ఈ స్వాతంత్య్ర స్ఫూర్తి పక్కదారి పడుతోందని యూత్ అంటూనే ఉన్నారు. మాటలతో కాదు... మనమే ఏదైనా చేయాలి. దేశంకోసం ఐక్య ఉద్యమం చేయాలి. ఏదైనా ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసి, అందరినీ కలపాలి. వందన: నీ ఆలోచన చాలా బాగుంది. అదెలా? ఏం చేస్తే బాగుంటుందని నీ ఉద్దేశం. వసుంధర: సోషల్ మీడియానే దీనికోసం ఎందుకు ఉపయోగించుకోకూడదు. భావాలతో కలిసి వచ్చే యూత్‌ను ఎందుకు ఏకం చేయకూడదు. నిఖిత: నిజమే. ఇండిపెండెంట్ డే రోజే మద్యం విక్రయాలను నిషేధించడం కాదు. అన్ని రోజులూ ఇలాగే కట్టడి చేయాలనే మెసేజ్ యూత్ నుంచే పంపాలి. గీతిక: ఎవరో... ఎప్పుడో... ఏదో చేస్తారని కాదు... ఇంతమందిమి కలుసుకున్నాం. ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం... మనమే ఓ మంచి పనిచేద్దాం. ఆగస్టు 15 రోజున జెండా ఎగురవేయడమే స్వాతంత్య్రం కాదని, ఉపన్యాసాలు ఇవ్వడమే స్ఫూర్తి కాదని చెబుదాం. కృష్ణకాంత్: మంచి ఆలోచనకు వచ్చారు. నేనూ సపోర్టు చేస్తాను. స్ఫూర్తి రగిలించాలి స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించాల్సింది యువతే. విద్యాలయాలు ఆ దిశగా వారిని ప్రోత్సహించాలి. జాతీయ భావాన్ని నింపేందుకు కృషి చేయాలి. మార్కులు తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో, ఈ దేశానికి ఏం చేయాలనే ఆలోచనలు అంతే ముఖ్యం. ఆగస్టు 15న జాతీయ పండుగ చేసుకోవడంతోనే సరిపెట్టుకోవడం తగదు. - ఎన్.శివప్రసాద్, డెరైక్టర్ - భావన