
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క–సారలమ్మ మండమెలిగె పండుగ (మినీ మేడారం జాతర) తేదీలను ఖరారు చేశారు. 2023, ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 4 వరకు పూజా కార్యక్రమాలు జరుగుతాయని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు వెల్లడించారు.
ఈమేరకు మంగళవారం మేడారంలో సమావేశమైన సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజుల పూజారులు జాతర తేదీలను ప్రకటించారు. కాగా, ఖరారు తేదీల పత్రాలను కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ అధికారులకు అందజేశారు. మహా జాతర సమయంలో మొక్కులు తీర్చుకున్నవారితోపాటు ఇతర ప్రాంతాలనుంచి కూడా మినీ మేడారంజాతరకు భారీగా భక్తులు రానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment