mini medaram
-
ఫిబ్రవరి 1 నుంచి మినీ మేడారం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క–సారలమ్మ మండమెలిగె పండుగ (మినీ మేడారం జాతర) తేదీలను ఖరారు చేశారు. 2023, ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 4 వరకు పూజా కార్యక్రమాలు జరుగుతాయని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు వెల్లడించారు. ఈమేరకు మంగళవారం మేడారంలో సమావేశమైన సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజుల పూజారులు జాతర తేదీలను ప్రకటించారు. కాగా, ఖరారు తేదీల పత్రాలను కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ అధికారులకు అందజేశారు. మహా జాతర సమయంలో మొక్కులు తీర్చుకున్నవారితోపాటు ఇతర ప్రాంతాలనుంచి కూడా మినీ మేడారంజాతరకు భారీగా భక్తులు రానున్నారు. -
బుధవారం నుంచి మినీ మేడారం జాతర
వరంగల్: మాఘశుద్ధ పౌర్ణమిరోజున గిరిజనలు సాంప్రదాయబద్దంగా జరిపే మినీ మేడారం జాతర బుధవారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ జాతర కోసం గిరిజన పూజారులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి జంపన్న చెట్టును పూజిస్తారు. తలనీలాలు సమర్పిస్తారు. గిరిజనుల ఇలవేల్పులైన సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులకు బెల్లం సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవార్లకు మేకలు, కోళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. మామూలుగా గిరిజన పూజారులు పాల్గొనే ఈ జాతరలో ప్రతి ఏటా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం విశేషం. -
జన జాతర
జిల్లాలోని పలు ‘మినీ మేడారం’ జాతరలలో గురువారం భక్తులు పోటెత్తారు. ఇల్లెందు మండలంలోని బొజ్జాయిగూడెం; బయ్యారం మండలంలోని నంది మేడారం, నామాలపాడు; మణుగూరు మండలంలోని తోగ్గూడెం; కామేపల్లి మండలంలోని పండితాపురంలో ‘మినీ మేడారం’ వేడుకలు జరిగాయి. బొజ్జాయిగూడెం (ఇల్లెందు), న్యూస్‌లైన్: ‘మినీ మేడారం’ బొజ్జాయిగూడెం వనంలో గురువారం మధ్యాహ్నం నుంచే జనం పోటెత్తారు. బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్క ఆగమనంతో భక్తులు భక్తిపరవశులయ్యారు. గురువారం సాయంత్రం గంటలు 5:05 గంటలకు సమ్మక్కను గిరిజన పూజారులు, వడ్డెలు బొజ్జాయిగూడెం సమీపంలోని ముసలమ్మ గుట్టల నుంచి వనానికి తీసుకొచ్చారు. అనేకమంది భక్తులు బంగారం (బెల్లం) చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. కోరికలు నెరవేర్చాలని దేవతను వేడుకుంటూ గద్దెల వద్దనున్న చెట్టుకు ముడుపులు కట్టారు. మరికొంత మందరు జంతువులను బలి ఇచ్చారు. ఇం కొందరు తల నీలాలు సమర్పించారు. సమ్మక్క రాక కోసం గంటలతరబడి నిరీక్షిం చారు. జాతరలోని దుకాణాలు కిటకిటలాడాయి. కొందరు భక్తులు పూనకాలతో తూలారు. ఇల్లెందు-కొత్తగూడెం ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. తోగ్గూడెంలో.. మణుగూరు: మణుగూరు మండలం తోగ్గూడెం గ్రామ సమీపంలోని రథం గుట్ట అటవీ ప్రాంతం జనసంద్రమైంది. సమ్మక్కను గురవారం సాయంత్రం గిరిజన పూజారులు గద్దెనెక్కించారు. జాతరకు మణుగూరు, పినపాక, అశ్వాపురం, బూర్గంపాడు మండలాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద మొక్కులు తీర్చుకున్నారు. వైఎస్సార్ సీపీ నేత పాయం దంపతులు పూజలు చేశారు.