బుధవారం నుంచి మినీ మేడారం జాతర | mini medaram ustav starts on wednesday in warangal | Sakshi
Sakshi News home page

బుధవారం నుంచి మినీ మేడారం జాతర

Published Tue, Feb 3 2015 11:51 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM

mini medaram ustav starts on wednesday in warangal

వరంగల్: మాఘశుద్ధ పౌర్ణమిరోజున గిరిజనలు సాంప్రదాయబద్దంగా జరిపే మినీ మేడారం జాతర బుధవారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ జాతర కోసం గిరిజన పూజారులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి జంపన్న చెట్టును పూజిస్తారు. తలనీలాలు సమర్పిస్తారు.

గిరిజనుల ఇలవేల్పులైన సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులకు బెల్లం సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవార్లకు మేకలు, కోళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. మామూలుగా గిరిజన పూజారులు పాల్గొనే ఈ జాతరలో ప్రతి ఏటా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement