మేడారం జాతరకు భక్తులు పొటెత్తారు. దాంతో మేడారం వెళ్లే మార్గంలో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ములుగు - మేడారం రహదారిలో వాహనాలు బారులు తీరాయి. పస్రా - మళ్లంపల్లి వరకు దాదాపు 40 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ను క్రమబద్దీకరణకు చర్యలు చేపట్టలేదని భక్తులు ఆరోపిస్తున్నారు.
ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు ఆర్టీసీ అధికారులు కల్వర్టుల వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. అయితే ములుగు రహదారిపై ఆటోలను అధికారులు నిషేధించారు. 9 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 16 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. నేడు కన్నెపల్లి నుంచి గద్దెమీదకు సారలమ్మ రానుంది. సారలమ్మ రాకతో మేడారం జాతర ప్రారంభమవుతుంది.