బీఎస్‌ఎన్‌ఎల్ పీజీఎం నరేందర్
వరంగల్: మేడారం జాతర సందర్భంగా అమ్మవార్లను దర్శించుకునే భక్తులకు ఉచితంగా వైఫై సేవలను సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభించినట్లు బీఎస్‌ఎన్‌ఎల్ పీజీఎం కందగట్ల నరేందర్ ప్రకటించారు. ఉచిత వైఫై సేవలు ఈనెల 31వ తేదీన ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ జాతరకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో సోమవారం సాయంత్రం నుంచి సేవలను భక్తులకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. జాతర ప్రాంగణంలో 13 టవర్లతో సిగ్నల్స్ అందిస్తున్నామన్నారు. 20 హాట్‌స్పాట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ హాట్‌స్పాట్లకు 100 ఎంబీపీఎస్ ఇంటర్‌నెట్ స్పీడ్ కల్పిస్తున్నామన్నారు. ఒక్కో హాట్‌స్పాట్‌తో ఒకేసారి 12 వేల మంది కనెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నారు. వైఫై సేవలు ఫ్రీగా అందించేందుకు ఎంపీ సీతారాంనాయక్ కృషితో ప్రభుత్వం రూ.20 లక్షలు బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థకు చెల్లించారని తెలిపారు. జాతర పరిసరాలకు వెళ్లడంతోనే సెల్‌లో లాగిన్ పేజీ వస్తుందని, దానిలో అప్షన్ ఎన్నుకుంటే వచ్చే ఓటీపీ (వన్ టైం పాస్‌వర్డ్)తో కనెక్ట్‌అయి ప్రతి రోజు 500 ఎంబీ డాటాను వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఈ ఉచిత సేవలు అన్ని నెట్‌వర్కులతో సంబంధం లేకుండా కేవలం వైఫై ఆప్షన్‌తోనే డాటాను అందిస్తామని నరేందర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment