Free WiFi Services
-
మార్చికల్లా అన్ని గ్రామాలకూ ఉచిత వైఫై: రవిశంకర్ ప్రసాద్
రేవారి (హర్యానా): భారత్‌నెట్ ప్రాజెక్టు పరిధిలోని అన్ని గ్రామాలకూ వచ్చే మార్చి వరకు వైఫై ఉచితంగా అందిస్తున్నామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం హర్యానాలోని రేవారికి వచ్చిన సందర్భంగా చెప్పారు. ‘‘భారత్‌నెట్ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఇప్పటికే 1.3 లక్షల గ్రామ పంచాతీయలకు అనుసంధానించాం. 2.5 లక్షల గ్రామ పంచాయతీలను చేరుకోవాలన్నది లక్ష్యం. భారత్‌నెట్ సేవలను ప్రోత్సహించేందుకు గాను ప్రాజెక్టు పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ 2020 మార్చి వరకు ఉచితంగా వైఫై సేవలను అందిస్తున్నాం. భారత్ నెట్‌వర్క్‌కు అనుసంధానమైన మొత్తం గ్రామాల్లో ప్రస్తుతానికి 48,000 గ్రామాల్లో వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయి’’ అని మంత్రి వెల్లడించారు. -
వైఫై వర్రీ!
గ్రేటర్లో ఉచిత వైఫై సేవలు అలంకారప్రాయంగా మారాయి. బీఎస్ఎన్ఎల్– క్వాడ్జెన్ సంస్థలు సంయుక్తంగా మహానగరంలో 86 చోట్ల ఏర్పాటు చేసిన ఫ్రీ వై–ఫై హాట్‌స్పాట్స్‌లో 16 మినహా ఎక్కడా తొలి 15 నిమిషాలు ఉచిత డేటా వినియోగం(యాక్సెస్) అమలు కావడం లేదు. దాదాపు 70 హాట్‌స్పాట్స్ వద్ద ఉచిత వైఫై సేవలు అందడం లేదని ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలనలో తేలడం గమనార్హం. మార్చి నెలలో వై–ఫై హాట్‌స్పాట్స్ వద్ద 16,941 మంది మాత్రమే 1798.85 జీబీ డేటా వినియోగించుకున్నట్లు వెల్లడైంది. సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్లో నిర్ణీత డేటా వినియోగానికి సంబంధించి రీఛార్జీ చేసుకున్నవారికి మాత్రం నిరంతరాయంగా వై–ఫై సేవలు అందుబాటులోకి వస్తుండడం గమనార్హం. ఇక ఉచిత వై–ఫై వినియోగంలో నగరంలోని చారిత్రక, దర్శనీయ స్థలాలు అగ్రభాగాన నిలిచాయి. ప్రధానంగా చార్మినార్, ట్యాంక్‌బండ్, జూపార్క్, గోల్కొండ ఫోర్ట్, సాలార్జంగ్ మ్యూజియంలు తొలి ఐదు స్థానాలు దక్కించుకోవడం విశేషం. సిగ్నల్ వీక్..ఉచితం అంతంతే.. గ్రేటర్ పరిధిలో బీఎస్ఎన్ఎల్–క్వాడ్జెన్ సంస్థలు సంయుక్తంగా 86 చోట్ల వై–ఫై హాట్‌స్పాట్స్‌ను ఏడాది క్రితం ఏర్పాటుచేశాయి. వీటి వద్ద ఏకకాలంలో 300 మంది డేటాను వినియోగించుకునేందుకు వీలుగా 194 యాక్సెస్ పాయింట్లు ఏర్పాటుచేశారు. తొలుత 15 నిమిషాలు ఉచితంగా అందుతాయని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ 16 చోట్ల మినహా దాదాపు 70 హాట్‌స్పాట్స్ వద్ద ఈ పరిస్థితి లేదని ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలనలో తేలడం గమనార్హం. ప్రధానంగా ఎంజీబీఎస్, జేబీఎస్, నెక్లెస్‌రోడ్ వంటి అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఉచిత వై–ఫై సేవలకు వీక్సిగ్నల్ ప్రతిబంధకంగా మారింది. ఆన్లైన్లో నిర్ణీత డేటా వినియోగానికి సంబంధించి రీఛార్జీ చేసుకున్నవారికే సేవలు అందుతుండడం గమనార్హం. మార్చి నెలలో మొత్తం 86 వై–ఫై హాట్‌స్పాట్స్ వద్ద 16,941 మంది మాత్రమే 1798.85 గిగాబైట్ల డేటా వినియోగించుకున్నట్లు తాజా గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. వై–ఫై వినియోగంలో సమస్యలివీ.. ఉచిత ౖÐð ఫైఫై సేవల వినియోగం విషయంలో పలు మార్లు సమస్యలు ఎదురవుతున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఒకేసారి వందలాదిమంది వినియోగదారులు వైఫై సేవలు పొందేందుకు ప్రయత్నిస్తే వారికి నిరాశే ఎదురవుతోంది. స్పీడ్ తగ్గుతోందని,ఒక్కోసారి వై.ఫై కనెక్ట్కావడం లేదని నక్లెస్రోడ్పై వైఫై సేవలు వినియోగిస్తున్న పలువురు వినియోగదారులు ‘సాక్షి’కి తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినపుడు సేవలు పొందడం వీలుపడడంలేదని చెబుతున్నారు. హాట్‌స్పాట్ పరికరాల సామర్థ్యాన్ని పెంచాలని కోరుతున్నారు. విస్తరణ ఆలస్యమేనా..? గ్రేటర్ పరిధిలో మరో 240 ప్రాంతాల్లో వై–ఫై హాట్స్పాట్లను ఏర్పాటుచేయాలని బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది. కానీ వీటి ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మూడునెలలుగా అనుమతులు ఆలస్యమౌతుండడం,హాట్స్పాట్ల ఏర్పాటు,వాణిజ్య ప్రకటనలు, ఉచిత విద్యుత్ కనెక్షన్,రోడ్‌కటింగ్ అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో ఈ పనులు ఆలస్యమౌతున్నట్లు తెలిసింది. ప్రభుత్వపరమైన సహకారం అందితే మరో మూడునెలల్లోగా అనుకున్న ప్రకారం మరో 240 హాట్‌స్పాట్ పరికరాలను ఏర్పాటు చేస్తామని బీఎస్ఎన్ఎల్ సంస్థ చెబుతోంది. ఒక్కోచోట హాట్‌స్పాట్ ఏర్పాటుకు సుమారు లక్ష రూపాయలు అవసరమౌతాయని పేర్కొంది.నగరంలో తమ సంస్థకు 4500 కి.మీ మేర ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అందుబాటులో ఉందని ప్రకటించింది. వినోదం, సినిమాలకే అధికప్రాధాన్యం.. ఇక వైఫై వినియోగానికి వస్తే చాలామంది వినియోగదారులు సినిమాలు,పాటలు వీక్షించేందుకు యూట్యూబ్ లాంటి సైట్లను ఆశ్రయిస్తున్నారట..మరికొంతమంది వివిధ బస్సు,రైళ్ల వేళలు,రిజర్వేషన్ల వివరాలను తెలుసుకుంటున్నారట. ఇలా వినియోగించుకోవాలి... ♦ మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై ఆప్షన్‌పై క్లిక్‌చేసి మీ మొబైల్నెంబరును,ఈమెయిల్ అడ్రస్ టైప్‌చేసి సబ్మిట్చేయాలి. ♦ ఆతరవాత మీ మొబైల్‌కు యూజర్‌నేమ్,పాస్వర్డ్ ఎస్ఎంఎస్ రూపంలో అందుతాయి. ♦ రెండో బాక్సులో యూజర్‌నేమ్,పాస్వర్డ్ టైప్‌చేసి లాగిన్ కావాలి. అపుడు 15 నిమిషాలు ఉచిత వైఫై సేవలు అందుతాయి. ♦ ఆతరవాత వైఫై సేవలను వినియోగిచేందుకు ప్రతి అరగంటకు రూ.30 ఛార్జీ అవుతుంది. ఈ మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించవచ్చు. లేదా హాట్స్పాట్లున్నచోట బీఎస్ఎన్ఎల్ కూపన్లను కొనుగోలు చేయవచ్చు. బీఎస్ఎన్ఎల్ హాట్‌స్పాట్స్ ఏర్పాటుచేసిన ప్రాంతాలు కొన్ని.. ♦ సంజీవయ్యపార్క్,బిర్లామందిర్, బిర్లాప్లా నిటోరియం,బిర్లా సైన్స్ మ్యూజియం,నిమ్స్,పబ్లిక్‌గార్డెన్,చార్మినార్,గాంధీఆస్పత్రి,తారామతిబారాదరి,ప్లాజాహోటల్,సరూర్‌నగర్,ప్యాట్నీ,సీఎస్సీ తార్నాక,సీఎస్సీ గౌలీగూడా,కెపిహెచ్బి,లింగంపల్లి,జూబ్లీహిల్స్,కుషాయిగూడా,నాంపల్లి,అమీర్‌పేట్,మాదాపూర్,టోలిచౌకి,మేడ్చల్,పంజాగుట్ట,బీఎస్ఎన్ఎల్భవన్,సీటీఓ,ఎర్రగడ్డ,ఆబిడ్స్,తిరుమలగిరి,కొంపల్లి,ముషీరాబాద్, ♦ సాలార్జంగ్ మ్యూజియం, జూపార్క్, గోల్కొండఫోర్ట్, ప్రెస్‌క్లబ్,నానక్‌రాంగూడ. -
ఇక ఉచిత వైఫై సేవలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని పౌరులకు త్వరలో ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ప్రకటించిన ఉచిత వైఫై సేవల హామీ యువతను ఆకర్షించింది. ఢిల్లీలో ఆప్ పాలనాపగ్గాలు చేపట్టి బుధవారం నాటికి మూడేళ్లు పూర్తయ్యాయి. త్వరలోనే తాము ఉచిత వైఫై సేవలు ప్రారంభమయ్యే తేదీని వెల్లడిస్తామని..దీనికోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తా’మని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఉచిత వైఫై అమలుపై ఆప్ ప్రభుత్వం జాప్యం చేస్తోందని విపక్షాలు తరచూ విమర్శల దాడికి దిగుతున్న క్రమంలో కేజ్రీవాల్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఆప్ ప్రభుత్వం 2016, డిసెంబర్ నాటికి తూర్పు ఢిల్లీలోని 500 ప్రదేశాల్లో వైఫై హాట్‌స్పాట్స్ అందుబాటులోకి వస్తాయని ప్రకటించినా అది అమలుకు నోచుకోలేదు. మరోవైపు మహిళల భద్రత కోసం ఢిల్లీ అంతటా సీసీటీవీ కెమెరాలను అమర్చే ప్రక్రియ ప్రారంభమైందని కేజ్రీవాల్ వెల్లడించారు. -
మేడారంలో ఉచిత వైఫై షురూ...
వరంగల్: మేడారం జాతర సందర్భంగా అమ్మవార్లను దర్శించుకునే భక్తులకు ఉచితంగా వైఫై సేవలను సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభించినట్లు బీఎస్ఎన్ఎల్ పీజీఎం కందగట్ల నరేందర్ ప్రకటించారు. ఉచిత వైఫై సేవలు ఈనెల 31వ తేదీన ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ జాతరకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో సోమవారం సాయంత్రం నుంచి సేవలను భక్తులకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. జాతర ప్రాంగణంలో 13 టవర్లతో సిగ్నల్స్ అందిస్తున్నామన్నారు. 20 హాట్స్పాట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ హాట్స్పాట్లకు 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ కల్పిస్తున్నామన్నారు. ఒక్కో హాట్‌స్పాట్‌తో ఒకేసారి 12 వేల మంది కనెక్ట్ అయ్యే అవకాశం ఉందన్నారు. వైఫై సేవలు ఫ్రీగా అందించేందుకు ఎంపీ సీతారాంనాయక్ కృషితో ప్రభుత్వం రూ.20 లక్షలు బీఎస్ఎన్ఎల్ సంస్థకు చెల్లించారని తెలిపారు. జాతర పరిసరాలకు వెళ్లడంతోనే సెల్లో లాగిన్ పేజీ వస్తుందని, దానిలో అప్షన్ ఎన్నుకుంటే వచ్చే ఓటీపీ (వన్ టైం పాస్వర్డ్)తో కనెక్ట్అయి ప్రతి రోజు 500 ఎంబీ డాటాను వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. ఈ ఉచిత సేవలు అన్ని నెట్వర్కులతో సంబంధం లేకుండా కేవలం వైఫై ఆప్షన్‌తోనే డాటాను అందిస్తామని నరేందర్ తెలిపారు. -
ఉచితంగా 45 నిమిషాలు వైఫై
ఉచితంగా వైఫై సేవలు 45 నిమిషాల సదుపాయం 15 రోజుల్లోఅందుబాటులోకి ఏర్పాట్లలో జీహెచ్ఎంసీ సిటీ నెటిజన్లకు శుభవార్త. ఇక నగరం నలుమూలలా హ్యాపీగా బ్రౌజింగ్ చేసుకునేందుకు..ఇంటర్నెట్ ఆధారిత సేవలు ఉచితంగా పొందేందుకు జీహెచ్ఎంసీ అవకాశం కల్పిస్తోంది. స్మార్ట్ సిటీలో భాగంగా గ్రేటర్ పరిధిలో వంద ప్రాంతాల్లో ఒకే రోజు ఉచిత వైఫై హాట్స్పాట్లను అందుబాటులోకి తెచ్చేందుకు గ్రేటర్ యంత్రాంగం సిద్ధమవుతోంది. ప్రజలకు ఇంటర్నెట్ సేవలందిస్తున్న ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లలో పలువురు తాము ఉచిత సేవలందిస్తామని..అనుమతులివ్వాల్సిందిగా జీహెచ్ఎంసీని ఆశ్రయిస్తుండటంతో.. వచ్చే 15 రోజుల్లో వంద ప్రాంతాల్లో వీటిని ప్రజలకు అందించాలని అధికారులు భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు జోనల్ కార్యాలయాలు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టరేట్లు, హైకోర్టు ప్రాంగణం, ఇమ్లిబన్, జూబ్లీ బస్టాండ్లు, కేబీఆర్, సంజీవయ్య, వెంగళ్రావు, ఇందిరాపార్కులతో సహ ఆరు ప్రధాన పార్కుల్లో వైఫై సదుపాయం అందుబాటులోకి తేనున్నారు. వీటితోపాటు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో మొత్తం వంద ప్రాంతాల్లో ఒకేరోజు వీటిని అందుబాటులోకి తెచ్చే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించాలని జీహెచ్ఎంసీ అధికారులు యోచిస్తున్నారు. రోజుకు 45 నిమిషాలపాటు ఈ ఉచిత సదుపాయం లభిస్తుంది. ఈ ఉచిత సదుపాయంతోపాటు ..ఇప్పటికే ఆయా ప్రైవేట్ సంస్థలనుంచి ఇళ్లకు ఇంటర్నెట్ ను వినియోగించుకుంటున్నవారు తమ యూజర్ లాగిన్, పాస్‌వర్డ్‌లను వినియోగించుకొని కూడా ఈ వంద స్పాట్లలో వైఫై సదుపాయాన్ని పొందవచ్చు. అయితే ఈ వినియోగం వారి ఖాతాలో నమోదవుతుంది. ఇప్పటికే మొబైల్ యాప్స్‌ను విస్తృతంగా వినియోగిస్తున్న జీహెచ్ఎంసీ.. ప్రజలు ఎక్కడినుంచైనా తమ ఫిర్యాదులు పంపించేందుకు.. పరిష్కారమయ్యిందీ లేనిదీ తెలుసుకునేందుకు కూడా ఈ ఉచిత వైఫై సదుపాయం ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తోంది. వాట్సప్ ద్వారా రహదారులపై గుంతలు, చెత్త తొలగించని ప్రాంతాలు తదితర ఫిర్యాదులు చేసేందుకు సైతం ఈ ఉచిత వైఫై సేవలు ఉకరించగలవని అంచనా వేస్తున్నారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్రోడ్లతో సహ నగరంలోని వివిధ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ 30 ప్రాంతాల్లో ఇప్పటికే 20 నిమిషాల ఉచిత వై ఫై సదుపాయం క ల్పిస్తుండటం తెలిసిందే. ఇదే తరహాలో మరో వంద ప్రాంతాల్లో ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా 45 నిమిషాలపాటు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. వైఫై ఉంటే.. ఆన్లైన్లో అనుసంధానించిన సుమారు 15 రకాల ప్రభుత్వ సేవలను ఉచితంగా పొందవచ్చు.వైఫై సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్ ఉంటేచాలు.. మొబైల్ డేటా నెట్వర్క్ లేకున్నా, వైఫై కనెక్టివిటీ ద్వారా ఇంటర్నెట్ను బ్రౌజింగ్ చేసే వీలుంటుంది. వాట్సప్, ఈ-మెయిల్స్, ఫేస్బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్‌ల్లో చాటింగ్ చేయొచ్చు.ఒకే కనెక్షన్‌పై ఒకటి కన్నా ఎక్కువ మంది మాట్లాడుకునే యాక్సెస్ లభిస్తుంది. వైఫైతో ప్రభుత్వ, ప్రైవేటు సేవలే కాకుండా కొన్ని రకాల యాప్స్ కూడా ఉచితంగా పొందవచ్చు. ఉదాహరణకు పార్కింగ్ యాప్, గార్బేజ్ యాప్ వంటివి. ఈ యాప్ సేవలతో నగరం పరిశుభ్రంగా ఉండటమే కాకుండా ట్రాఫిక్ చిక్కులూ తప్పుతాయి. దీని ద్వారా స్మార్ట్‌సిటీగా మారవచ్చునని భావిస్తున్నారు. లాగిన్ ఇలా.. ప్రస్తుత బీఎస్ఎన్ఎల్ సేవల తరహాలోనే లాగిన్ కావాల్సి ఉంటుంది. అందుకు...స్మార్ట్ ఫోన్లో వైఫై ఆప్షన్‌పై క్లిక్‌చేసి మొబైల్ నెంబరును, ఈ-మెయిల్ అడ్రస్ టైప్‌చేసి సబ్మిట్చేయాలి.మీ మొబైల్‌కు యూజర్‌నేమ్, పాస్వర్డ్ ఎస్ఎంఎస్ రూపంలో అందుతాయి.వాటిని టైప్‌చేసి లాగిన్ కావాలి. ఇదీ వినియోగం.... గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతం 30 ప్రాంతాల్లో బీఎఎస్ఎన్ఎల్ ద్వారా ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయి. రోజుకు సగటున వంద జీబీల డేటా వినియోగమవుతోంది. నెక్లెస్‌రోడ్డు, చార్మినార్ తదితర ప్రాంతాల్లో ఈసేవలు వినియోగించుకుంటున్నవారు అధికసంఖ్యలో ఉన్నారు. నెక్లెస్ రోడ్లో సగటున 79,076 సెషన్స్ మేర ఉచిత వై-ఫై వినియోగమవుతుండగా, ట్యాంక్‌బండ్ వద్ద 61,745 సెషన్లమేర ఉచిత వై-ఫై వినియోగించుకుంటున్నారు. కనిష్టంగా బిర్లా ప్లానెటోరియం వద్ద 503 సెషన్స్, నిమ్స్ ఆస్పత్రి వద్ద 580 సెషన్స్ మేర వై-ఫై సేవలను వినియోగించుకుంటున్నారని సమాచారం. -
భారత్‌లో గూగుల్ జోరు..
♦ తొలి పర్యటనలో భారీ ప్రణాళికలను ప్రకటించిన సీఈఓ సుందర్ పిచాయ్ ♦ మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగాలకు హామీ... ♦ హైదరాబాద్‌లో మరో కొత్త క్యాంపస్... ♦ వచ్చే ఏడాది చివరికల్లా 100 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై ♦ చౌకగా ఇంటర్నెట్ అందించడమే లక్ష్యమని వెల్లడి వ్యక్తిగతంగా నాకు, కంపెనీ పరంగా గూగుల్ వృద్ధికి భారత్ ఎన్నో అవకాశాలను కల్పించింది. అందుకే ఈ దేశానికి అంతకుమించిన ప్రతిఫలాన్ని అందించేందుకు ప్రయత్నిస్తా. న్యూఢిల్లీ: ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారత్‌లో దూకుడు పెంచుతోంది. కొత్తగా మరో భారీ క్యాంపస్ ఏర్పాటుతో పాటు పెద్దయెత్తున ఉద్యోగాలను కూడా కల్పించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం మరిన్ని పెట్టుబడులను వెచ్చిస్తామని... దేశంలో కోట్లాది మందికి చౌక ఇంటర్నెట్ కల్పించడమే లక్ష్యమని పేర్కొంది. కంపెనీ సీఈఓగా భారత్‌కు చెందిన సుందర్ పిచాయ్ ఈ ఏడాది ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి స్వదేశంలోకి అధికారికంగా అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటన కోసం బుధవారం ఇక్కడికి వచ్చిన సందర్భంగా ‘గూగుల్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన కంపెనీ ప్రణాళికలను వెల్లడించారు. చెన్నైలో పుట్టిపెరిగిన పిచాయ్... తొలిరోజు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ; ఐటీ, టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లను కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలతో పాటు ఇతర ఉన్నతాధికారులతో కూడా ఆయన భేటీ కానున్నారు. హైదరాబాద్‌లో భారీ కొత్త క్యాంపస్... భారత్‌లో గూగుల్ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా హైదరాబాద్‌లో భారీ స్థాయిలో మరో కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తామని పిచాయ్ ప్రకటించారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, బిజినెస్ డెవలప్మెంట్ రంగాల్లో పెట్టుబడులు పెడతామని చెప్పారు. ప్రజలకు ఇంటర్నెట్ను మరింత చేరువ చేయడం కోసం సులువైన, వేగవంతమైన కొత్త ప్రొడక్టులను అభివృద్ధి చేయడంపై దృష్టిసారిస్తున్నట్లు కూడా గూగుల్ చీఫ్ పేర్కొన్నారు. అయితే, ఈ కొత్త క్యాంపస్ కోసం ఏమేరకు పెట్టుబడులు ఉంటాయన్న వివరాలను ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం భారత్‌లో గూగుల్‌కు 1,500 మంది ఉద్యోగులు ఉన్నారు. ‘భారత్‌కు ఉద్దేశించిన ప్రొడక్టుల రూపకల్పన కోసం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న కొత్త క్యాంపస్‌ను ఉపయోగించుకుంటాం. బెంగళూరు క్యాంపస్‌లో భారీగా కొత్త కొలువులు కూడా కల్పిస్తాం’ అని పిచాయ్ వివరించారు. రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై... వచ్చే ఏడాది(2016) చివరినాటికి దేశవ్యాప్తంగా 100 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించనున్నామని గూగుల్ సీఈఓ పేర్కొన్నారు. మొత్తం 400 స్టేషన్లలో ఉచిత వైఫై కోసం ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు కోసం గూగుల్, రైల్వే శాఖకు చెందిన టెలికం విభాగం రైల్‌టెల్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలి దశలో 100 స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని అందిస్తామని పిచాయ్ వెల్లడించారు. వచ్చే నెల(జనవరి)కల్లా ముంబై సెంట్రల్ స్టేషన్లో వైఫై అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కేంద్రాన్ని ప్రధాని మోదీ సందర్శించిన సందర్భంగా గూగుల్ ఈ ఉచిత వైఫై ప్రాజెక్టుపై హామీనిచ్చిన సంగతి తెలిసిందే. ‘దేశంలో ప్రతిఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధాన లక్ష్యంతో మేం ముందుకెళ్తున్నాం. అంతేకాదు ఇక్కడి ప్రజల అవసరాలకు అనుగుణంగా, వారి అభిప్రాయాలను ఇంటర్నెట్ ద్వారా అందరికీ తెలియజేసేవిధంగా తగిన ప్రొడక్టులను రూపొందించాలన్నదే మా ప్రయత్నం. రానున్న కాలంలో ఇంటర్నెట్ యూజర్లుగా మారనున్న 100 కోట్ల మంది భారతీయులే లక్ష్యంగా మా కొత్త ఉత్పత్తులు ఉంటాయి’ అని పిచాయ్ చెప్పారు. మరోపక్క, మహిళల కోసం ఉద్దేశించిన గ్రామీణ ఇంటర్నెట్ ప్రోగ్రామ్‌ను మూడేళ్లలో దేశ వ్యాప్తంగా మూడు లక్షల గ్రామాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఇది ప్రయోగాత్మకంగా(పైలట్) నడుస్తోందన్నారు. భారత్ కోసం మూడంచెల వ్యూహం... భారత్‌తో పాటు ఇతర వర్ధమాన దేశాల్లో ఇంటర్నెట్ వినియోగం పెంచేందుకు అనుసరించాల్సిన మూడంచెల వ్యూహాన్ని పిచాయ్ తన తొలి పర్యటనలో ప్రకటించారు. మెరుగైన కనెక్టివిటీ, అత్యంత నాణ్యమైన సాఫ్ట్వేర్లతో ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం ఇందులో మొదటిది. సరళంగా ఉండేవిధంగా భారతీయుల కోసం ప్రత్యేక ప్రొడక్టుల రూపకల్పన రెండోది. ఇక గూగుల్ గ్లోబల్ ప్లాట్ఫామ్లయిన ఆండ్రాయిడ్, క్రోమ్‌లను ఉపయోగించుకొని స్థానిక సమస్యలకు మెరుగైన పరిష్కారాలను అందించడం మూడో అంశంగా పిచాయ్ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రాచుర్యం పొందిన గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌తో పాటు క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించిన ఘనత పిచాయ్ సొంతం. ఆండ్రాయిడ్ ఓఎస్ యూజర్లకు సంబంధించి భారత్ త్వరలోనే అమెరికాను వెనక్కినెట్టేయనుందని కూడా ఈ సందర్భంగా పిచాయ్ చెప్పారు. భారత్‌లోనూ ‘ప్రాజెక్ట్ లూన్’.. కోట్లాది మంది ప్రజలకు ఇంటర్నెట్ను చౌకగా అందించేందుకు గూగుల్ తలపెట్టిన ‘ప్రాజెక్ట్ లూన్’ను భారత్‌లోనూ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ను చేరువ చేయాలంటే ప్రాజెక్ట్ లూన్ వంటివి చాలా అవసరమని పిచాయ్ వ్యాఖ్యానించారు. ‘ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలను నెలకొల్పాలన్నది గూగుల్ సంకల్పం. ఇందులో భాగమే ప్రాజెక్ట్ లూన్. దీని కోసం ఆకాశంలో చాలా ఎత్తుకు బెలూన్లను పంపి వాటి ద్వారా నెట్ వినియోగానికి అవసరమైన సిగ్నల్స్ ప్రసారమయ్యేలా చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా అనేక స్థానిక టెలికం కంపెనీలతో ఈ ప్రాజెక్టు విషయంలో పని చేస్తున్నాం. ఒకరకంగా వీటిని గాలిలో(20 కిలోమీటర్ల ఎత్తులో) తేలియాడే సెల్ టవర్లుగా పరిగణించొచ్చు’ అని గూగుల్ వైస్ ప్రెసిడెంట్(యాక్సెస్ స్ట్రాటజీ, ఎమర్జింగ్ మార్కెట్స్) మారియన్ క్రోక్ పేర్కొన్నారు. భారత్‌లో ఈ ప్రాజెక్టు అమలుకు వీలుకల్పిస్తారన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ టెక్నాలజీని న్యూజిలాండ్, అమెరికాలోని కాలిఫోర్నియా, బ్రెజిల్‌లలో గూగుల్ పరీక్షించింది. వైర్లెస్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ(ఎల్టీఈ లేదా 4జీ) ఆధారంగా పనిచేసే ఈ ఒక్కో బెలూన్‌తో భూమిపైన 40 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ కనెక్టివిటీని కల్పించవచ్చని గూగుల్ చెబుతోంది. ఇందుకోసం సెల్యులార్ స్పెక్ట్రం ఉన్న టెలికం ఆపరేటర్లతో గూగుల్ భాగస్వామ్యం కుదుర్చుకోవాలని భావిస్తోంది. అయితే, దీనిలో ఉపయోగించే స్పెక్ట్రం బ్యాండ్‌నే సెల్యులార్ ఆపరేటర్లు కూడా ఉపయోగిస్తున్న నేపథ్యంలో సాంకేతికంగా సమస్యలు ఉంటాయని తాజాగా టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ పార్లమెంటులో పేర్కొనడం గమనార్హం. వచ్చే ఏడాది మాకు అతిపెద్ద మార్కెట్ ఇదే.. గూగుల్‌కు రానున్న ఏడాదిలో అమెరికా కంటే భారత్ అతిపెద్ద మార్కెట్‌గా ఆవిర్భవించనుందని పిచాయ్ పేర్కొన్నారు. అందుకే ఇక్కడ మరింత దృష్టి కేంద్రీకరించాల్సిన తరుణం వచ్చిందని కూడా ఆయన చెప్పారు. వ్యాపారానికి సానుకూల పరిస్థితుల విషయంలో భారత్‌లో పురోగతి ఉందని... అయితే, ఇది మరింత పెరగాల్సిందేనని పిచాయ్ అభిప్రాయపడ్డారు. సమాచార స్వేచ్ఛ అనేది అత్యంత ప్రధానమైన అంశమని.. ఇంటర్నెట్తోనే ఇదంతా సాధ్యపడుతుందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. భారతీయులు గనుక యూట్యూబ్ వీడియోలను రూపొందిస్తే, వాటిని చూసేవారిలో 60 శాతం మంది ఇతర దేశాల్లోనే ఉంటారని.. సమాచార స్వేచ్ఛా ప్రవాహానికి ఇదే నిదర్శనమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. క్రోమ్బిట్తో మానిటర్ పీసీగా..! వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ‘ట్యాప్ టు ట్రాన్స్‌లేట్’ అనే కొత్త ఫీచర్‌ను గూగుల్ పరిచయం చేస్తుందని గూగుల్ సీఈఓ ప్రకటించారు. దీనిలో ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉపయోగించే అన్ని యాప్‌లలోనూ ఎలాంటి టెక్స్ట్‌నైనా అప్పటికప్పుడే ఇతర భాషల్లోకి తర్జుమా చేసి చూపించడం దీని ప్రత్యేకత. మరోపక్క, ‘క్రోమ్బిట్’ పేరుతో చిన్న పరికరాన్ని వచ్చే నెలలోనే భారత్‌లో ప్రవేశపెట్టనున్నామని గూగుల్ వైస్‌ప్రెసిడెంట్ జాసన్ టైటస్ చెప్పారు. దీనిద్వారా ఏ మానిటర్నైనా కంప్యూటర్‌గా మార్చేసుకోవడానికి వీలవుతుందని.. ముఖ్యంగా విద్యా రంగంలో కంపూటర్ల వాడకాన్ని పెంచేందుకు ఇది దోహదం చేస్తుందని ఆయన వివరించారు. ఇక భారత్ ప్రణాళికల్లో భాగంగా ఇప్పటికే 11 భారతీయ భాషల్లో టైపింగ్‌కు ఉపయోగపడే వర్చువల్ కీబోర్డును గూగుల్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వచ్చే మూడేళ్లలో 20 లక్షల మంది ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్లకు సాంకేతికపరమైన సహకారాన్ని అందించేందుకు కూడా గూగుల్ ముందుకొచ్చిన విషయాన్ని పిచాయ్ గుర్తుచేశారు.. ఇందుకోసం జాతీయ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో పాటు 30 యూనివర్సిటీలతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2018 కల్లా భారత్‌లో 50 కోట్ల మంది ఆన్లైన్ యూజర్లుగా మారనున్నారని.. గూగుల్ వైస్‌ప్రెసిడెంట్(ఇండియా, ఆగ్నేయాసియా) రాజన్ ఆనందన్ పేర్కొన్నారు. ఇప్పటికీ 30 శాతం మొబైల్ ఇంటర్నెట్ వాడకం 2జీ కనెక్షన్లతోనే జరుగుతోందని కూడా ఆయన తెలిపారు. ఇందుకోసం తక్కువ బ్యాండ్‌విడ్త్‌తో పనిచేసే ఉత్పత్తులను రూపొందించడంపై దృష్టి పెట్టినట్లు ఆనందన్ వెల్లడించారు. -
హైదరాబాద్‌లో ఉచిత వైఫై సేవలు ప్రారంభం
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఉచిత వైఫై సేవలు ప్రారంభమయ్యాయి. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో 10 కిలో మీటర్ల పరిధిలో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. 30 నిమిషాల పాటు ఉచితంగా సేవలను వినియోగించుకోవచ్చు. గురువారం సాయంత్రం తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఈ సేవలను ప్రారంభించారు. ఇది ఫైలట్ పథకమని, నగర వ్యాప్తంగా ఉచిత వైఫై సేవలు అందిస్తామని కేటీఆర్ చెప్పారు. -
ఇదేంటి ప్రభూ?
ఆశలు ఆవిరయ్యూయి. కేంద్ర రైల్వేబడ్జెట్‌లో ఎప్పటిలాగే జిల్లాకు అన్యాయం జరిగింది. ప్రభుత్వం మారినా అదే మొండిచేయి ఎదురైంది. ఎంతగా వేడుకున్నా రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు కనికరించలేదు. భద్రాచలం- కొవ్వూరు లైన్‌కు ఎప్పటిలాగే ఎర్రజెండా చూపారు. గతంలో వచ్చి వెనక్కి మళ్లిన రూ.25 కోట్ల భూసేకరణ నిధులతోనే సరిపెట్టారు. పాండురంగాపురం- సారపాక ప్రస్థావనే లేదు. కొత్తగూడెం - సత్తుపల్లి లైన్ ఊసే లేదు. ఏ గ్రేడ్‌స్థాయిలో ఉన్న ఖమ్మం రైల్వేస్టేషన్‌కు ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రావడం.. కాజీపేట- విజయవాడ మూడోలైన్ ముచ్చట తీర్చటం మాత్రమే ఊరట. కేంద్రంపై ఒత్తిడి తెస్తా.. రైల్వే బడ్జెట్లో జిల్లాకు జరిగిన అన్యాయంపై ప్రధానమంత్రిని కలుస్తా. ప్రధాన ప్రాజెక్టు అయిన భద్రాచలం - కొవ్వూరు లైన్‌కు నిధులు కేటాయించడంలో కేంద్రం వివక్ష చూపడం తగదు. జిల్లా ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఈ లైన్ నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారు. ఇది జరిగితే గిరిజన జీవితాల్లో మార్పులు వస్తాయి. కానీ కేంద్రం పట్టించుకోవడం లేదు. కేవలం సర్వేలు, భూ సేకరణతో కేంద్రం ఈలైన్ విషయంలో కాలయాపన చేస్తోంది. మణుగూరు - రామగుండం, కొత్తగూడెం- సత్తుపల్లి లైన్‌కు భారీగా నిధులు కేటాయించాలని కోరుతూ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు ప్రధానమంత్రిని కలిసి విన్నవిస్తా. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ లేదు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం నిధులు కేటాయించాలి. - పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు - నిరాశాజనకంగా కేంద్ర రైల్వేబడ్జెట్ - జిల్లాకు తీరని అన్యాయం - కేవలం భద్రాచలం లైన్‌కు రూ.25 కోట్లు - ఖమ్మం స్టేషన్‌కు ఉచిత వైఫై సేవలు - వీటితోనే సరిపుచ్చిన కేంద్ర ప్రభుత్వం సాక్షి, ఖమ్మం: రైల్వే బడ్జెట్లో జిల్లా ప్రజల ఆశలపై ఎన్డీఏ ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా మొండిచేయి చూపింది. దక్షిణ మధ్య రైల్వేకు గతంలో కన్నా 24 శాతం అధికంగా నిధులు కేటాయించినా.. జిల్లా విషయానికొస్తే మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కేవలం భద్రాచలం - కొవ్వూరు రైల్వేలైన్‌కు రూ.25 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ అనగానే జిల్లా ప్రజలు ఆశించేది.. భద్రాచలం-కొవ్వూరు లైన్‌కు నిధులు కేటాయించాలని. కానీ, గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా ఈ లైన్ విషయంలో రిక్తహస్తం చూపించింది. నిధులు లేక ఈ లైన్ నిర్మాణ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. కనీసం భూసేకరణకు కూడా నిధులు కేటారుుంచకపోవటం గమనార్హం. గత బడ్జెట్లో రూ.21 కోట్లు భూసేకరణకు కేటాయిస్తే ఇవి ఇప్పటి వరకు ఖర్చు చేయకపోవడంతో మురిగిపోయాయి. ఇప్పుడు మళ్లీ భూ సేకరణకు కేవలం రూ.25 కోట్లు కేటాయించి కేంద్రంపై జిల్లా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసింది. జిల్లా ప్రజల ఆందోళనను కేంద్రం పెడచెవిన పెట్టింది. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని బడ్జెట్లో గొప్పలు చెప్పిన ప్రభుత్వం కనీసం పెండింగ్ లో ఉన్న లైన్ల విషయంలోనూ కనికరం చూపలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జిల్లాకే తీవ్ర అన్యాయం జరిగింది. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం లైన్‌కు కేంద్రం తప్పకుండా భారీ ఎత్తున నిధులు కేటాయిస్తుందని ఈ ప్రాంతవాసులు ఆశించారు. కానీ ఈ లైన్‌పై చిన్నచూపు చూసిన కేంద్రం తీరుపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇక మణుగూరు - రామగుండం లైన్‌ను సర్వేకే పరిమితం చేసింది. పాండురంగాపురం- సారపాక, కొత్తగూడెం - సత్తుపల్లి లైన్ల ఊసే లేదు. జిల్లా నుంచి సింగరేణి గనుల ద్వారా కేంద్ర రైల్వే శాఖకు భారీగా ఆదాయం వస్తున్నా కనీసం బడ్జెట్లో ఈలైన్లను ప్రస్తావించకపోడం శోచనీయం. దేశ వ్యాప్తంగా ఏ గ్రేడ్ స్టేషన్లకు బడ్జెట్లో ఉచిత వైఫై సేవలను ప్రకటించింది. దీనిలో భాగంగా జిల్లాలో ఏ గ్రేడ్ స్థాయిలో ఉన్న ఖమ్మం స్టేషన్లో మాత్ర మే వైఫైసేవలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలోనూ మూడు లైన్లు కాజీపేట - విజయవాడ మధ్య మూడో లైన్‌కు బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాజీపేట నుంచి ఖమ్మం మీదుగా విజయవాడకు 218 కిలో మీటర్ల దూరం. ప్రస్తుతం ఉన్న రెండు లైన్లతో ఈ మార్గంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. క్రాసింగ్‌లతో గంటల కొద్దీ ప్రయాణం ఆలస్యమవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మూడో లైన్ నిర్మాణానికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. మూడో లైన్ నిర్మాణం జిల్లాలోని ప్రయాణికులకు కొంతమేరకు ఊరట కలిగించనుంది. సర్వేలకు అత్తెసరు నిధులు కొత్తగూడెం నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా కిరణ్‌డోల్ (బైలడిల్లా) వరకు 180 కిలోమీటర్ల మేరకు కొత్తలైన్ సర్వేకు ఈ బడ్జెట్లో రూ.24.94 లక్షలు కేటాయించారు. పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ లైన్ సర్వేకు నిధులు కేటాయించింది. కిరణ్‌డోల్, బైలాడిల్లాలోని ఇనుప ఖనిజం, బొగ్గు కొత్తగూడెం మీదుగా రాష్ట్రానికి.. ఇక్కడి నుంచి అక్కడి ఈ ఖనిజాలను తరలించే వీలుగా ఈ లైన్ నిర్మాణానికి కేంద్రం సంకల్పించింది. మణుగూరు నుంచి రామగుండం లైన్ ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. గత బడ్జెట్లో ఈ లైన్ సర్వే కోసం రూ.3 కోట్లను కేంద్రం కేటాయించింది. ప్రస్తుతం ఈలైన్ 200 కి.మీ సర్వే కోసం రూ.50 లక్షలు మంజూరు చేసింది.