-పయాణికులకు సౌకర్యాల కల్పనే ధ్యేయం
-దక్షిణ మధ్య రైల్వే చీఫ్ క్లైమ్స్ ఆఫీసర్ కేపీ రావు
కాజీపేట రూరల్(వరంగల్ జిల్లా): గోదావరి పుష్కరాలకు ప్రవేశపెట్టిన ప్రత్యేక రైళ్ల మాదిరిగానే తెలంగాణలో జరిగే అతిపెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క-సారాలమ్మ జాతరకు ప్రత్యేక రైళ్లు నడిపే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ క్లైమ్స్ ఆఫీసర్(సీసీఓ) కేపీ రావు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా కాజీపేట జంక్షన్‌లోని రైల్వేస్టేషన్, ప్లాట్‌ఫాంలను శుక్రవారం తనిఖీ చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దక్షిణ మధ్య రైల్వేకు రోజుకు రూ.30 కోట్ల ఆదాయం వస్తోందని, వచ్చిన ఆదాయంతో ప్రయాణికుల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
లో లెవెల్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంలను హైలెవెల్ ప్లాట్‌ఫాంలుగా అభివృద్ధి చేసి ఆయా రైల్వేస్టేషన్‌ల్లో ప్రయాణికులకు సరిపడా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రైల్వే సేవలను మరింత ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు రిజర్వేషన్ టికెట్ కౌంటర్ కార్యాలయాలను ముఖ్య కేంద్రాలలో, పోస్టాఫీస్‌లలో ఏర్పాటు చే స్తున్నట్లు తెలిపారు. కాజీపేట టౌన్ రైల్వేస్టేషన్‌లో ఢిల్లీ-చెన్నై మధ్య నడిచే రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్ ఏర్పాటుకు అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తె లిపారు. ప్లాట్‌ఫాంపై ప్రయాణికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కాజీపేటలోని నెలకొన్న ప్రయాణికుల సమస్యలను, చేయూల్సిన అభివృద్ధి పనుల వివరాలను స్థానిక అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. సీసీఓ వెంట కాజీపేట స్టేషన్ మేనేజర్ ఆంజనేయులు, చీఫ్ బుకింగ్ సూపర్‌వైజర్ ఐఎస్‌ఆర్.మూర్తి తదితరులు ఉన్నారు.
మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లకు కృషి
Published Sat, Jan 30 2016 4:26 AM | Last Updated on Tue, Oct 9 2018 5:58 PM
Advertisement