సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎంపీ కవిత
సాక్షి ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫిబ్రవరి 18న మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లిం చుకుంటారని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో జాతరపై సందేహాలున్నాయని అయి తే మహాజాతర కచ్చితంగా జరుగుతుందని స్పష్టంచేశారు. తెలంగాణ వచ్చాకే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, అభివృద్ధి, వసతులు పెరిగి నేడు దక్షిణ భారత కుంభమేళాగా సమక్క–సారలమ్మ జాతర మారిందని పేర్కొన్నారు.
జాతర కోసం వచ్చే భక్తుల సౌకర్యం కోసం శనివారం ములుగు జిల్లా మేడారంలో రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహించారు. రూ. 75 కోట్లతో మేడారంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై శాఖలవారీగా చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒమిక్రాన్, క రోనా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆరోగ్యశాఖకు రూ.కోటి కేటాయించామని చె ప్పారు. 2020 జాతరలో 4 రోజుల్లో కోటి 2 లక్షల మంది భక్తులు వచ్చారని, ప్రస్తుతం ఒమిక్రాన్ నేపథ్యంలో భక్తులు ముందునుంచే లక్షల్లో వస్తున్నారని తెలిపారు.
సీఎస్, డీజీపీ దిశానిర్దేశం
సమీక్షలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. భక్తుల తాకిడికి తగినట్లు 320 కేంద్రాల్లో 6,400 టాయిలెట్లు, వెయ్యి ఎకరాల్లో 30 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈసారి 10 వేల మంది పోలీస్ సిబ్బందిని విధుల్లో ఉం చుతున్నామని తెలిపారు.
వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బం ది లేకుండా చూస్తామన్నారు. సమావేశంలో ఎంపీలు దయాకర్, మాలోతు కవిత పాల్గొన్నారు. కాగా, సమీక్షకు ముందు ఇంద్రకరణ్‌రెడ్డి, సోమేశ్‌కుమార్, మహేందర్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం సమ్మక్క సారలమ్మ దేవతలకు తులాభారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment