వరంగల్ జిల్లా మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు...
తాడ్వాయి: వరంగల్ జిల్లా మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సమ్మక్క-సారలమ్మ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తెలిపారు. ప్రతీ రెండోళ్లకోసారి ప్రధాన జాతర జరుగుతుండగా.. మధ్యలో వచ్చే ఏడాది మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.