
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి పరిరక్షకులైన కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివేళలా అండగా ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి సమర్పణలో ప్రముఖ ఫిల్మ్ మేకర్ బాలాజీ దూసరి రూపొందించిన ‘మేడారం సమ్మక్క–సారక్క జాతర’ డాక్యుమెంటరీని కవిత శనివారం తన నివాసంలో విడుదల చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టే దృశ్యకావ్యంలా ఈ డాక్యుమెంటరీని రూపొందించారని, బాలాజీని కవిత అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment