jagruthi
-
మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా రేవంత్ సర్కార్: ఎమ్మెల్సీ కవిత ఫైర్
సాక్షి, హైదరాబాద్: మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం మారుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ, జీవో-3 తీసుకువచ్చి ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కాగా, ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయం, జీవో-3 రద్దు డిమాండ్ చేయాలని ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో భారత్ జాగృతి శ్రేణులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రాజ్యాంగం వచ్చిన తర్వాత మహిళల కోసం అనేక చట్టాలు చేసుకుంటూపోతున్నాం. మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్నాయి. తెలంగాణ వచ్చాక మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు పోలీస్ శాఖలో కల్పిస్తున్నాం. ప్రతీ యూనివర్సిటీలో మహిళల సంఖ్య పెరిగింది. పోటీ పరీక్షల్లో మహిళలే టాప్ వస్తున్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లు కావాలనే కేసీఆర్ కోరారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ, జీవో-3 తీసుకొచ్చి ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం జరిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రభుత్వం తెచ్చిన జీవో-3 వల్ల మహిళలకు కేవలం 12 శాతం మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా రేవంత్ ప్రభుత్వం మారుతోంది. ప్రజలను కలవడంలేదని కేసీఆర్‌ను విమర్శించిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆయనెందుకు ప్రజలకు కనపడటం లేదు. ఆయన ఢిల్లీ నేతలనే మాత్రమే కలుస్తారు. తెలంగాణ ప్రజలను రేవంత్ కలవడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
మేడారం జాతరపై తెలంగాణ జాగృతి డాక్యుమెంటరీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి పరిరక్షకులైన కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివేళలా అండగా ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి సమర్పణలో ప్రముఖ ఫిల్మ్ మేకర్ బాలాజీ దూసరి రూపొందించిన ‘మేడారం సమ్మక్క–సారక్క జాతర’ డాక్యుమెంటరీని కవిత శనివారం తన నివాసంలో విడుదల చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టే దృశ్యకావ్యంలా ఈ డాక్యుమెంటరీని రూపొందించారని, బాలాజీని కవిత అభినందించారు. -
నేటినుంచి ‘ముస్లిం పర్సనల్‌లా జాగృతి ఉద్యమం’
రాజమహేంద్రవరం కల్చరల్: రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం పర్సనల్ లా జాగృతి ఉద్యమం ఆదివారం నుంచి మే 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జమాతె ఇస్లామీ హింద్ నాయకుడు మహ్మద్ రఫీద్ వెల్లడించారు. ఇటీవల తరచు ముస్లిం పర్సనల్ లా, తలాక్ వంటి విషయాల్లో రాద్ధాంతాలు చేస్తున్నారని శనివారం ఆయన ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ప్రభుత్వం ముస్లిం మహిళల విషయంలో మొసలికన్నీరు కారుస్తోందని ఆయన విమర్శించారు. ముస్లిం పర్సనల్‌లాపై అవగాహన కలిగించేందుకు ఈ జాగృతి ఉద్యమం నిర్వహిస్తున్నామన్నారు. మేధావులను, మానతావాదులను కలసి పర్సనల్‌లాపై అవగాహన కలిగిస్తామన్నారు. బహిరంగసభలు, కరపత్రాలు, ప్రసారమాధ్యమాల ద్వారా ముస్లిం పర్సనల్‌లాపై అవగాహన కలిగిస్తామన్నారు. ముస్లింలు వివాహం, విడాకులు, ఆస్తిపంపకాలు, మనోవర్తి తదితర అంశాలకు ప్రాతిపదిక బ్రిటిష్ ప్రభుత్వం 1937లో చేసిన షరీయత్ అప్లికేషన్ చట్టమని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా రాజ్యాంగ నిర్మాతలు ఈ చట్టం విషయంలో జోక్యం చేసుకోలేదని ఆయన వివరించారు. ముస్లిం పర్సనల్ లాలోని అంశాలకు మూలం మానవనిర్మిత చట్టాలు కావని, సృష్టికర్త ఉపదేశం ప్రకారమే రూపొందించనవని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 44వ అధికరణంలో పేర్కొన్న ఉమ్మడిపౌరసత్వం గురించి పెద్దలు పదేపదే మాట్లాడుతున్నారు, కానీ రాజ్యాంగం 25,26 అధికరణాలలో ఇచ్చిన సమానత్వం గురించి, మత స్వేచ్ఛను గురించి మాట్లాడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ తలాక్ అంశంతో జరిగిన విడాకులు మొత్తం విడాకులలో 0.05 శాతం మాత్రమేనని ఆయన తెలిపారు. ముస్లిం పర్సనల్‌లాపై అవగాహన కలిగించేందుకు మే 6వ తేదీన జిల్లా వ్యాప్తంగా బహిరంగసభలు నిర్వహిస్తామన్నారు. ఆ సభల్లో జమాతె ఇస్లామీ హింద్ జాతీయ నాయకులు పాల్గొంటారన్నారు. పర్సనల్‌లాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను, ముస్లిం పర్సనల్ లాపై సంస్థ ప్రచురించిన పుస్తకాన్ని ముస్లిం ప్రముఖులు ఆవిష్కరించారు. ముస్లిం పర్సనల్‌లా విషయంలో ఇతరుల జోక్యాన్ని అంగీకరించబోమని విలేకరుల సమావేశంలో ముస్లిం మహిళలు తెలిపారు. జమాతె ఇస్లామీ హింద్ నగర అధ్యక్షుడు ముస్తాఫా షరీఫ్, ఉద్యమ కన్వీనర్ అన్సార్ అహమ్మద్, ది యునైటెడ్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ఖాదర్‌ఖాన్, వివిధ మసీదుల అధ్యక్షులు, ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు. -
ప్రతిమండల కేంద్రంలో బతుకమ్మ ఉత్సవాలు
నల్లగొండ రూరల్ : తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తామని ఆ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్ అన్నారు. ఆదివారం స్థానిక లయన్స్‌క్లబ్ భవన్లో ఆ సంస్థ జిల్లా కన్వీనర్ బోనరిగి దేవేందర్ అధ్యక్షతన బతుకమ్మ ఉత్సవాలు, జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాలను జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో కాకుండా ప్రతి మండలంలో 9రోజుల పాటు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. నియోజకవర్గాల్లో నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా ఉత్సవాలు జరుగుతాయన్నారు. అనంతరం జాగృతి ప్రథమ వార్షికోత్సవం చేసినందుకు ప్లీనరీ కమిటీకి, కృష్ణా పుష్కరాలలో పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జవహర్లాల్, రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్ శ్రీను, కె.ఎల్.ఎన్.రావు, సుజాత్రావు, చందూయా దవ్, ఉపేందర్, రామన్, వేణుగౌడ్, ప్రవీణ్‌కుమార్, వెంకట్, శ్రీనివాసాచారి, జయశ్రీ, పవన్, శంకర్, మల్లయ్య, ఉదయ్, గోవర్ధన్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు లక్ష్యసాధనకు కృషిచేయాలి
రాజాపేట : విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరుతేవాలని ఎన్ఆర్ఐ జాగృతి కోకన్వీనర్ గౌలీకర్ నర్సింగరాజ్, సర్పంచ్ గుంటి కృష్ణ అన్నారు. మంగళవారం మండలంలోని కాల్వపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గౌలీకర్ నర్సింగరాజ్ దుస్తులు, నోట్‌పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు పాఠశాలను దత్తత తీసుకుని విద్యార్థులకు అవసరమైయ్యే దుస్తులు, నోట్‌పుస్తకాలు, బోర్డులు, బల్లాలు, నీటి వంటి మౌలిక వసతులు కలిస్తామని హామీ ఇచ్చారు. ఎన్ఆర్ఐ గౌలీకర్ నర్సింగరాజ్ దాతృత్వాన్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్యారాణి, ఉపాధ్యాయులు స్వప్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ జాగృతి జిల్లా శాఖకు అవార్డు
హన్మకొండ : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గోదావరి పుష్కరాలు, మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలోను వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడంతో పాటు వలంటీర్లుగా సేవలు అందించారు. సేవలను గుర్తించిన తెలంగాణ జాగృతి ఆధినాయకత్వం వరంగల్ జిల్లా శాఖకు బెస్ట్ జిల్లా శాఖగా ఎంపిక చేసి ఆవార్డు అందించింది. వరంగల్ జిల్లా శాఖ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు రాష్ట్రంలోని ఇతర జిల్లాల కంటే ముందు వరుసలో ఉంది. నల్లగొండలో జరిగిన 10 వార్షికోత్సవ సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జిల్లా కన్వీనర్ కోరబోయిన విజయ్‌కుమార్ అవార్డు అందుకున్నారు. దీంతో పాటు సలాం పోలీసు లఘుచిత్రా దర్శకుడు వంశీకి ప్రోత్సాహక అవార్డుకు వచ్చింది. జిల్లాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ ఇస్తున్న రాణి,లతకు ప్రోత్సాహక అవార్డు లభించింది. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాకు ఉత్తమ అవార్డు రావడానికి కృషి చేసిన జాగృతి అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. -
‘జాగృతి’ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
నల్లగొండ తెలంగాణ జాగృతి జనంలో సుస్థిరస్థానం సంపాదించాలంటే జాగృతి చేపడుతున్న అనేక సామాజిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అభిప్రాయ పడ్డారు. తెలంగాణ జాగృతి స్థాపించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా తొలిసారిగా శుక్రవారం నల్లగొండలో వార్షికోత్సవ ప్రతినిధుల సభ నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సభ తొలిరోజున ఎంపీ కవిత కార్యకర్తలనుద్ధేశించి ప్రారంభోపాన్యాసం చేశారు. ఈ సభకు టీఎన్జీవో ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రొఫెసర్లు సిద్ధారెడ్డి, శ్రీధర్, వేణు సంకోజు తదితరులు హజరయ్యారు. మొదటగా పట్టణంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు సభా వేదిక లక్ష్మీగార్డెన్స్‌కు చేరుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నిర్వహించిన ప్రతిని ధుల సభకు రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి జాగృతి కన్వీనర్లు, రాష్ట్ర బాధ్యులు పాల్గొన్నా రు. సభ ప్రారంభానికి ముందు కవిత జాగృతి జెండాను ఆవిష్కరించారు. అనంతరం వేది క మీద ఆచార్య జయశంకర్‌సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దిశా నిర్దేశం పదేళ్ల ప్రస్థానంలో సాధించిన విజయాలను కార్యకర్తలకు వివరించిన కవిత...భవిష్యత్తులో ఎంచుకోబోయే మార్గాన్ని గురించి దిశా నిర్దేశం చేశారు. 2008లో 18 మంది సభ్యులతో మొదలైన జాగృతి ప్రస్థానం అంచలంచెలుగా ఎదిగి పది శాఖలుగా విస్తరించిందన్నారు. జాగృతి ఆధ్వర్యంలో తొలిసారిగా బతుకమ్మ పండుగ చేయాలనుకున్నప్పుడు గడప గడప కు వెళ్లి బతుకమ్మ ఆడాలని అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ స్థితి నుంచి కాల క్రమేణ ఇప్పుడు జాగృతి బతుకమ్మ నిర్వహిస్తుందంటే వందల సంఖ్యలో మహిళలు కలిసి వస్తుండటం సంతృప్తి కలిగించదన్నారు. తెలంగాణలో కనుమరుగైన యాసను కాపాడుకో వడంలో, చరిత్రను ముందుకు తరాలకు అందించేందుకు, సంప్రదాయాలను ప్రజల్లోకి తీ సుకెళ్లేందుకు తెలంగాణ జాగృతి విశేష కృషి చేసిందన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పి ంచడం, మహిళలకు అండగా ఉండేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నట్లు చెప్పా రు. వార్షికోత్సవ సభ వేదిక మీదనే భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామన్నారు. జాగృతికి అండగా ఉంటాం రాష్ట్రాభివృద్ధిలో జాగృతి కీలక పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సభకు హా జరైన ప్రముఖులు అన్నారు. రాష్ట్రంలో జాగృతి చేపట్టే ప్రతి కార్యక్రమానికి అండగా ఉంటామన్నారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ...రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జాగృతి పనిచేయాలని సూచించారు. ప్రొఫెసర్ సిధారెడ్డి మాట్లాడుతూ...నిరుద్యోగుల కోసం జాగృతి ప్రత్యేకంగా స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తే బాగుటుందని సూచించారు. వేణు సంకోజు మాట్లాడుతూ...మహిళల సాధికారితను చాటిచె ప్పడంలో జాగృతి కృషి చేసిందన్నారు. ఈ సమావేశానికి విక్రాంత్ రెడ్డి, బోనగిరి దేవేందర్, రాజీవ్ సాగర్, నవీనాచారి, వరలక్ష్మీ, డాక్టర్ ప్రభావతి, హైదర్, వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఈవెంట్
ఈవెంట్ సత్య శ్రీనివాస్ ఎగ్జిబిషన్ సత్య శ్రీనివాస్ mothers and grannies పొర్ట్రెయిట్స్ ఎగ్జిబిషన్ 20 memories ఆగస్టు 5న సాయంత్రం 6:30కు ప్రారంభం కానుంది. ప్రారంభకులు: అల్లం నారాయణ. వేదిక: గెథె-జెంత్రమ్, జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నం.3, బంజారాహిల్స్, హైదరాబాద్. ఈ ప్రదర్శన ఆగస్టు 13 వరకు ఉంటుంది. మహాశ్వేతాదేవి సంతాప సభలు పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో, మహాశ్వేతాదేవి స్మరణలో ఒక సాహిత్య సభ ఆగస్టు 7న మధ్యాహ్నం 2 గంటలకు టీఎన్జీవో భవనం, మహబూబ్‌నగర్‌లో జరగనుంది. మహాశ్వేతాదేవి జీవితం- సాహిత్యాన్ని గూడూరు మనోజ వివరిస్తారు. మహాశ్వేత రచనలు బషాయిటుడు(ఉదయమిత్ర), ఒక తల్లి(ఎం.డి.ఇక్బాల్‌పాషా), ఎవరిదీ అడవి(కె.సి.వెంకటేశ్వర్లు), కథలు(పరిమళ్), రాకాసికోర(ఎం.రాఘవాచారి) పరిచయాలు కూడా ఉంటాయి. ‘జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, సామాన్యుల, గిరిజనుల జీవన స్థితిగతులను చైతన్యస్ఫోరకంగా చిత్రించిన’ మహాశ్వేతాదేవి సంతాప సభ మంజీరా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆగస్ట్ 9న సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి మినీహాల్లో జరగనుందని సంఘం ప్రధాన కార్యదర్శి తైదల అంజయ్య తెలియజేస్తున్నారు. ఇందులో కాత్యాయనీ విద్మహే, నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్ పాల్గొంటారు. దేశభక్తి గీతాల, కవితల పోటీ దేశభక్తుల సంక్షేమ సంఘం, మంచిర్యాల వారు దేశభక్తి గీతాల, కవితల పోటీ నిర్వహిస్తున్నారు. పది వేల రూపాయల నగదు బహుమతులిచ్చే ఈ పోటీకి స్వాతంత్య్రోద్యమం, స్వాతంత్య్ర దినోత్సవం, సైనికుల త్యాగాలు, ఉగ్రవాద నిర్మూలన, శాంతి స్థాపన, జాతీయ సమైక్యత, మువ్వన్నెల జెండా అనే అంశాలపై రాయవలసివుంటుంది. ‘డిక్లరేషన్’ సహా రచనలు చేరవలసిన ఆఖరి తేదీ: ఆగస్ట్ 15. చిరునామా: ఎస్.నరేందర్‌రెడ్డి, 19-457/1, రాంనగర్, మంచిర్యాల-504208. ఫోన్: 9440383277. మెయిల్: potriots welfare society@ gmail.com 2016 గడియారం అవార్డుకై... రచన సాహిత్య వేదిక, కడప వారు ‘మహాకవి గడియారం వేంకట శేషశాస్త్రి అవార్డు’ కోసం 2012 నుండి ప్రథమ ముద్రణ పొందిన పద్యకావ్యాలను ఆహ్వానిస్తున్నారు. కావ్యం ఒకే కవి కృతమై ఉండాలి. ఖండకావ్యాలు పంపవచ్చు. ఎంపికైన కావ్యానికి ఐదు వేల నగదు బహుమానం ఉంటుంది. కవులు తమ కావ్యపు నాలుగు ప్రతుల్ని ‘ఎన్.సి.రామసుబ్బారెడ్డి, కార్యదర్శి, 7/201-3ఇ, జయనగర్ కాలనీ, కడప-516002’ అన్న చిరునామాకు ఆగస్టు 20లోగా పంపాలి. జాగృతి కథల పోటీకి ఆహ్వానం జాగృతి వారపత్రిక వారు వాకాటి పాండురంగారావు స్మారక కథల పోటీ నిర్వహిస్తున్నారు. భారతీయ సమాజ జీవనంతో కూడిన సమకాలీనం, చారిత్రకం, సామాజిక ఇతివృత్తంతో 1500 పదాలకు మించకుండా కథలు పంపాలని కథకులను కోరుతున్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా 15 వేలు, 10 వేలు, 6 వేలు. జాగృతి వారపత్రిక, కాచిగూడ, హైదరాబాద్-27కు పోస్టు చేయొచ్చు. చివరి తేది: ఆగస్టు 30. మరిన్ని వివరాలకు: 9959997204 -
'టీఆర్ఎస్ది చౌకబారు వ్యవహారంలా ఉంది'