విద్యార్థులు లక్ష్యసాధనకు కృషిచేయాలి | Students should strive to achieve targets | Sakshi
Sakshi News home page

విద్యార్థులు లక్ష్యసాధనకు కృషిచేయాలి

Published Tue, Aug 23 2016 8:42 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

విద్యార్థులు లక్ష్యసాధనకు కృషిచేయాలి

విద్యార్థులు లక్ష్యసాధనకు కృషిచేయాలి

రాజాపేట : విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరుతేవాలని ఎన్‌ఆర్‌ఐ జాగృతి కోకన్వీనర్‌ గౌలీకర్‌ నర్సింగరాజ్, సర్పంచ్‌ గుంటి కృష్ణ అన్నారు. మంగళవారం మండలంలోని కాల్వపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గౌలీకర్‌ నర్సింగరాజ్‌ దుస్తులు, నోట్‌పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు పాఠశాలను దత్తత తీసుకుని విద్యార్థులకు అవసరమైయ్యే దుస్తులు, నోట్‌పుస్తకాలు, బోర్డులు, బల్లాలు, నీటి వంటి మౌలిక వసతులు కలిస్తామని హామీ ఇచ్చారు. ఎన్‌ఆర్‌ఐ గౌలీకర్‌ నర్సింగరాజ్‌ దాతృత్వాన్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్యారాణి, ఉపాధ్యాయులు స్వప్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement