ప్రతిమండల కేంద్రంలో బతుకమ్మ ఉత్సవాలు
ప్రతిమండల కేంద్రంలో బతుకమ్మ ఉత్సవాలు
Published Sun, Sep 4 2016 9:32 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ రూరల్ : తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తామని ఆ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్ అన్నారు. ఆదివారం స్థానిక లయన్స్‌క్లబ్ భవన్‌లో ఆ సంస్థ జిల్లా కన్వీనర్ బోనరిగి దేవేందర్ అధ్యక్షతన బతుకమ్మ ఉత్సవాలు, జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాలను జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో కాకుండా ప్రతి మండలంలో 9రోజుల పాటు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. నియోజకవర్గాల్లో నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా ఉత్సవాలు జరుగుతాయన్నారు. అనంతరం జాగృతి ప్రథమ వార్షికోత్సవం చేసినందుకు ప్లీనరీ కమిటీకి, కృష్ణా పుష్కరాలలో పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జవహర్‌లాల్, రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్ శ్రీను, కె.ఎల్.ఎన్.రావు, సుజాత్‌రావు, చందూయా దవ్, ఉపేందర్, రామన్, వేణుగౌడ్, ప్రవీణ్‌కుమార్, వెంకట్, శ్రీనివాసాచారి, జయశ్రీ, పవన్, శంకర్, మల్లయ్య, ఉదయ్, గోవర్ధన్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement