‘జాగృతి’ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
‘జాగృతి’ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
Published Fri, Aug 5 2016 11:03 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ
తెలంగాణ జాగృతి జనంలో సుస్థిరస్థానం సంపాదించాలంటే జాగృతి చేపడుతున్న అనేక సామాజిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అభిప్రాయ పడ్డారు. తెలంగాణ జాగృతి స్థాపించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా తొలిసారిగా శుక్రవారం నల్లగొండలో వార్షికోత్సవ ప్రతినిధుల సభ నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సభ తొలిరోజున ఎంపీ కవిత కార్యకర్తలనుద్ధేశించి ప్రారంభోపాన్యాసం చేశారు. ఈ సభకు టీఎన్‌జీవో ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రొఫెసర్లు సిద్ధారెడ్డి, శ్రీధర్, వేణు సంకోజు తదితరులు హజరయ్యారు. మొదటగా పట్టణంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు సభా వేదిక లక్ష్మీగార్డెన్స్‌కు చేరుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నిర్వహించిన ప్రతిని ధుల సభకు రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి జాగృతి కన్వీనర్లు, రాష్ట్ర బాధ్యులు పాల్గొన్నా రు. సభ ప్రారంభానికి ముందు కవిత జాగృతి జెండాను ఆవిష్కరించారు. అనంతరం వేది క మీద ఆచార్య జయశంకర్‌సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
దిశా నిర్దేశం
పదేళ్ల ప్రస్థానంలో సాధించిన విజయాలను కార్యకర్తలకు వివరించిన కవిత...భవిష్యత్తులో ఎంచుకోబోయే మార్గాన్ని గురించి దిశా నిర్దేశం చేశారు. 2008లో 18 మంది సభ్యులతో మొదలైన జాగృతి ప్రస్థానం అంచలంచెలుగా ఎదిగి పది శాఖలుగా విస్తరించిందన్నారు. జాగృతి ఆధ్వర్యంలో తొలిసారిగా బతుకమ్మ పండుగ చేయాలనుకున్నప్పుడు గడప గడప కు వెళ్లి బతుకమ్మ ఆడాలని అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ స్థితి నుంచి కాల క్రమేణ ఇప్పుడు జాగృతి బతుకమ్మ నిర్వహిస్తుందంటే వందల సంఖ్యలో మహిళలు కలిసి వస్తుండటం సంతృప్తి కలిగించదన్నారు. తెలంగాణలో కనుమరుగైన యాసను కాపాడుకో వడంలో, చరిత్రను ముందుకు తరాలకు అందించేందుకు, సంప్రదాయాలను ప్రజల్లోకి తీ సుకెళ్లేందుకు తెలంగాణ జాగృతి విశేష కృషి చేసిందన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పి ంచడం, మహిళలకు అండగా ఉండేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నట్లు చెప్పా రు. వార్షికోత్సవ సభ వేదిక మీదనే భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామన్నారు.
జాగృతికి అండగా ఉంటాం
రాష్ట్రాభివృద్ధిలో జాగృతి కీలక పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సభకు హా జరైన ప్రముఖులు అన్నారు. రాష్ట్రంలో జాగృతి చేపట్టే ప్రతి కార్యక్రమానికి అండగా ఉంటామన్నారు. టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ...రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జాగృతి పనిచేయాలని సూచించారు. ప్రొఫెసర్ సిధారెడ్డి మాట్లాడుతూ...నిరుద్యోగుల కోసం జాగృతి ప్రత్యేకంగా స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తే బాగుటుందని సూచించారు. వేణు సంకోజు మాట్లాడుతూ...మహిళల సాధికారితను చాటిచె ప్పడంలో జాగృతి కృషి చేసిందన్నారు. ఈ సమావేశానికి విక్రాంత్ రెడ్డి, బోనగిరి దేవేందర్, రాజీవ్ సాగర్, నవీనాచారి, వరలక్ష్మీ, డాక్టర్ ప్రభావతి, హైదర్, వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement