
హైదరాబాద్: గిరిజన కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీ వెళ్లనున్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.. రాష్ట్ర ఎంపీలతో కలసి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరమ్‌ను కలవనున్నారు. కోట్లాది మంది సందర్శించే మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని కోరనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ విషయమై అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం చేసినట్లు గుర్తు చేశారు.