
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర హుండీల లెక్కింపు గురువారం హనుమకొండ లష్కర్‌బజార్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో ప్రారంభమైంది

మొదటిరోజు ఉదయం 8.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు లెక్కింపు జరిగింది. 134 ఐరన్ హుండీలను దేవాదాయశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సీసీ కెమెరాల నిఘాలో లెక్కింపు నిర్వహించారు.

హుండీలో కొందరు నకిలీ కరెన్సీ వేశారు. ‘కరెన్సీపై అంబేడ్కర్ బొమ్మ ముద్రించాలి’ అని ఆరు వంద రూపాయల నోట్లపై రాసి ఉంచారు. వాటిని గుర్తించిన అధికారులు పక్కన పడేశారు

మొదటి రోజు ఆదాయం రూ. 3,15,40,000 (మూడు కోట్ల పదిహేను లక్షల నలభై వేలు) లభించింది












