Sammakka Saralamma Celebrations
-
మేడారం జాతర హుండీల లెక్కింపు (ఫొటోలు)
-
'వెన్నెలమ్మ.. వచ్చిందమ్మా..' గుట్ట నుంచి గద్దెపైకి వరాల తల్లిరాక!
వరంగల్: కన్నెపల్లి నుంచి వెన్నెలమ్మ తరలిరాగా.. భక్తజనం పారవశ్యంలో ఓలలాడారు. శివసత్తుల పూనకాలు.. భక్తుల శిగాలతో కన్నెపల్లి ఆలయ ప్రాంగణం మారుమోగింది. జై..సారలమ్మ.. అంటూ భక్తులు గద్దెల వరకు తోడువచ్చారు. మేడారం శ్రీ సమ్మక్క– సారలమ్మ మహాజాతరలో ప్రథమ ఘట్టం బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి రోజు కన్నెపల్లి నుంచి బయలుదేరిన సారలమ్మకు దారిపొడవునా భక్తులు నీరాజనం పలికారు. గుడిలో సాయంత్రం 6 గంటలనుంచి సారలమ్మ తరలివచ్చే తంతు ప్రారంభమైంది. సుమారు గంటన్నరపాటు ఆలయంలో ఒకవైపు కాకవంశీయుల ఆటపాటలతో సందడిగా మారింది. ఇంటినుంచి పూజాసామగ్రితో ఆడపడుచులతో కలిసి ఆలయానికి చేరుకున్న ప్రధాన వడ్డె కాక సారయ్య ఆలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు జరిపారు. పూజారి హారతివ్వగా.. కొద్దిసేపటి తరువాత మరో పూజారి బూర ఊదారు. బుధవారం రాత్రి 7.40 గంటలకు ప్రధాన పూజారి కాక సారయ్య.. సారలమ్మను చేతిలో పట్టుకోగా.. హనుమాన్జెండాతో బయటకు తీసుకువచ్చారు. హనుమంతుడి నీడలో రావడం అమ్మవారి అభయంగా ఉంటుందని విశ్వాసం. అమ్మవారి గుడి ముందు పెళ్లికాని కన్నెపిల్లలు, యువకులు, అనారోగ్యం, సమస్యలతో బాధపడుతున్న భక్తులు వరం పట్టారు. నేలపై పడుకున్నవారి పైనుంచి సారలమ్మ వెళ్తే శుభం కలుగుతుందని విశ్వాసం. అక్కడినుంచి మేడారం బయలుదేరారు. కన్నెపల్లిలోని కాక వంశీయులు ఆడబిడ్డల ఇళ్లవద్దకు సారలమ్మ తరలివెళ్లగా వారు మంగళహారతులు ఇచ్చి నీళ్లు ఆరబోశారు. ఎర్రనీళ్లతో దిష్టితీసి కొబ్బరికాయలను కొట్టారు. తల్లివస్తుందని తెలుసుకున్న భక్తులు విడిది ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరి పసుపు, కుంకుమలను ఎదురుచల్లారు. నాలుగంచెల రోప్‌పార్టీని దాటుకొని వడ్డెలు, పూజారులను తాకాలనే అతృతతో ముందుకు సాగేందుకు ప్రయత్నించారు. వడ్డె సారయ్య.. జంపన్నవాగులో అమ్మవారి కాళ్లుకడిగి మేడారం చేరుకున్నారు. తల్లి సమ్మక్క గుడికి చేరి దర్శించుకోవడానికి ముందుగానే..అప్పటికే సమ్మక్క గుడి వద్దకు చేరుకున్న పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలిసి సారలమ్మ గద్దెలపై కొలువుదీరింది. అమ్మతోపాటు పగిడిద్దరాజు, గోవిందరాజును వారి వారి గద్దెలపై పూజారులు ఆదివాసీ సంప్రదాయబద్ధంగా ప్రతిష్ఠించారు. సారలమ్మను ప్రతిష్ఠించే సమయంలో గద్దెల దర్శనాలను గంటపాటు నిలిపివేశారు. ఈ క్రమంలో మూడుమార్లు విద్యుత్ లైట్లను నిలిపివేసి మళ్లీ ఆన్‌చేశారు. పోలీసుల భారీ బందోబస్తు.. కన్నెపల్లి నుంచి సారలమ్మను పోలీసులు భారీ బందోబస్తు మధ్య గద్దెలపైకి తీసుకువచ్చారు. సారలమ్మ గద్దైపె కొలువుదీరడానికి ముందే పోలీసులు నాలుగు రోప్‌పార్టీలు ఏర్పాటు చేసి వాటి మధ్యలో కన్నెపల్లి ఆదివాసీ యువకులు పూజారులతో కలిసి తల్లిని గద్దైపెకి తీసుకొచ్చారు. రెండు బ్రిడ్జిలు ఉన్నప్పటికీ సారలమ్మను జంపన్నవాగు నీటిలో నుంచి తీసుకురావడం ఆనవాయితీ. ఉదయం ఎస్పీలు శబరీష్, గాష్‌ఆలం, ఏటూరునాగారం ఏఎస్పీ సంకీర్త్ ఆధ్వర్యంలో జంగిల్ డ్రెస్‌తో కూడిన బలగాల మధ్య రోప్ పార్టీ సాగింది. దగ్గరుండి తరలించిన మంత్రి సారలమ్మను తీసుకురావడానికి రాష్ట్ర శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీజ, ఐటీడీఏ పీఓ అంకిత్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ కన్నెపల్లి గుడికి చేరుకున్నారు. అక్కడ పూజాక్రతువును స్వయంగా పరిశీలించి ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ సారలమ్మను తీసుకువచ్చారు. కిక్కిరిసిన జనం ఎటు చూసినా భక్తజనంతో కిక్కిరిసిపోయింది. మంగళవారం రాత్రి ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో పెద్ద ఎత్తున తరలివచ్చారు. బుధవారం రాత్రివరకు మేడారం పరిసర ప్రాంతాలు గుడారాలతో నిండిపోయాయి. జంపన్నవాగు వద్ద ఇసుకేస్తే రాలని పరిస్థితి ఏర్పడింది. వాగులో స్నానాలు ఆచరించిన తర్వాత గద్దెల వద్దకు చేరడానికి కాలినడకన వస్తుండడంతో ఒక్క వాహనం కూడా ముందుకు కదలలేని పరిస్థిత నెలకొంది. రెడ్డిగూడెం, ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. వనదేవతలను దర్శించుకునేందు కు గద్దెల ప్రాంగణంలో పెద్ద ఎత్తున బారులుదీరా రు. వీవీఐపీ, వీఐపీల క్యూలైన్లలోనూ భక్తుల రద్దీ నెలకొంది. మూడు కిలోమీటర్లకు ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి తల్లుల దర్శనం, జంపన్నవాగుకు దారి, ఆర్టీసీ బస్సులు వెళ్లే రూట్లపై అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఐసీడీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద సమాచారాన్ని మైకుల్లో తెలుపుతూ తప్పిపోయిన వారిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. తాడ్వాయి: వరాల తల్లి సమ్మక్క నేడు(గురువారం) చిలకలగుట్ట పైనుంచి గద్దెకు చేరే ఘడియలు ఆసన్నమయ్యాయి. వనం నుంచి జనంలోకి సమ్మక్క రానుంది. ఈ సందర్భంగా వరాల తల్లికి స్వాగతం పలికేందుకు భక్తులు ఎదురుచూస్తున్నారు. అమ్మవారి రాకకు ముందుగా సమ్మక్క పూజారులు గుడిలో శక్తిపీఠాన్ని అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎవరినీ లోనికి రానివ్వకుండా కట్టుదిట్టం చేసి రహస్య క్రతువు చేపడతారు. అనంతరం గుడి నుంచి పూజా సామగ్రి తీసుకువచ్చి గద్దె అలికి కంకవనాలను కట్టి కుంకుమ, పసుపులతో అలంకరిస్తారు.. ఏకాంతంలో నిర్వహించే ఈ ప్రక్రియ సందర్భంగా ఎవరినీ లోనికి రానివ్వరు. అలాగే మేడారంలోని ఆడపడుచులు, ఆదివాసీ కుటుంబాలు, పూజారులు, వడ్డెలు సైతం సమ్మక్క రాకకు ఆహ్వానంగా వారి ఇళ్లను ముగ్గులతో అలంకరిస్తారు. ఇదిలా ఉండగా.. పోలీసులు, రోప్‌పార్టీ సిబ్బంది చిలకలగుట్ట నుంచి గద్దెల వరకు రిహార్సల్స్ చేశారు. అమ్మవారు వచ్చే దారికి ఇరువైపులా బారికేడ్లు అమర్చిన పోలీసులు బుధవారం నుంచి బందోబస్తు నిర్వహించారు. అమ్మవారి ఆగమనం కోసం కోటి మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. ఇవి చదవండి: మేడారంలో నేడు అసలు ఘట్టం ఆవిష్కరణ -
మేడారంలో సమ్మక్క– సారలమ్మల వద్ద భక్తుల కోలాహలం (ఫొటోలు)
-
Medaram Jatara: వన దేవతలకు ‘కోటి’ మొక్కులు
సాక్షి, వరంగల్: వరాలు ఇచ్చే తల్లులు.. వనదేవతలు.. మేడారం సమ్మక్క సారలమ్మ జనజాతర వైభవోపేతంగా జరుగుతోంది. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారులను కోటి మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లకోసారి ఇద్దరు అమ్మవారులు గద్దెలపై రెండురోజుల పాటు కొలువై ఉండడంతో దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో మేడారం జనసంద్రంగా మారి మహానగరాన్ని తలపిస్తుంది. వనదేవతల జనజాతరకు వీఐపీల తాకిడి పెరిగింది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించినప్పటి నుంచి నిరంతరాయంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. బారులు తీరి అమ్మవారులకు ఎత్తు బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లిస్తున్నారు. గద్దెలపై ప్రాంగణంలో జలప్రవాహంలా భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల రద్దీతో సీఎం కేసీఆర్ మేడారం టూర్ రద్దయింది. సీఎం రాకపోయినప్పటికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు పలువురు సమ్మక్క సారలమ్మ దర్శించుకుని మొక్కులు చెల్లించారు. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు అమ్మవారులకు ఎత్తు బంగారం( బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించారు. సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని వనదేవత లను వేడుకున్నట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. వీఐపీల తాకిడి, భక్తుల రద్దీతో పోలీసులు హడాహుడి చేశారు. భక్తులను ఇబ్బందులకు గురిచేశారు. కేంద్ర మంత్రులు వచ్చిన సమయంలో పోలీసులు మీడియా వారిని నెట్టివేయడంతో జర్నలిస్టులు ఆందోళనకు దిగి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
పులిపై సమ్మక్క, జింకపై సారలమ్మ... ఈ రూపాలు ఎలా వచ్చాయో తెలుసా ?
-
సిటీ టు మేడారం బస్సులు, రైళ్లు
మేడారం మహాజాతర వచ్చేసింది. అతిపెద్ద గిరిజనోత్సవమైన సమ్మక్క సారలమ్మ వేడుక ఈ నెల 17వ తేదీ నుంచి 20 వరకు కన్నుల పండువగా జరుగనుంది. జాతర సందర్భంగా హైదరాబాద్ నుంచి తరలి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. మేడారం జాతరతో పాటు హన్మకొండ వేయిస్తంభాలగుడి, ఫోర్ట్ వరంగల్, అద్భుతమైన లక్నవరం సరస్సు, మనోహరమైన రామప్ప టెంపుల్ తదితర ప్రాంతాలను కూడా సందర్శించి తిరిగి నగరానికి చేరుకోవచ్చు. అతి పెద్ద అరణ్యంలో కొలువుదీరిన వనదేవతల సందర్శన ఒక గొప్ప అనుభూతి. వరంగల్ జిల్లాలోని మేడారం జాతర సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. - సాక్షి, సిటీబ్యూరో ⇒ మహాజాతరకు వెళ్లేందుకు నగరం నుంచి ఏర్పాట్లు ⇒ ఈ నెల 17 నుంచి 20 వరకు జాతర ⇒ ప్రతి అరగంటకో ప్రత్యేక బస్సు ⇒ వివిధ ప్రాంతాల నుంచి నడుపనున్న ఆర్టీసీ ⇒ సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు బస్సుల వివరాలివీ... ♦ మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ♦ మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌షుఖ్‌నగర్ బస్స్టేషన్లు, జగద్గిరిగుట్ట, ఉప్పల్ రింగు రోడ్డు నుంచి మేడారం స్పెషల్ బస్సులు బయలుదేరుతాయి. ♦ మేడారం వెళ్లడమే కాకుండా తిరిగి వచ్చేందుకు కూడా ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ♦ ఈ నెల 17 వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ప్రతి అరగంటకు ఒక బస్సు చొప్పున నడుపనున్నారు. ♦ లక్షల సంఖ్యలో భక్తులు తరలివెళ్లనున్న దృష్ట్యా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ గంగాధర్ చెప్పారు. ♦ నగరంలోని అన్ని ఏటీబీ కేంద్రాల నుంచి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ♦ కొంతమంది ప్రయాణికులు కలిసి పూర్తిగా ఒక బస్సును బుక్ చేసుకొనే వెసులుబాటు కూడా ఉంది. ♦ జాతర బస్సులకు సంబంధించిన వివరాల కోసం ఫోన్ : 9959226257, 9959224910,040-27802203, 738201686 నెంబర్లకు సంప్రదించవచ్చు. ఇలా వెళ్దాం... హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా మేడారం చేరుకొనేందుకు 250 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆర్టీసీ బస్సుల్లో అయితే సుమారు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ప్రైవేట్ వాహనాల్లో అయితే 6 గంటలకు పైగా సమయం పట్టవచ్చు. హైదరాబాద్ నుంచి బయలుదేరి హన్మకొండ, వరంగల్, ములుగు, పస్రా,తాడ్వాయి మీదుగా మేడారం చేరుకుంటారు. పస్రా నుంచి రెండు రహదారులు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు పస్రా నుంచి తాడ్వాయి మీదుగా మేడారం చేరుకుంటాయి. ప్రైవేట్ వాహనాలను మాత్రం పస్రా నుంచి నార్లాపూర్, ఊరట్టం మీదుగా మేడారంకు తరలిస్తున్నారు. ఈ మార్గంలో వాహనాల రద్దీ కారణంగా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఒక్క నార్లాపూర్-ఊరట్టం మధ్యన ఉన్న 5 కిలోమీటర్ల దూరానికే ప్రస్తుతం అరగంట నుంచి గంట వరకు సమయం పడుతుంది. 17వ తేదీ నుంచి భక్తుల రద్దీ బాగా పెరగనుంది. అమ్మవార్లు గద్దెపైకి చేరుకొనే రోజు నాటికి ఈ రెండు మార్గాల్లోనూ భక్తులు భారీ సంఖ్యలో తరలి వెళ్లనున్నారు. దీంతో మరింత సమయం పట్టవచ్చు. ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేకంగా బస్టాపులు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో జంపన్నవాగుకు వెళ్లవచ్చు. అమ్మవార్ల గద్దెలు కూడా అంతే దూరంలో ఉంటాయి. ప్రైవేట్ వాహనాల పార్కింగ్ కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి రెండు మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి అమ్మవార్లను సందర్శించుకోవచ్చు. వీటినీ సందర్శించండి.. వైభవోపేతమైన మేడారం మహాజాతరతో పాటు భక్తులు మరికొన్ని చారిత్రక ప్రదేశాలను కూడా ఈ పర్యటనలో సందర్శించవచ్చు. వరంగల్‌లోని వేయిస్తంభాల గుడి, ఖిలా వరంగల్‌తో పాటు, భద్రకాళి దే వాలయానికి వెళ్లవచ్చు. ములుగు నుంచి మేడారం వెళ్లే మార్గంలో జంగాలపల్లికి 15 కిలోమీటర్ల దూరంలో లక్నవరం సరస్సు ఉంటుంది. కాకతీయుల నాటి ఈ అతి పెద్ద సరస్సును వీక్షించేందుకు రెండు కళ్లు చాలవు. ఇక్కడ ఒక దీవి నుంచి మరో దీవికి చేరుకొనేందుకు నీటిపైన ఉన్న వేలాడే వంతెనపై నుంచి నడుచుకుంటూ వెళ్లడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇక జంగాలపల్లికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో అద్భుతమైన పర్యాటక ప్రాంతం రామప్ప టెంపుల్. ఇది కాకతీయుల నాటి శివాలయం. విశాలమైన రామప్ప చెరువు, చుట్టూ అడవి, చెరువు ఒడ్డున కట్టించిన గుడి. ప్రతి ఒక్కరికి గొప్ప అనుభూతినిస్తాయి. ఆకాశ మార్గాన పయనానికి రాని అనుమతి? గగనతల ప్రయాణం ద్వారా మేడారం వెళ్లాలనుకునే వారి కోసం రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేకంగా హెలికాప్టర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇండ్‌వెల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొంది. శుక్రవారం నుంచి బుకింగ్స్ ప్రారంభించింది. బేగంపేట్, లక్నవరం, వరంగల్ నుంచి హెలికాప్టర్ సందర్శన ప్రారంభం కావాలి. కానీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఇండ్‌వెల్ ఏవియేషన్ వారికి అనుమతులే రాలేదు. దీంతో ఇండ్‌వెల్ సంస్థ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇక యాత్రికుల్లోనూ దీనిపై సందిగ్ధత వీడలేదు. ప్రత్యేక రైళ్లు.... ♦ మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు హాజరయ్యే భక్తుల కోసం దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపనుంది. ♦ సికింద్రాబాద్-వరంగల్ (07007/07008) స్పెషల్ ట్రైన్ ఈ నెల 17 నుంచి 20 వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 12.30కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి 3.40 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. ♦ తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5.45 కు వరంగల్ నుంచి బయలుదేరి రాత్రి 9. 30కు నాంపల్లి స్టేషన్‌కు చేరుకుంటుంది. హైదరాబాద్-మేడారం బస్సు చార్జీల వివరాలు... బస్సు పెద్దలకు పిల్లలకు ఏసీ 552 432 సూపర్ లగ్జరీ 447 247 ఎక్స్‌ప్రెస్ 337 187