
మేడారంలో సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. బుధవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి చేరుకుని జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద ఎత్తు బంగారం, చీరసారె, పూలు, పండ్లు, పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు సమర్పించారు

మేడారంలో జాతర ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షకు హాజరైన మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు



























