
మేడారం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో డిజిటల్ సేవలను అందించేందుకు రిలయన్స్ జియో సంసిద్ధమైంది. ఈ ఆదివాసీ మహా జాతరకు హాజరయ్యే కోట్లాది మంది భక్తులకు 4జీ మొబైల్ సేవలను నిరంతరాయంగా అందించనున్నట్టు తెలిపింది. జాతర ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలలో కూడా భక్తులకు జియో నెట్‌వర్క్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. మేడారం జాతరలో జియో భాగస్యామ్యం పట్ల రిలయన్స్ జియో తెలంగాణా సీఈఓ కె.సి.రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''ఈ జాతరలో పాల్గొనేందుకు తెలంగాణలో వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు రానుండటంతో జియో సేవలను విస్తరిస్తున్నాం. దేశవ్యాప్తంగా 4జీ టెలికాం సేవలను అందిస్తూ రిలయన్స్ జియో బ్రాండ్ ఇప్పటికే ప్రతి ఒక్కరికీ చేరువైంది. డిజిటల్ విప్లవాన్ని గ్రామీణ ప్రాంతాలకు కూడా చేరువ చేయడం మా ప్రధాన ఉద్దేశం. మా సరికొత్త ఫీచర్ ఫోన్ 'జియోఫోన్' ద్వారా ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాం'' అని అన్నారు.
ఇటీవలే జియోఫోన్ వినియోగదారులకు ప్రవేశపెట్టిన సంచలన ఆఫర్ రూ.49ను జాతరలో ప్రత్యేక స్టాళ్లలో అందుబాటులో ఉంచింది. కేవలం రూ. 49 చెల్లించి నెల రోజుల పాటు ఉచితంగా, నిరంతరాయంగా మాట్లాడేందుకు ఈ ఆఫర్ వీలు కల్పిస్తోంది. ఈ ప్లాన్ ఎంచుకునేందుకు, కొత్తగా జియోఫోనే కొనేందుకు జాతరలో జియో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయడం విశేషం. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ భారతంలో జియోఫోన్ సరికొత్త శకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గ్రామీణ భారతంలో ఫీచర్ ఫోన్ వాడుతున్న 60 లక్షల మంది వినియోగదారులు ఇప్పడు జియో ఫోన్ అందించే జియో డిజిటల్ లైఫ్‌ను సాధికారికంగా వినియోగిస్తున్నారు. గతంలో కేవలం వాయిస్ నెట్‌వర్క్‌ను మాత్రమే వినియోగించే ఫీచర్ ఫోన్ వినియోగదారులు ఇప్పుడు అందుబాటు ధరలోని జియో ఫోన్, సరసమైన ధరలో ఉండే జియో ఎల్‌టీఈ టారిఫ్ ప్లాన్స్ ద్వారా వీడియో కాల్స్ చేస్తూ అంతులేని మధురానుభూతికి లోనవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment