మేడారానికి అదనపు బస్సులు | Additional buses to medaram | Sakshi
Sakshi News home page

మేడారానికి అదనపు బస్సులు

Published Fri, Feb 5 2016 4:22 PM | Last Updated on Tue, Oct 9 2018 5:58 PM

Additional buses to medaram

వరంగల్ జిల్లా మేడారంలో జరగనున్న జాతరకు సికింద్రాబాద్ నుండి 500 బస్సులను నడుపుతున్నట్లు సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ కొమురయ్య తెలిపారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 16 నుండి ప్రారంభం అవుతున్న మేడారం జాతరకు ఈ నెల పది నుండే బస్సులను నడుపుతున్నట్లు ఆర్‌ఎం తెలిపారు.

ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా నగరంలోని వివిధ ప్రాంతాల నుండి బస్సులను మేడారానికి నడపనున్నట్లు తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ, చార్జీల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని కొమురయ్య వెల్లడించారు. ఆయా కాలనీల్లో బస్సుకు సరిపడా ప్రయాణికులు ఉంటే వారికి అనుకూలంగా రాను పోను బస్సును నడపనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని తెలంగాణా ఆర్టీసీ అధికారులు కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement