మేడారం వద్ద హోం మంత్రి మొక్కులు చెల్లింపు | The Home Minister visited Medaram | Sakshi
Sakshi News home page

మేడారం వద్ద హోం మంత్రి మొక్కులు చెల్లింపు

Feb 17 2016 4:57 PM | Updated on Oct 20 2018 5:05 PM

వరంగల్ జిల్లా మేడారం క్షేత్రాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులతో కలసి బుధవారం సందర్శించారు.

వరంగల్ జిల్లా మేడారం క్షేత్రాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులతో కలసి బుధవారం సందర్శించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో మేడారం వచ్చిన ఆయన అమ్మవారి గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సీఎం ఆదేశాల మేరకు ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చానన్నారు. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర పండుగగా మేడారం జాతరను నిర్విహిస్తున్నామని... రెండేళ్ల తర్వాత వచ్చే జాతరను జాతీయ ఉత్సవరంగా నిర్వహిస్తామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement