నేలకూలి ఉన్న నల్లాలు
ములుగు: మేడారం జాతరలో ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ తరుపున ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు, నల్లాల పనితీరు తేలిపోయింది. రూ. కోట్లు వెచ్చించి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పనులు మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయాయి. వాస్తవానికి సమ్మక్క–సారలమ్మ వన ప్రవేశం చేయడంతో జాతర ముగిసినప్పటికీ, సంప్రదాయం ప్రకారం మరో వారంపాటు తిరుగు వారం పేరుతో వేలాది మంది అమ్మలను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శనివారం అమ్మలు వన ప్రవే శం చేసినా.. ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చా రు. పలు ప్రాంతాల్లో మరుగుదొడ్ల, మంచినీటి నల్లాలు అం దుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
డోర్లు లేవు.. నీళ్లు రావు..
మహా జాతరను పురస్కరించుకుని ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ తరుపున ఈసారి 10 వేల మరుగుదొడ్లను నిర్మించారు. ఇందులో సుమారు 6 వేల మరుగుదొడ్లను ప్రధానంగా చిలుకలగుట్ట, జంపన్న వాగు స్నానఘట్టాలు, పడిగాపురం, రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి, ఆర్టీసీ బస్ పాయింట్, కొంగల మడుగు, నార్లాపురం, చింతల్‌క్రాస్‌తో పాటు పార్కింగ్ ప్రాంతాల్లో నిర్మించారు. వాటికి నీటి సరఫరా విషయంలో మొదట్లో తడబడిన అధికారులు జాతర ముగింపు సమయంలో తేరుకుని భక్తుల అవసరాలకు అనుగణంగా అందించడంతో సఫలీ కతమయ్యారు. కాని, శనివారం రాత్రి నుంచి మరుగుదొడ్ల తీ రు అధ్వానంగా మారింది. అత్యవసరానికి మరుగుదొడ్ల వైపు పరుగులు తీసిన భక్తులకు నిరాశను కల్పించిం ది. ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల ద్వారాలు, బేషన్లు పూర్తిగా ధ్వంసమై ఉం డడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా జాతర పరిసరాల్లో మహిళాలు తంటాలు పడ్డా రు. జంపన్న వాగు పక్కన సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించిన మరుగుదొడ్లు, శాశ్వ త ప్రాదిపదికన నిర్మించిన సులభ్ కాం పెక్స్‌లను ఆశ్రయిం చారు. మరుగుదొడ్ల సంగతి ఇలా ఉండగా.. వంటలు, ఇతర అవసరాల కోసం అధికారులు ఏర్పా టు చేసిన నల్లాలు అలంకార ప్రాయంగానే మారాయి. నల్లా ల నుంచి నీటి సరఫరా లేకపోవడంతో తంటాలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో నల్లాలు నేలకొరిగి కనిపించాయి. మొత్తానికి జాతర జరిగిన నాలుగు రోజులు మాత్రమే పనికి వచ్చే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేశారని భక్తులు వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment