సాక్షి, వరంగల్ రూరల్: సమ్మక్క జాతర నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొలంది. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ముందుగా ఇంట్లో సమ్మక్కను చేసి జాతరకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకోవడం అనావాయితీగా వస్తోంది. గత వారం పది రోజుల నుంచి గ్రామాల్లో ఎక్కడ చూసినా సమ్మక్క–సారలమ్మ పూజలే కనిపిస్తున్నాయి. కోరికలు నేరవేడంతో సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి ఎత్తు బంగారం (బెల్లం), కోడి, యాటలతో మొక్కులు చెల్లిస్తున్నారు. పండుగ సందర్భంగా తమ బంధువులందరిని పిలిచి విందు చేస్తున్నారు. జాతరలో సమ్మక్క–సారలమ్మల గద్దెల వద్ద మొక్కులు చెల్లించిన తర్వాత ఎత్తు బంగారాన్ని బంధువులు, ఇంటి చుట్టు ప్రక్కన వాళ్లను పంచిపెట్టడం అనవాయితీగా వస్తోంది.
ఒడి బియ్యం
కోరుకున్న కోరిక నేరవేరితే ఒడి బియ్యం పోస్తామని మొక్కుతారు. ఇలా మొక్కుకున్న వారు ఒక్కరి నుంచి తొమ్మిది మంది వరకు ఒడి బియ్యం పోస్తున్నారు. ఇంట్లో సమ్మక్కను చేసేప్పుడు జోగినికి (దేవుడు ఉన్న వ్యక్తి) ఒడి బియ్యాలు పోస్తున్నారు.
ఊపందుకున్న విక్రయాలు
సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో బెల్లం, కొబ్బరి కాయలు, కోళ్లు, గొర్రెలు, మేకల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. కొబ్బరికాయ ధరలు కొండెక్కడంతో భక్తులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదపు రూ.60 కోట్లకు పైగా బెల్లం వ్యాపారం, రూ.2 కోట్లకు పైగా గొర్రెలు, కోళ్లు, కొబ్బరికాయల విక్రయాలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment