festivel celebrations
-
నేడు వసంత పంచమి: దేశంలోని ప్రముఖ సరస్వతి ఆలయాలివే!
ఈరోజు (ఫిబ్రవరి 14).. వసంత పంచమి.. అంటే చదువుల తల్లి సరస్వతీ దేవి జన్మదినోత్సవం. దేశవ్యాప్తంగా ఈరోజు సరస్వతీమాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. అదేవిధంగా ఈ రోజున చిన్నారులకు అక్షరాభ్యసాలు కూడా చేయిస్తుంటారు. అయితే దేశంలోని సరస్వతి ఆలయాల విషయానికొస్తే తక్కువగానే ఉన్నాయి. దేశంలోని ప్రముఖ సరస్వతీ దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భీమపుల్ సరస్వతి ఆలయం (ఉత్తరాఖండ్) ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ధామ్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో భీమపుల్ సరస్వతి ఆలయం ఉంది . ఇక్కడ సరస్వతీ మాత స్వయంగా వెలిశారని చెబుతారు. ఇక్కడ సరస్వతీమాత భీమా నది సమీపంలో ఉద్భవించారు. బాసర సరస్వతి ఆలయం (తెలంగాణ) బాసర గ్రామం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ముధోల్ పరిధిలో ఉంది. ఇక్కడ గోదావరి ఒడ్డున సరస్వతీమాత ఆలయం ఉంది. దీనిని మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయానికి సమీపంలో వాల్మీకి సమాధి స్థలం కూడా ఉంది. ఆలయంలో లక్ష్మీదేవి కూడా దర్శనమిస్తుంది. ఆలయంలో సరస్వతీమాత విగ్రహం పద్మాసన భంగిమలో నాలుగు అడుగుల ఎత్తుతో కూడి ఉంటుంది. ఆలయానికి తూర్పున మహంకాళి ఆలయం కూడా ఉంది. పుష్కర్ సరస్వతి ఆలయం (రాజస్థాన్) రాజస్థాన్‌లోని పుష్కర్ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బ్రహ్మదేవుని ఆలయం, జ్ఞాన సరస్వతి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ సావిత్రిమాత ఆలయం కూడా ఉంది. సరస్వతీ మాత ఇక్కడ నది రూపంలో కొలువుదీరిందని విశ్వసిస్తారు. శృంగేరి శారదా ఆలయం(కర్నాటక) జగద్గురు శంకరాచార్యులు నెలకొల్పిన నాలుగు పీఠాలలో కర్నాటకలోని శృంగేరి పీఠం ఒకటి. శృంగేరిలో శారదాంబ ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ శారదాంబ ఆలయాన్ని, దక్షిణామ్నాయ పీఠాన్ని ఏడవ శతాబ్దంలో ఆచార్య శ్రీ శంకర్ భగవత్పాదులవారు నిర్మించారు. మూకాంబిక ఆలయం(కేరళ) కేరళలోని ఎర్నాకులం జిల్లాలో మూకాంబిక ఆలయంగా పేరొందిన సరస్వతి మాత ఆలయం ఉంది. చరిత్రలోని వివరాల ప్రకారం ఇక్కడి రాజులు మూకాంబిక దేవిని పూజించేవారు. ప్రతి సంవత్సరం మంగళూరులో ఉత్సవాలు నిర్వహించేవారు. అయితే భక్తులు అక్కడికి వచ్చేందుకు పలు ఇబ్బందులు పడేవారట. ఒకరోజు అక్కడి రాజుకు కలలో అమ్మవారు కనిపించి, తనకు ఆలయాన్ని నిర్మించాలని కోరారట. ఇక్కడ కొలువైన సరస్వతీ దేవి విగ్రహం తూర్పు ముఖంగా ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయిస్తుంటారు. మైహార్ శారదా ఆలయం (మధ్యప్రదేశ్) మైహార్ శారదా ఆలయం.. మాతా కాళికా ఆలయంగానూ, సరస్వతీ ఆలయంగానూ పేరొందింది. ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని సత్నా నగరానికి సమీపంలో త్రికూట కొండపై ఉంది. సరస్వతీమాత.. శారదాదేవి రూపంలో ఇక్కడ దర్శనమిస్తుంది. భోజశాల (మధ్యప్రదేశ్) మధ్యప్రదేశ్‌లోని ధార్ నగరంలో భోజశాల ఆలయం ఉంది. ఇక్కడ ప్రతీ సంవత్సరం వసంత పంచమి నాడు సరస్వతీ దేవి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ రోజున సరస్వతి అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. భోజరాజు సరస్వతీ దేవి భక్తుడు. ఆయనే ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. విద్యా సరస్వతీ ఆలయం (తెలంగాణ) విద్యా సరస్వతి ఆలయం తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో ఉంది. కంచి శంకర మఠం ఈ ఆలయాన్ని పర్యవేక్షిస్తుంటుంది. ఈ ఆలయంలో లక్ష్మీ గణపతి ఆలయం, శనీశ్వరుని ఆలయం, శివాలయం ఇతర దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. -
దీపోత్సవానికి అయోధ్య ముస్తాబు
శ్రీరాముడు అయోధ్యకు చేరుకున్న సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ నిర్వహించే దీపావళికి ఇంకా కొద్దిరోజులే ఉంది. ఈ నేపధ్యంలో శ్రీరామునికి స్వాగతం పలికేందుకు యూపీలోని అయోధ్య నగరాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. దీపావళి రోజున అయోధ్యలో దీపాల పండుగతో పాటు పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రామాయణంలోని పలు సంఘటనల ఆధారంగా వివిధ నృత్య , సంగీత కార్యక్రమాలను కళాకారులు ప్రదర్శించనున్నారు. రామాయణంలోని వివిధ పాత్రలతో కూడిన శకటాలు రామకథా పార్కుకు చేరుకుంటాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీటికి సారధ్యం వహిస్తారు. దీపావళి రోజున సరయూ నది ఒడ్డున నిర్వహించే దీపోత్సవం కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజున ఇక్కడికి తరలివచ్చే భక్తుల కోసం అధికారులు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. గట్టి భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: యోగి సర్కార్ దీపావళి కానుక.. వీధి వ్యాపారులకు పండుగే పండుగ! -
ఐదు పండుగలు.. సెలవు రోజుల్లోనే
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది (2020)కి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవులను రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. వీటిలో ఐదు పండుగలు సెలవురోజులైన ఆదివారాలు, రెండో శనివారం రోజున రానుండడం విశేషం. వారాంతపు సెలవురోజుల్లో ఇవి రానుండడంతో ఆ మేరకు ఉద్యోగులు సెలవులు కోల్పోయినట్టే. ఆదివారం సెలవుల్లో రిపబ్లిక్ డే, బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి, మొహర్రం, విజయదశమి ఉండగా, దీపావళి పండుగ రెండో శనివారం వస్తోంది. ఇవే కాదు మరో ఐచ్ఛిక సెలవు(బసవ జయంతి) సైతం ఆదివారమే రానుంది. వచ్చే ఏడాది (2020)లో వచ్చే సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులతోపాటు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం కింద వచ్చే సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వివరాలివీ.. -
ఇంటింటా సమ్మక్క..
సాక్షి, వరంగల్ రూరల్: సమ్మక్క జాతర నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొలంది. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ముందుగా ఇంట్లో సమ్మక్కను చేసి జాతరకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకోవడం అనావాయితీగా వస్తోంది. గత వారం పది రోజుల నుంచి గ్రామాల్లో ఎక్కడ చూసినా సమ్మక్క–సారలమ్మ పూజలే కనిపిస్తున్నాయి. కోరికలు నేరవేడంతో సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి ఎత్తు బంగారం (బెల్లం), కోడి, యాటలతో మొక్కులు చెల్లిస్తున్నారు. పండుగ సందర్భంగా తమ బంధువులందరిని పిలిచి విందు చేస్తున్నారు. జాతరలో సమ్మక్క–సారలమ్మల గద్దెల వద్ద మొక్కులు చెల్లించిన తర్వాత ఎత్తు బంగారాన్ని బంధువులు, ఇంటి చుట్టు ప్రక్కన వాళ్లను పంచిపెట్టడం అనవాయితీగా వస్తోంది. ఒడి బియ్యం కోరుకున్న కోరిక నేరవేరితే ఒడి బియ్యం పోస్తామని మొక్కుతారు. ఇలా మొక్కుకున్న వారు ఒక్కరి నుంచి తొమ్మిది మంది వరకు ఒడి బియ్యం పోస్తున్నారు. ఇంట్లో సమ్మక్కను చేసేప్పుడు జోగినికి (దేవుడు ఉన్న వ్యక్తి) ఒడి బియ్యాలు పోస్తున్నారు. ఊపందుకున్న విక్రయాలు సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో బెల్లం, కొబ్బరి కాయలు, కోళ్లు, గొర్రెలు, మేకల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. కొబ్బరికాయ ధరలు కొండెక్కడంతో భక్తులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదపు రూ.60 కోట్లకు పైగా బెల్లం వ్యాపారం, రూ.2 కోట్లకు పైగా గొర్రెలు, కోళ్లు, కొబ్బరికాయల విక్రయాలు జరగనున్నాయి. -
మహిమల తల్లి ‘మహాంకాళి
► నేటి నుంచి వాయిపేట మహాంకాళి జాతర ► వేలాదిగా తరలిరానున్న భక్తులు ► నాలుగు రోజులపాటు కొనసాగనున్న జాతర ఆదిలాబాద్ కల్చరల్ : ఇంద్రవెల్లి మండలంలోని వాయిపేట గ్రామంలో మహాంకాళి, కాహంకాళి దేవతలు కోలువై ఉన్నారు. ఈ దేవతల దర్శనానికి వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు నాలుగు రోజుల పాటు జాతర నిర్వహించనున్నారు. ఈ జాతరలో ఒక్కో రోజు 5 క్వింటాళ్లకు పైగా వంటకాలు చేసి మహా భోజనాన్ని నిర్వహిస్తారు. కొర్కెలు తీర్చే అమ్మవారి వద్దకు వచ్చే భక్తులకు ఆరోగ్య చికిత్స కోసం ఆయుర్వేదిక్ మందులను కూడా కినక శంభు మహారాజ్ ఉచితంగా పంపిణీ చేయనున్నారు. కష్టాల్లో ఉన్నవారిని అమ్మవారు ఆదుకుంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మహిమల మహాంకాళి.. మారు మూల అటవీ ప్రాంతంలో వాయిపేట గ్రామం ఉంది. రోడ్డు సౌకర్యాలు కూడా లేని ప్రాంతం వాయిపేట కానీ మహాంకాళి తల్లిని దర్శించుకునేందుకు వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. మహాంకాళి కాహాంకాళి అక్క చెల్లెళ్లు ఊయల్లో ప్రతిష్టించబడ్డారు. వీరు నిత్యం ఊయలలోనే పూజలందుకుంటారు. ఈ ఆలయాన్ని 15 సంవత్సరాల క్రితం కినక శంభు మహారాజ్ స్థాపించారు. 10 ఏళ్లపాటు వెలుగు చూడని వైనం.. ఆదిలాబాద్ పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలోని.. ఇచ్చోడ నుంచి 30 కిలోమీటర్లు ఇంద్రవెల్లి ప్రాంతం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ వాయిపేట మహాంకాళి మాత ఆలయం ఉంది. ఈ మందిరాన్ని గత 15 సంవత్సరాల క్రితం కినక శంభు మహారాజ్ తన సొంత భూమిలో ఆలయాన్ని నిర్మిచారు. తనకు స్వప్నంలో (మహాంకాళి) మాత కనిపించి ఆలయం నిర్మించమని కోరినట్లు.. దీంతో చిన్న గుడిసెలో మహాంకాళి మాతను ఊయలలో ప్రతిష్టించినట్లు కినక శంభు మహారాజ్ పేర్కొన్నారు. ఈ మహాంకాళి తల్లిని ప్రతిష్టించిన మహారాజ్ కినక శంభు సోంతగా 15 ఏళ్లపాటు పూజలు చేస్త్తున్నారు. కోరిన కోర్కెలు తీరుస్తుండడంతో అమ్మవారి దర్శనానికి ఇతర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సాంస్కృతిక పోటీలు... వాయిపేట మహాంకాళి జాతరను పురస్కరించుకుని నాలుగు రోజుల పాటు వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు విజేతలకు ప్రథమ బహుమతి రూ. 4101, ద్వితీయ బహుమతి రూ. 2101, తృతీయ రూ. 1101 బహుమతి అందించనున్నట్లు వారు పేర్కొన్నారు. 22వ తేదీ సాయంత్రం కంసూర్నాటకం ఉంటుందని పేర్కొన్నారు. అదే త రహాలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఏర్పాట్లు చేశాం.. ప్రతి ఏడాది మహాంకాళి తల్లి జాతరను నిర్వహిస్తున్నాం. భ క్తులు వేలాది సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. గత నాలుగైదేళ్లుగా వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలోని పలు ప్రాంతాల నుంచి మహరాష్ట్ర ప్రాం తాల నుంచి వచ్చి మొక్కులు తీర్చికుని పోతారు. ఆయుర్వేదిక్ మందులు చెట్ల మందులను భక్తుల కొన్ని రోగాలు నయం కావడానికి అందిస్తుంటాం. నమ్మకంగా వచ్చి మొక్కులు తీర్చుకుని వెళ్తుంటారు. భక్తుల నుంచి ఏమి ఆశించము. వారే అమ్మవారిని నమ్ముకుని మొక్కు తీరితే నోములు, వస్తువు కట్నకానుకలు సమర్పిస్తారు. - కినక శంభు మహరాజ్, మహాంకాళి ఆలయ వ్యవస్థాపకుడు గ్రామస్తులమంతా ఏర్పాట్లు చేస్తున్నాం మా గ్రామమే కాకుండా ఇతరాత్ర ప్రాంతాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో వస్తుంటారు. మా గ్రామస్తులమంతా జాతరను ఘనంగా నిర్వహిస్తాం. భక్తుల కోసం జాతర సమయంలో రోజుకు నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల అన్నదానం చేస్తాం. గ్రామస్తులు సర్పంచ్ల సహకారంతో నీటి సౌకర్యం కల్పించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం. కొందరు భక్తులు అన్నదానం చేస్తారు. కానుకలు సమర్పిస్తారు. మొక్కులు తీర్చే తల్లి. అటవీ ప్రాంతంలో ఉండటంతో అభివృద్ధికి నోచుకోలేదు. - రాము, భక్తుడు, వాయిపేట