
మేడారం జాతరలో విషాదం చోటు చేసుకుంది.
సాక్షి, వరంగల్: మేడారం జాతరలో విషాదం చోటు చేసుకుంది. జాతరకు వచ్చిన ఓ బాలింత ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని మృతి చెందింది. వివరాలు.. నిర్మల్ జిల్లా సాద్గం కు చెందిన కళాభాయ్ కుటుంబం సమ్మక్క- సారక్క జాతరకు వచ్చింది. కళా భాయ్ గర్భిణి కావడంతో ఆమెకు జాతర లో పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో హుటాహుటిన ఆమెను ఏటూరు నాగారం ఆస్పత్రికి తరలించారు.
అక్కడ మగబిడ్డకు జన్మనిచ్చిన కలాభాయికి అధిక రక్త స్రావం కావడంతో చికిత్స నిమిత్తం వరంగల్ వెళ్లాల్సిందిగా స్థానిక వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో బాలింతను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తుంగా.. జాతరకు వెళ్లే వాహనాలతో ములుగు నుంచి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రెండు, మూడు గంటల పాటు ట్రాఫిక్‌జాం ఏర్పడటంతో మార్గమధ్యలోనే బాలింత మృతి చెందింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.