జాతరకు ప్రత్యేక రైళ్లు | Special trains to fair | Sakshi
Sakshi News home page

జాతరకు ప్రత్యేక రైళ్లు

Published Thu, Feb 11 2016 1:25 AM | Last Updated on Tue, Oct 9 2018 5:58 PM

Special trains to fair

ఈ నెల 17 నుంచి 20 వరకు నడపనున్న దక్షిణమధ్య రైల్వే
మూడు మార్గాల్లో 16 రైళ్లు

 
హన్మకొండ : మేడారం జాతరకు వచ్చే భక్తుల ఇబ్బందులను ప్రస్తావిస్తూ ‘మేడారం జాతరకు రైళ్లు లేవా’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన వార్తకు రైల్వేశాఖ స్పందించింది. వరంగల్ జిల్లా మీదుగా వెళ్లే మూడు ప్రధాన మార్గాల్లో ఆరు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు ఈ రైళ్లు  సిర్పూర్‌కాగజ్‌నగర్, హైదరాబాద్, ఖమ్మం వైపు ప్రయాణిస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లకు 14 బోగీలు ఉంటాయి.
   
సికింద్రాబాద్-వరంగల్ ప్రత్యేక రైలు ఈ నెల 17 నుంచి 20 వరకు ప్రతీరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5:45 గంటలకు వరంగల్‌లో బయల్దేరి రాత్రి 9:30 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైలు మార్గమధ్యంలో మౌలాలీ, చర్లపల్లి, ఘట్‌కేసర్, బీబీనగర్, భువనగిరి, రాయగిరి, వంగపల్లి, ఆలేరు, పెం బర్తి, జనగామ, రఘునాథపల్లి, ఘన్‌పూర్, పెండ్యాల, కాజీపేట స్టేషన్లలో ఆగుతుంది.
     
సిర్పూర్ కాగజ్‌నగర్-ఖమ్మం ప్రత్యేక రైలు ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఉదయం 5:30 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో బయల్దేరి ఉదయం 11:15 గంటలకు ఖమ్మం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5గంటలకు ఖమ్మంలో బయల్దేరి రాత్రి 11గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుతుంది. మార్గమధ్యంలో రాలపేట, ఆసిఫాబాద్‌రోడ్, రేపల్లెవాడ, రెచ్నీరోడ్, బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రఖని, మంచిర్యాల, పెద్దంపేట, రామగుండం, రాఘవాపురం, పెద్దపల్లి, కొత్తపల్లి, కొలనూరు, ఓదెల, పొత్కపల్లి, బిసుగిర్‌షరీఫ్, జమ్మికుంట, ఉప్పల్, హసన్‌పర్తి, కాజీపేట టౌన్, వరంగల్, చింతల్‌పల్లి, ఎలుగూరు, నెక్కొండ, ఇంటికన్నె, కేసముద్రం, తాడ్లపూసపల్లి, మహబూబాబాద్, గుండ్రాతిమడుగు, గార్ల, డోర్నకల్, పాపటపల్లి, మల్లెమడుగు స్టేషన్లలో ఆగుతుంది.
     
కాజీపేట-సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రత్యేక రైలు ఈ నెల 17న కాజీపేటలో రాత్రి 7 గంటలకు బయల్దేరి రాత్రి 11:30 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 20 సాయంత్రం 5:30 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో బయల్దేరి రాత్రి 9 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. మార్గమధ్యంలో పాలపేట, ఆసిఫాబాద్ రోడ్డు, రేపల్లెవాడ, రేచిని రోడ్డు, బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రఖని, మంచి ర్యాల, పెద్దంపేట, రామగుండం, రాఘవాపురం, పెద్దపల్లి, కొత్తపల్లి, కొలనూరు, ఓదెల, పొత్కపల్లి, బిషిగిరి షరీఫ్, జమ్మికుంట, ఉప్పల్, హసన్‌పర్తి స్టేషన్లలో ఆగుతుంది. అరుుతే, ఈ రైలు రాకపోకలు సమయాలు జాతరకు వచ్చే ఆయా ప్రాంత ప్రయాణికులకు ఉపయోగకరంగా లేవనే విమర్శలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement