కరీంనగర్ జిల్లాలోని 83 ప్రాంతాల్లో సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ జోయస్ డేవిస్ తెలిపారు.
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని 83 ప్రాంతాల్లో సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ జోయస్ డేవిస్ తెలిపారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో సమావేశం నిర్వహించారు. జాతరకు హాజరయ్యే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.
అవసరమైతే ఎన్‌ఎస్‌ఎస్, వాలంటీర్లు, యూత్ సంఘాల సభ్యుల సేవలు వినియోగించుకుంటామన్నారు. మేడారం వెళ్లే వాహనాలకు ప్రత్యేక రూట్లు ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వన్ వే , ఫోర్ వీలర్లకు ఒక దారి, బస్సులకు, భారీ వాహనాలకు మరో దారి ఏర్పాటు చేశామని తెలిపారు.