కరీంనగర్‌ఎడ్యుకేషన్: జిల్లాలో పదోతరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినటు్ల్లు డీఈవో కె.లింగయ్య తెలిపారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఈనెల 25 నుంచి ఏప్రిల్ 11 వరకు పరీక్షలు ఉంటాయని అన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ జిల్లాకు చెరిందని తెలిపారు. విద్యార్థులకు హాల్‌టిక్కెట్ల పంపిణీ పూర్తి అరుునట్లు వివరించారు. ప్రశ్నాపత్రాలను మూడు నాలుగు రోజుల నుంచి ఆయా డివిజన్ ఉప విద్యాధికారుల ఆధ్వర్యంలో పంపిణీ చేపట్టినట్లు చెప్పారు.
మూడు విడతలుగా మూడు సెట్లను పోలీస్ స్టేషన్లలో భద్రపర్చనున్నామని, పరీక్షల నిర్వహణకు సంబంధించి డీఈవో కార్యాలయంతో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయంతో పాటు ఆయా డివిజన్లలో సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, కస్టోడియన్ ఆఫీసర్లతో సమావేశం ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు జరుగకుండా తగిన సూచనలు ఇవ్వడం జరిగిందని పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యూయని తెలిపారు.
274 పరీక్షకేంద్రాలు..
పదోతరగతి వార్షిక పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 63,319 మంది విద్యార్థులు హాజరవుతున్నారని.. అందుకోసం 274 కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు డీఈవో తెలిపారు. 58,558 మంది రెగ్యూలర్, 4761 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. హిందీ పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఉంటుందన్నారు. విద్యార్థి మాల్‌ప్రాక్టీస్ చేస్తే అయితే మరుసటి రోజు నుంచి పరీక్షకు అనుమతి లభించబోదని స్పష్టం చేశారు.
చీఫ్ సూపరింటెండెంట్‌కు మాత్రమే సెల్‌ఫోన్ వాడేందుకు అవకాశం ఉంటుందని, మిగతా వారు పరీక్ష కేంద్రాల్లో సెల్‌ఫోన్ వాడరాదని వెల్లడించారు. ఇన్విజిలేటర్లుగా విధుల నిర్వహణకు వచ్చే ఉపాధ్యాయులను సంబంధిత ఎంఈవోలు ఒకరోజు ముందుగానే విడుదల చేయాలని సూచించారు. పదోతరగతి పరీక్షలు నిర్వహించేందుకు దాదాపు 4500 మంది ఉపాధ్యాయులకు విధులు అప్పగిస్తున్నట్లు డీఈవో వెల్లడించారు. 274 మందిని చీఫ్ సూపరింటెండెంట్లు, 274 మంది డిపార్టుమెంటల్ అధికారులు, 17 మంది అదనపు డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించినట్లు తెలిపారు.
పోలీసు, రెవెన్యూ, రవాణా, ఆర్టీసీ, ఆరోగ్యశాఖ, ట్రాన్స్‌కోతో పాటు సంబంధిత అధికారులతో ఇటీవలే సమీక్ష నిర్వహించామన్నారు. ఇన్విజిలేటర్ల నియామకములో టీఏ, డీఏల భారం పడకుండా పకడ్బందీగా నియమిస్తున్నామని, పరీక్ష విధులు నిర్వహించే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులు, ఇన్విజిలేటర్ల నియామకాలను పరీక్ష కేంద్రానికి 8 కిలో మీటర్ల పరిధిలో గల ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకే విధులు కల్పించనున్నట్లు తెలిపారు. సిబ్బంది సరిపోకపోతే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. మాస్‌కాపీయింగ్‌ను నిరోధించడానికి 14 స్క్యాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఒక రాష్ట్ర పరిశీలికుడిని నియమించిందని వెల్లడించారు.
సిట్టింగ్‌స్క్యాడ్ బృందాలతో పాటు ఒక రెవెన్యూ, పోలీసు అధికారి విధుల్లో ఉంటారని అన్నారు. ప్రతి పరీక్షకేంద్రానికి ఒక సూపరింటెండెంట్, ఒక డిపార్ట్‌మెంటల్ అధికారినిని నియమించడం జరిగిందని, అలాగే 300 మంది విద్యార్థులు దాటినప్రతి పరీక్ష కేంద్రానికి ఒక డిపార్ట్‌మెంటల్ అధికారిని నియమించినట్లు తెలిపారు. పరీక్షలు నిర్వహించే కేంద్రాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపేందుకు ఆదేశించారని, హాల్‌టిక్కెట్లు చూపితే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత ప్రయాణం ఉంటుందని చెప్పారు.
‘పది’కి పకడ్బందీ ఏర్పాట్లు
Published Fri, Mar 13 2015 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM
Advertisement
Advertisement