ఆలయ ఆవరణలో వేసిన చలువ పందిళ్లు
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్న క్షేత్రంలో ఈనెల 29నుంచి 31 వరకు జరిగే హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 5లక్షలకు పైగా దీక్షాపరులు తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తారు. ఇప్పటికే ఆలయ ఆవరణతో పాటు.. సెక్యూరిటీ గది సమీపంలో చలువ పందిర్లు పూర్తి చేశారు. బొజ్జ పోతన్న సమీపంలో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. పాత కోనేరుపై విమర్శలు వసున్నా.. నీటీ ఎద్దడి ఉన్నా.. ప్రత్యేక చొరవతో అందులో నీరు నింపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
కొనసాగుతున్న ఏర్పాట్లు..
హనుమాన్ చిన్న జయంతికి వచ్చే భక్తులకు తాగునీరు, చలివేంద్రాలు, విద్యుత్, చలువ పందిర్లు, మరుగుదొడ్లు, భోజనం, భారీకేడ్లు, పార్కింగ్ వసతి, సీసీ కెమెరాలు, వైద్యం, శానిటేషన్, క్యూలెన్లు, దర్శనంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా తాగునీటికోసం 20 చలివేంద్రాలు ఉండగా.. రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో మరో 20 చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. చలువ పందిర్లు వేసిన చోట విద్యుత్ వైర్లలో డ్యామేజ్ లేకుండా.. వికలాంగులకు, వృద్ధులకు కొండగట్టు కిందినుంచి దొంగలమర్రి మీదుగా కొండపైకి వచ్చేందకు కలెక్టర్ శరత్ చొరవతో 24 గంటలు.. 4 మినీ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.
దాదాపు 4లక్షల లడ్డూలు, పులిహోర ప్యాకెట్లను ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచనున్నారు. నాచుపెల్లి గ్రామంలోని బావుల ద్వారా ట్యాంకర్ల సాయంతో కొండపైకి నీటిని తీసుకురావడం.. వందకుపైగా తాత్కాలిక మరుగుదొడ్లు.. వై–జంక్షన్ నుంచి బొజ్జ పోతన్న వరకు లైటింగ్, అదనంగా మరో 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పాత కోనేరులో సైతం భక్తులు స్నానాలు ఆచరించేందుకు అందులో ఎప్పటికప్పుడు నీటిని అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.
తాగునీటికోసం ప్రత్యేక ఏర్పాట్లు..
యేళ్లకేళ్ళుగా నెలకొన్న తాగునీటీ సమస్యపై అధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. కొండ దిగువన, బొజ్జ పోతన్న వద్ద, కాలినడకన వచ్చే భక్తులకు చలివేంద్రాల ద్వారా నీరు అందిచనున్నారు.
వీధిలైట్లు ఏర్పాటు..
రాత్రి సమయంలో దొంగలమర్రి నుంచి గట్టు మీదకు కాలినడకన వచ్చే భక్తుల సౌకర్యార్థం దారికి ఇరువైపుల నూతనంగా విద్యుత్ స్తంభాలు, లైట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
అందుబాటులో మరుగుదొడ్లు..
జయంత్యుత్సవాలకే వచ్చే భక్తులకోసం కొండ దిగువన.. ౖకొండపెన ఉన్న శాశ్వత మరుగుదొడ్లే కాకుండా, బొజ్జ పోతన్న ప్రాంతంలో, కొండపైకి వెళ్లే మార్గమధ్యలో తాత్కలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment