
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రాశస్త్యం ఏడాదికేడాది విశ్వవ్యాప్తమవుతోంది. భక్తుల సౌకర్యార్థం యాప్ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే అనంతమైన సమాచారం ఇందులో పొందవచ్చు. ‘సమ్మక్క–సారలమ్మ జాతర మేడారం’పేరుతో కాకతీయ సొల్యూషన్స్ సహకారంతో ఈ యాప్ రూపొందించారు. అందులో జాతరలో భక్తులకు సేవలందించే సెక్టార్ అధికారులు, జాతర జరిగే తేదీలు, సంస్కృతి, సంప్రదాయాలు, కార్యక్రమాలు, ట్రాఫిక్ నియంత్రణ, చూడదగిన ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలు, స్నానఘట్టాలు, వైద్య శిబిరాలు, హెల్ప్‌లైన్, బస్సులు వెళ్లు, ఆగు స్థలాలు, పోలీస్ స్టేషన్లు, ఫైర్ సిబ్బంది, మరుగుదొడ్లు, తాగునీటి వసతి ఎక్కడ ఉన్నాయనే సమాచారం ఆ యాప్‌లో పొందుపరిచారు.
జాతరకు వచ్చే భక్తులకు దారి మధ్యలో చూడదగిన ప్రాంతాల్లో ఎలాంటి సౌకర్యాలు ఉంటాయని కూడా ఇందులో నిక్షిప్తం చేశారు. గిరిజన జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి సమాచారం కోసమైనా ఈ యాప్‌తోపాటు వెబ్‌సైట్‌ను రూపొందించారు. www.medaramjathara.com వెబ్‌సైట్‌లో కూడా సమాచారం నిక్షప్తం చేయడం మూలంగా దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఈ సమాచారం ఎంతగానో దోహదపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment