యావత్ ప్రపంచం అంతా ఆశ్చర్యపోయేలా జరిగే మహత్తర జాతర ఈ ఆదివాసీ జాతర. ఇంత పెద్ద ఆదివాసీ జాతర ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు. ఆదివాసీలు, ఆదివాసీయేతరులు లక్షలాదిగా తరలివచ్చే ఎంతో ప్రకృతి రమణీయమైన జాతర. మేడారం జాతరలో విగ్రహ ఆరాధన ఉండదు. కేవలం ప్రకృతి ఆరాధన, పసుపు కుంకుమలు తప్ప మరే ఇతర ఆచా రాలు ఉండని జాతర మేడారం జాతర.
ఏదో ఒక పేరుతో ఆదివాసీల్ని అడవినుండి వెళ్లగొ ట్టాలనే కుట్రలు మన పాలక ప్రభుత్వాల విధానాలుగా ఉన్నాయి. అందుకే ఆధ్యాత్మికతను జోడించి ప్రశ్నించే తత్వాన్ని పారదోలేందుకు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. అడవిని నమ్ముకుని జీవించే ఆదివాసీల రాగా లాపన ఈ మేడారం జాతరలో కనిపిస్తుంది. ఆదివాసీల ప్రాకృతిక ఆరాధనకు, ఆధిపత్య ప్రతిఘటనకు ప్రతీకగా ఈ మేడారం జాతర నిలుస్తుంది. ఆధిపత్య సంస్కృ తుల్ని సవాల్ చేస్తూ ప్రత్యామ్నాయ సంస్కృతుల్ని రూపొందిం చుకునే క్రమానికి స్థానికంగా ఆదివాసీ సమాజం ఎది గింది. అందువలనే ప్రకృతిని తప్ప మరో మనిషి ముందు సాగిలపడే సంస్కృతికి ఆదివాసీ సమాజంలో స్థానం లేదు. ఇక్కడ ఫ్యూడల్ మంత్రతంత్రాల ప్రసక్తి లేదు. నిర ర్థకమైన క్రతువులకు చోటు లేదు. అంతటా ప్రకృతికి, మానవ ప్రత్యామ్నాయానికి పెద్ద పీట వేయటం ఈ జాత రలో కనిపించే దృశ్యం.
మరోవైపు మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించి, జాతీయ పండుగగా గుర్తించాలని రాష్ట్ర ప్రభు త్వం కేంద్ర ప్రభుత్వాన్ని అధికారికంగా కోరింది. అదే గనుక జరిగితే ఆదివాసీల అస్తిత్వం అంతమవుతుంది. మేడారం జాతరపై పాలక వర్గాల ఒత్తిడి, ఆధిపత్యం ఎక్కువవుతుంది. ఆదివాసీలు జాతరకు దూరమవు తారు. గిరిజనేతరుల వలసలు, ఆధిపత్యం ఎక్కువై జాతర నిర్వహణ గిరిజనేతరుల చేతిలోకి, దేవాదాయ శాఖ చేతిలోకి పోతుంది. ఆదివాసీల పోరాట చరిత్ర కనుమరుగు అవుతుంది.
ఆదివాసీల చట్టాలు, జీవోల రాజ్యాంగ రక్షణలు, భూములు ఎలాగో పోయాయి. ఆదివాసీల అస్తిత్వమైన మేడారం జాతరను సైతం ఆదివాసీలకు దూరం చేయా లని పాలకులు, గిరిజనేతరులు కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలు, కుతంత్రాలకు వ్యతిరేకంగా, ఆదివాసీలు కాక తీయులపై కత్తులు దూసి ఆదివాసీ స్వయంపాలన కోసం పోరాడిన సమ్మక్క, సారలమ్మల పోరాట వార సత్వాన్ని పుణికిపుచ్చుకొని మేడారం జాతరను కాపా డుకోవాలి.
(జనవరి 25 నుండి ఫిబ్రవరి 3 వరకు మేడారంలో జరుగనున్న సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా)
– వూకె రామకృష్ణ దొర
ఆదివాసీ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు
98660 73866
Comments
Please login to add a commentAdd a comment