వరంగల్లో ఎన్కౌంటర్ : ఇద్దరు మావోయిస్టులు మృతి | Two maoists killed in warangal district | Sakshi
Sakshi News home page

వరంగల్లో ఎన్కౌంటర్ : ఇద్దరు మావోయిస్టులు మృతి

Published Tue, Sep 15 2015 7:29 PM | Last Updated on Tue, Oct 9 2018 5:58 PM

వరంగల్లో ఎన్కౌంటర్ : ఇద్దరు మావోయిస్టులు మృతి - Sakshi

వరంగల్లో ఎన్కౌంటర్ : ఇద్దరు మావోయిస్టులు మృతి

వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం అటవీ ప్రాంతంలో మంగళవారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.

వరంగల్ : వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం అటవీ ప్రాంతంలో మంగళవారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మేడారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అటవీ ప్రాంతంలో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. 

మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులకు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. దాంతో మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. ఘటన స్థలంలోని 2 ఆయుధాలు, కిట్ బ్యాగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మృతి చెందిన ఇద్దరు మావోయిస్టులు కేకేడబ్ల్యూ దళం సభ్యులని పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ నుంచి 10 రోజుల క్రితమే సదరు మావోయిస్టులు వరంగల్ జిల్లాలో ప్రవేశించారని పోలీసులు చెప్పారు. పరారైన మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement