భితిల్లిన ఏవోబీ
24 మంది మావోయిస్టులు హతం
వారిలో 11 మంది మహిళలు
ఇద్దరు గ్రేహౌండ్స్ కమెండోలకు గాయాలు
వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి
భారీగా ఆయుధాలు స్వాధీనం
మరణించిన వారిలో 5గురు కీలక నేతలు
పలువురు డీసీఎం, ఏసీఎం సభ్యులు
మృతుల్లో చలపతి, అరుణ భార్యాభర్తలు
అరుణ సోదరుడు ఆజాద్ గత ఏడాది ఎన్‌కౌంటర్‌లో హతం
మిగిలిన మావోల కోసం అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున గాలింపు
తాజా ఘటనలతో వణికిపోతున్న ఏజెన్సీ
తూరుపు తలుపు ఇంకా తెరుచుకోలేదు.. చీకటి తెరలు తొలగలేదు.. ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాంతం.. అక్కడ బస చేసిన మావోయిస్టులు పూర్తిగా ఆదమరిచి ఉన్నారు.. అంతటా తుపాను ముందు ప్రశాంతత.. అంతే నిశ్శబ్దంగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన వందలాది పోలీసు బలగాలు.. అంతే.. క్షణాల్లో ప్రశాంతత చెదిరిపోయింది. ఇరువైపుల నుంచీ తుపాకుల గర్జనలు.. తూటాల వర్షం.. వాటి మోతతో అటవీప్రాంతం దద్దరిల్లింది.. రక్తసిక్తమైంది.. ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా మృతదేహాలు.. ఎటు చూసినా భయానక వాతావరణం.. ఏవోబీలోని జంత్రి-రామ్‌గడ్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్‌కౌంటర్ స్థలంలో కనిపించిన దృశ్యమిది.. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా గ్రేహౌండ్స్ దళాలు పక్కా సమాచారంతో గత కొద్దిరోజులుగా ప్రణాళిక ప్రకారం జరిపిన ఈ దాడిలో మావోయిస్టులకు చావుదెబ్బ తగిలింది. ఏవోబీలో మావోయిస్టుల ఉనికినే ప్రశ్నార్థకం చేసింది. రాష్ట్రంలోనే ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా నిలిచిన ఈ ఘటనలో కీలకమైన నేతలను మావోయిస్టు పార్టీ కోల్పోయింది. ఆర్కే ప్రధాన లక్ష్యంగా సాగిన ఈ ఆపరేషన్‌లో ఆయన మాత్రం తప్పించుకోగలిగాడు. అయితే కుమారుడు మున్నాను కోల్పోయాడు.
ఈ ఘటనలో 24 మంది మావోయిస్టులు..
ఒక గ్రేహౌండ్స్ కమెండో మరణించారు..
సంఘటన స్థలంలోనే 18 మంది మావోల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండగా.. మరో ఆరుగురు తప్పించుకునే ప్రయత్నంలో తూటాలకు బలై పరిసర ప్రాంతాల్లో కూలిపోయారు.
పాడేరు: దశాబ్దాల నుంచి ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) మావోరుుస్టులకు కీలక స్థావరంగా ఉంది. గణపతి, రామకష్ణ, నంబాల కేశవరావు వంటి మావోరుుస్టు అగ్రనేతలు ఏవోబీలో మకాం వేసి కీలక సమావేశాలు నిర్వహించేవారు. దళసభ్యులకు సేప్టీజోన్‌గా ఏవోబీని ఏర్పరుచుకుని పార్టీని బలోపేతం చేస్తూ కార్యకలాపాలు సాగిస్తున్నారు. పార్టీలో ఈ ప్రాంతానికి చెందిన వారు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఏవోబీలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఏవోబీలో విస్తతంగా గాలింపు చర్యలు నిర్వహిస్తున్న పోలీసు బలగాలకు చిక్కకుండా పైచేరుుగా కార్యకలాపాలు సాగిస్తున్న మావోరుుస్టు పార్టీకి ఈ ఏడాది ఊహించని విఘాతం కలిగింది. చింతపల్లి ప్రాంతానికి చెందిన మావోరుుస్టు కీలకనేత సెంట్రల్ రీజన్ కమిటీ కమాండర్ కుడుముల వెంకటరమణ అలియాస్ రవి ఏప్రిల్ 9న అనారోగ్యంతో మతి చెందాడు. మే 5న కొయ్యూరు మండలం మర్రిపాకలు ఎదురు కాల్పుల్లో గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి ఆజాద్‌తోపాటు మరో ఇద్దరు మావోరుుస్టులు మతి చెందారు. ఇటీవల జీకేవీధి మండలం చీపురుగొంది అటవీ ప్రాంతంలో గాలికొండ ఏరియా కమిటీకి చెందిన నర్సింగ్, ఆంబ్రి అనే ఇద్దరు మావోరుుస్టులు పోలీసులకు పట్టుబడ్డారు.
వరుస ఘటనలతో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న మావోరుుస్టు పార్టీకి ఇప్పుడు కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. భీకరమైన ఎదురుకాల్పుల్లో ముఖ్యనేతలతో సహా 24 మందిని పోలీసులు మట్టుబెట్టడంతో, ఇన్నాళ్లూ తిరుగులేని ఆధిపత్యంతో ఏవోబీని గడగడలాడించిన మావోరుుస్ట్ పార్టీ తుడిచిపెట్టుకుపోరుునట్టే కనిపిస్తోంది. ఏళ్ల కిందట అనకాపల్లి, చోడవరం పోలీస్ స్టేషన్‌పై మావోరుుస్టు పార్టీ నిర్వహించిన దాడికి సూత్రధారిగా వ్యవహరించిన నాయకుడు చలపతి ఈ ఎదురు కాల్పుల్లో మతి చెందారు. ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా చిరకాలం నుంచి మావోరుుస్టు పార్టీ కార్యకలాపాలకు మార్గదర్శకం వహిస్తూ ఏవోబీలో కీలకనేతగా వ్యవహరిస్తున్నారు.
బలిమెలకు ప్రతీకారం
ఏవోబీలో కూంబింగ్ ముగించుకుని 2008 జూన్ 29న లాంచీలో విశాఖ వస్తున్న 36 మంది గ్రేహౌండ్‌స కమాండెట్లపై మా వోరుుస్టులు దాడి చేశారు. వారంతా జలసమాధి అయ్యారు. లాంచీలో నుంచి మ తదేహాలను తీసేం దుకు చేపట్టిన ఆపరేషన్ వా రానికి పైగానే నడచింది. నాటి నుంచి మావోరుుస్టుల ఏరివేతలో ఒడిశా సహకారం లేదని ఏపీ జారుుంట్ కూంబింగ్‌ను నిలిపివేసింది. బీజేపీ అధికా రంలోకి వచ్చాక కేంద్ర హోం మంత్రి రాజనాధ్‌సింగ్ రెండు రాష్ట్రాల అధి కారులతో సమావేశం ఏర్పాటు చేశారు.దీంత ఉమ్మడి కూంబింగ్ తిరిగి పుం జుకుంది. మావోరుుస్టులను ఎదుర్కోవడంలో దేశంలోనే అత్యుత్తమ శిక్షణ పొందిన గ్రేహౌండ్‌స బలగాలే మావోరుుస్టులపై ఎదురు కాల్పులు జ రిగినట్టుగా తెలుస్తోంది.
వణుకుతున్న మన్యం
సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌తో విశాఖ మన్యం వణుకుతోంది. సహచరులను కోల్పోరుున మావోరుుస్టులు ఎలాంటి విధ్వంసాలకై నా పాల్పడే వీలుంది. ఈమేరకు పోలీసులు అప్రమత్తం మయ్యారు. రాజకీయ పార్టీల నేతలను అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తోంది.మావోరుుస్టులు సంఖ్య పరంగా బలహీన పడ్డా ఉనికి కోసం ఏదైనా చేసే అవకాశం ఉందని పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.