వేర్వేరు ఎన్కౌంటర్లలో జవాన్, మావోయిస్టు మృతి | one jawan and maoist killed in deffarent encounters | Sakshi
Sakshi News home page

వేర్వేరు ఎన్కౌంటర్లలో జవాన్, మావోయిస్టు మృతి

Published Sat, Jun 20 2015 3:17 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

one jawan and maoist killed in deffarent encounters

విశాఖపట్నం/రాయ్పూర్: పోలీసులు, మావోయిస్టులకు మధ్య శనివారం జరిగిన రెండు వేరువేరు ఎదురు కాల్పుల్లో ఒక జవాన్ సహా మావోయిస్టు మృతిచెందారు. విశాఖ జిల్లా మంచంగిపుట్టు మండలం గోప్రాపడ వద్ద పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతిచెందగా, సంఘటనా స్థలం నుంచి రెండు 303 రైఫిల్స్, 4 గ్రానైట్లు, 10 కిట్ బ్యాగులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అటు ఛత్తీస్గఢ్లో పోలీసులపై మావోయిస్టులు పంజా విసిరారు. దంతెవాడ జిల్లా తుమ్నార్ అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న ప్రత్యేక పోలీసు బలగాలను చుట్టుముట్టిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక జవాన్ మృతిచెందగా, మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఛత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్ మావోయిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement