ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్: మావోయిస్టు మృతి | maoist killed in encounter in chhattisgarh | Sakshi
Sakshi News home page

ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్: మావోయిస్టు మృతి

Published Wed, Aug 24 2016 10:51 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

maoist killed in encounter in chhattisgarh

ఛత్తీస్గఢ్: సుక్మా జిల్లాలో మావోయిస్టులకు భద్రత బలగాలను మధ్య బుధవారం ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందగా... మిగిలిన మావోయిస్టులు పరరైయ్యారు. మృతి చెందిన మావోయిస్టు వద్ద నుంచి రివాల్వర్ను భద్రత దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

సుక్మా జిల్లాలో భద్రత దళాలు గత అర్థరాత్రి నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఆ క్రమంలో మావోయిస్టులకు భద్రత దళాలు తారసపడ్డారు. దీంతో వారిపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. వెంటనే భద్రత దళాలు ఎదురుకాల్పులకు దిగాయని ఉన్నతాధికారి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement